*ధర్మం సనాతనమైనది - మతం కాలానుగుణంగా మారునది*
ధర్మంబెప్పుడు నిత్యము
మర్మంబెరిగిన మతంబు కాలవశమురా!
ధర్మమతములొకటౌనా!
చర్మశరీరంబు ఆత్మకమలంబొకటా!
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
*ధర్మం సనాతనమైనది - మతం కాలానుగుణంగా మారునది*
ధర్మంబెప్పుడు నిత్యము
మర్మంబెరిగిన మతంబు కాలవశమురా!
ధర్మమతములొకటౌనా!
చర్మశరీరంబు ఆత్మకమలంబొకటా!
అన్నదానము గొప్పదనవచ్చునే గాని
అన్నంబు జాములో నరిగి పోవు
వస్త్రదానము గూడ భవ్యదానమె గాని
వస్త్రమేడాదిలో పాతదగును
గృహదానమొకటి యుత్కృష్ట దానమె గాని
కొంప కొన్నేండ్లలో కూలిపోవు
భూమిదానము మహా పుణ్యదానమె గాని
భూమి యన్యుల జేరి పోవవచ్చు
అరిగిపోక , ఇంచుకయేని చిరిగిపోక
కూలిపోవక యన్యుల పాలుగాక
నిత్యమయి, వినిర్మలమయి,నిశ్చలమయి
యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి
- చిలకమర్తి లక్ష్మి నరసింహం
గత కొన్ని రోజులుగా సనాతన ధర్మం గురించి ఒక వ్యక్తి వ్యాఖ్యనాల గురించి అనుకూల అననుకూల చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఖండిస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు. కొందరు సమర్థిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇంతకుముందు చాలామంది చేసిన ఇప్పుడెందుకు ఇంత రచ్చ జరుగుతుంది. ముఖ్య కారణం అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకు, ఆ రాష్ట్రానికి మంత్రి మరియు ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి, మీడియా రేటింగ్ పెంచుకోవడానికి కల్పిస్తున్న విపరీత ప్రచారం.
అసలు సనాతన ధర్మం ఏమిటి? ఇది తెలుసుకొనే ముందు సనాతన ధర్మ లోపాలు ఏమిటి?
1. అది కులాలు పుట్టించింది. వైరాలు పెంచింది.
2. అంటరానితనాన్ని పెంచి పోషించింది. - ప్రస్తుతం లేదు
3. బాల్య వివాహాలను ప్రోత్సహించింది. - ప్రస్తుతం లేదు
4. దేవదాసి,జోగిని వ్యవస్థను తీసుకు వచ్చింది. - ప్రస్తుతం లేదు
5. వితంతువులకు వివాహం వ్యతిరేకించింది. - ప్రస్తుతం లేదు
6. సతీ సహగమనం ప్రోత్సహించింది. - ప్రస్తుతం లేదు
7. శూద్రులకు వేద విద్యను వ్యతిరేకించింది.- ప్రస్తుతం లేదు
8. వరకట్నం, కన్యాశుల్కం వంటి దురాచారాలను తీసుకువచ్చింది. - ప్రస్తుతం చట్ట పరంగా నేరం
9. తలక్కారం, ముళకరం వంటి పన్నులకు కారణం అయ్యింది. - ప్రస్తుతం లేవు.
ఇక మిగిలింది, నిర్మూలించాల్సింది కుల వ్యవస్థను. దీనిని అందరు భావిస్తున్నట్టు సనాతన ధర్మం పుట్టించిందని అనుకున్నా ఇంకా పెంచి పోషిస్తున్నది సనాతన ధర్మమా? కాదు ప్రజలు, ప్రభుత్వాలు మరియు పార్టీలు మాత్రమే. ఈ వ్యాఖ్యలకు మూలమైన డిఎంకె వాళ్ళు వీటిని పక్కన పెట్టగలరా ? అసలు కులాల వారిగా రిజర్వేషన్లు 69 శాతానికి పెంచింది వాళ్ళే కదా. కులాలు పుట్టింది వారు చేసే పనిని బట్టి కాని జన్మననుసరించి కాదు. మరి అన్ని కులాల వాళ్ళు అన్ని పనులు చేస్తున్నప్పుడు ఇంకా కులమనే పదం మనకు అవసరమా? అది కదా అసలు నిర్ములించాల్సింది. భారత దేశం నుంచి వెలివేయాల్సింది కులాన్నికానీ సనాతన ధర్మాన్ని కాదు. అది ఏ పార్టీ చేసిన దానిని స్వాగతించాల్సిందే,కానీ ఎవ్వరు దాని జోలికి పోలేరు, వెళితే ఆ పార్టీల మనుగడే ఉండదు. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేయరు. నాకు కులం వద్దని ప్రజలు బలంగా కోరుకున్నప్పుడు కుల వ్యవస్థ పోతుంది, కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తే కాదు. ఎందుకంటే ధర్మం అనేది కులమతాలకు అతీతమైనది. అది భారతీయుల జీవన విధానం. అది వసుధైక కుటుంబాన్ని కోరుకున్నది, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకున్నది. ప్రకృతితో మమేకమై జీవించడం నేర్పింది. అన్నిటా దేవుణ్ణి దర్శించటం నేర్పింది. దీనికి వ్యతిరేకంగా వచ్చిన ఆచారాలు, వ్యవహారాలు ఏవైనా వస్తే అవి కొందరు పాలకుల పైత్యం వల్ల, అప్పటి పరిస్థుతుల వల్ల, అవిద్య, అజ్ఞానం ద్వారా వచ్చాయి.
కృష్ణాష్టమి సందేశం:
మనలో చాలా మందికి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను మనం ఎలా చూస్తున్నాం?ఎలా అర్ధం చేసుకుంటున్నాం? ఎలా స్పందిస్తున్నాం?అన్న దాని మీద అతని ఎదుగుదల, జీవితంలోని విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. అయితే చాలామంది తమకు మాత్రమే వచ్చిన సమస్య పెద్దదని, తనలాంటి సమస్య మరొకరికి లేదని, తనకున్న సమస్యలు కారణంగానే ఇలా ఉండిపోయానని, మారిపోయానని అంటూ ఉంటారు.
కర్ణుడు సమస్యలు :
1. పుట్టగానే తల్లి వదిలేసింది.
2. సూతుడి ఇంట్లో పెరిగాడు.
3. నువ్వు క్షత్రియుడవు కాదు అని కారణం చెప్పి ద్రోణుడు విద్య నేర్పలేదు.
4. క్షత్రియుడని అబద్ధం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకున్నాడు.
5. అబద్ధం బయటపడి పరశురాముడు అవసరమైన సమయంలో విద్యను మరిచిపోయేలా శాపం ఇచ్చాడు.
6. కర్ణుడు, ఒకసారి శబ్దభేది బాణం ప్రయోగిస్తున్నప్పుడు, ఒక ఆవును అడవి జంతువుగా భావించి, దానిపై ప్రయోగించి చంపుట కారణంగా ఆ గోవు యజమాని అయిన బ్రాహ్మణుడి వల్ల శపించబడ్డాడు.
7. ద్రౌపది స్వయంవరంలో సూత పుత్రుడినని పరాభవం జరిగింది.
8. దుర్యోధనుడు ఒక్కడే నాకు గౌరవం ఇచ్చాడు. అందువల్ల నేను అతని పక్షాన యుద్ధం చేయటం తప్పెలా అవుతుందని సమర్ధించుకొన్నాడు. తన ప్రాణాలని కోల్పోయాడు.
కృష్ణుడు సమస్యలు:
1. చెరసాలలో పుట్టాడు. పుట్టగానే తల్లి నుండి వేరుచేయబడ్డాడు.
2. రాజకుమారుడిలా పెరగాల్సినవాడు గోశాలల దగ్గర పెరిగాడు.
3. పుట్టినప్పటినుండి ఎంతోమంది చంపటానికి ప్రయత్నించారు.
4. 16 సంవత్సరాలకు గాని విద్య నేర్చుకోవడం ప్రారంభించలేదు.
5. కోరుకున్న యువతిని పెండ్లి చేసుకోలేకపోయాడు.
6. జరాసంధుని నుండి తనవారిని రక్షించుకోవడంకోసం స్వంత ఊరిని వదలి ద్వారకకు వెళ్లాల్సి వచ్చింది. పిరికివాడు అని అందరిచేత అనిపించుకున్నాడు.
7. అతని మొదటి కొడుకుకూడా పుట్టగానే అతని నుండి వేరు చేయబడ్డాడు.
8. శమంతకమణి అపహరించావని అవమానిస్తే ఆ అపవాదుని కష్టపడి తొలగించుకొన్నాడు.
కానీ కృష్ణుడు ఎప్పుడు కుంగిపోక యోగ సాధనపై దృష్టి పెట్టాడు. అందరికి పూజ్యుడయ్యాడు. గీతను ఉపదేశించి జగద్గురువయ్యాడు.
ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు, సవాళ్ళు ఉంటాయి. ఏ ఒక్కరి జీవితం పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగా సాగదు. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుస్తుంది.. మనకు ఎంత అన్యాయం జరిగినా..ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు దక్కాల్సింది దక్కకపోయినా.. ఏ సందర్భంలోనైనా మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. ఇదే మనిషికి చాలా ముఖ్యమైంది. ఎన్ని బాధలు పడ్డా, అవమానాలు ఎదురైనా ధర్మాన్ని వదులరాదన్న జీవిత సారం కృష్ణుడు బోధించాడు.
జయహో కృష్ణం వందే జగద్గురుం
నీవు లేనిదే నేను పూర్తికాను
చావు రానిదే నిను వదలిపోను.
జన్మదిన శుభాకాంక్షలు నాలోని సగమా
మన్మదిలో సతతం శోభించే నా ప్రియ ఉమా!
తననుకున్నది జరగకపోతే చావాలి
తాను కోరుకున్నది దక్కకపోతే చావాలి
తనను తిరస్కరిస్తే చావాలి
తనను తిరస్కరిస్తే చంపాలి
తనకు కావాల్సింది దక్కకుంటే చంపాలి
తనకనుకూలంగా జరగకపోతే చంపాలి
చావటంలోనైనా చంపటంలోనైనా
ముగిసిపోయేది ఒక జీవితమని
మిగిలిపోయేది కన్నవారి కలలని
మిగిల్చిపోయేది అంతులేని విషాదమని
పగిలిపోయేది వారి గుండెలని
ఒక్క క్షణకాలం ఆలోచించలేని
ఆలోచింప చేయలేని కులమెందుకు?
మతమెందుకు? ధనమెందుకు?
పరువెందుకు? చదువెందుకు?
అరచేతిన ప్రపంచ జ్ఞానం ఒడిసి పట్టిన మానవుడా!
మర బొమ్మల చేసి మర బొమ్మవైన రాక్షసుడా!
మధురమైన బంధమంటే మగువ పొందొకటే కాదు.
నువు బ్రతికి, బ్రతికించటం నేర్చుకో
పోయేదంతా మంచికని తెలుసుకో
ధర్మం వీడకుంటే అంతకు మించి దక్కుతుందని తెలుసుకో
నిత్యం గీతను స్మరించుకో
నిన్ను నువ్వు సంస్కరించుకో
తోడబుట్టిన అక్కను చంపె,
పాడు మోహము, పాపము చేసె
తోడుగ ప్రియుండు ఉమరుడుండ.
చూడు నీ బతుకును
బాగుచేయతరమా! అందరు
వాగుచుందురు చులకన చేసి
వేగు చుందురు వేడినూనెన
కాగు మిడతల వలె
కామానికి, మోహానికి, ప్రేమకు
తేడా తెలియక క్షణికావేశంలో
ఎంతకైనా తెగించే
ఈ వైఖరికి కారణం ఎవ్వరు?
సాధించాలని సరదా పడితే చాలదు
సాధించగలనన్న నమ్మకం సడల రాదు
సాధించాలన్న తపన వదల రాదు
సాధించాల్సిన లక్ష్యం నుండి దృష్టి మరల రాదు
సాధించాల్సిన లక్ష్యం వైపు పయనం ఆపరాదు
నిజంగా లోతైన ఆలోచన కలిగించే వ్యాసం👇 🌼 మహిళల తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రయత్నించారా? 🌼 మనం తరచుగా తెలివి...