లోకాన్ని ఏలేటి ఓ శంకరా !
నీ జాడేందో చెప్పవయ్య ఓ దేవరా !
వెండికొండనుంటావని ఓ శంకరా
కొండంతా వెదికాను ఓ దేవరా
కాశీలోన ఉంటావని ఓ శంకరా
గంగంతా ఈదాను ఓ దేవరా "లోకాన్ని ఏలేటి"
శ్రీశైలానుంటావని ఓ శంకరా
అడవంతా తిరిగాను ఓ దేవరా
ఏ లోకానున్నావో ఓ శంకరా
పుడమంతా వెదికాను ఓ దేవరా "లోకాన్ని ఏలేటి"
గౌరమ్మ నడిగాను ఓ శంకరా!
నీ జాడంతా చెప్పింది ఓ దేవరా!
నీలోనే లీనమైతే ఓ శంకరా!
నా గుండెలోన ఉన్నావు ఓ దేవరా! "లోకాన్ని ఏలేటి"
లోకాన్ని ఏలేటి ఓ శంకరా!
నీ జాడేందో తెలిసింది ఓ దేవరా!
నాలోనే ఉన్నావని ఓ శంకరా!
తెలియకుండ తిరిగాను ఓ దేవరా!
లోకాన్ని ఏలేటి ఓ శంకరా!
నీ జాడేందో తెలిసింది ఓ దేవరా!
నీ జాడేందో తెలిసింది ఓ శంకరా!
నీ జాడేందో తెలిసింది ఓ దేవరా!
రచన: శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
శివరాత్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివరాత్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
26, ఫిబ్రవరి 2025, బుధవారం
లోకాన్ని ఏలేటి ఓ శంకరా !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
భారతీయ మహిళ ఔన్నత్యం
నిజంగా లోతైన ఆలోచన కలిగించే వ్యాసం👇 🌼 మహిళల తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రయత్నించారా? 🌼 మనం తరచుగా తెలివి...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
స్పందించేందుకు సమయం లేదు వివరించేందుకు విషయం లేదు వినేటందుకు ఓపిక లేదు తెలుసుకునేంత తీరిక లేదు మన బ్రతుకేదో బ్రతికేస్తున్నాం మన చావేదో చస్త...