27, సెప్టెంబర్ 2022, మంగళవారం

మంచిమాట - Quotation

ఈనాటి  మంచిమాట:

 

22 అక్టోబర్ 2022 

  

సరైన వైఖరితో

సరైన సాధనాలతో

సరైన సమయంలో

సరైన పద్ధతిలో

సరిగ్గా పనులను చేస్తే

విజయం మీతో దోస్తీ చేస్తుంది.

 

14 అక్టోబర్ 2022

దురాలోచన రాక్షసుని చేస్తుంది.
సదాలోచన మాధవుని చేస్తుంది.

 

13 అక్టోబర్ 2022

రంధ్రాన్వేషణ చేయకు
రసాస్వాదన మానకు

 

10 అక్టోబర్ 2022

తాను జీవించడానికి మూల్యం చెల్లించే ఏకైక జీవి మనిషి

 

 27 సెప్టెంబర్ 2022

చిరునవ్వు ద్వేషాన్ని సైతం జయిస్తుంది.

చిరునవ్వు కోపాన్ని సైతం కరిగిస్తుంది.


4, సెప్టెంబర్ 2022, ఆదివారం

పంచకోశ శుద్ధి - పంచ జ్ఞాన సిద్ధి

భారతీయ వేదాంత తత్వచింతన చెప్పిన ఆధునిక సైకాలజీ సంగతులు:

మనందరం ఆధునిక మనోతత్వశాస్త్రంలో (సైకాలజీ) లో  మనిషి తెలివితేటలు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తరుచుగా IQ గురించి వింటుంటాం. IQ అనే పదాన్ని 1912లో జర్మన్ మనస్తత్వవేత్త విలియం స్టెర్న్ రూపొందించారు. ఒక మనిషి ఎదుగుదలకు IQ చాలావరకు కారణం అవుతుంది. మరోవైపు, పని మరియు వృత్తి వంటి జీవిత రంగాలలో మీ విజయాన్ని నిర్ణయించే విషయంలో EQ ముఖ్యమైనది అనే భావన 1990లలో పుట్టి, 1995లో డేనియల్ గోలెమాన్ పుస్తకం ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని తర్వాత SQ కూడా మనిషి విజయానికి తోడ్పడుతుందని కనుగొన్నారు. ప్రస్తుతం వీటన్నిటికీ తోడుగా AQ కూడా విజయానికి దోహద పడుతుందని వివరిస్తున్నారు. 

సమగ్ర నాయకత్వ విధానానికి, జీవితంలో విజయానికి ఐదు Qలు అవసరం. అవి

1) Physical Quotient (PQ) భౌతిక
2) Intelligence Quotient (IQ) మేధస్సు
3) Emotional Quotient (EQ) ఉద్వేగం
4) Spiritual Quotient (SQ) ఆధ్యాత్మికం  

5) Adversity Quotient (AQ) ప్రతికూలత నెదుర్కొనటం

Physical Quotient: మనిషి విజయంలో వ్యక్తిగత ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ కు గల ప్రాధాన్యత వివరిస్తుంది. ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ లేని వ్యక్తి విజయం పొందే అవకాశాలు తక్కువ.

Intelligence Quotient: ఇది గ్రహణశక్తి స్థాయికి కొలమానం. సమస్యలు పూరించడం, తార్కికంగా ఆలోచించటం మరియు జ్ఞాపకశక్తికి ఇది కొలమానం.

Emotional Quotient: ఇది ఆత్మవిశ్వాసం, స్వయం నియంత్రణ, అనుకూలత మరియు చొరవచూపగలగటం గురించి తెలుపుతుంది. అదేవిధంగా సామాజిక సంబంధాల మెరుగుదల, ఇతరులపట్ల సానుభూతితో వ్యవహరించటం, సేవాధోరణి. స్ఫూర్తిదాయక నాయకత్వ పద్ధతులు; మార్పు నిర్వహణ; సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలు; సమిష్టి కృషి మెళుకువలు గురించి ఇది తెలుపుతుంది.

Spiritual Quotient: ఇది పరిస్థితితో సంబంధం లేకుండా, అంతర్గత మరియు బాహ్య శాంతిని కొనసాగిస్తూ, జ్ఞానం మరియు కరుణతో ప్రవర్తించే సామర్థ్యం. అహంకారాన్ని నియంత్రించగల సామర్ధ్యం. మన ఉద్దేశ్యాలు, విలువలు వాటి పట్ల మన దృష్టి మరియు నమ్మకం కోల్పోకుండా ఉన్నతమైన శక్తినుండి మార్గదర్శకత్వం కోరడం.

Adversity Quotient: ఇది ప్రతికూల పరిస్థితులను చక్కగా నిర్వహించగల సామర్థ్యం మరియు మారుతున్న పరిస్థితులను అనుకులంగా మార్చుకోగల సామర్ధ్యం గురించి తెలుపుతుంది.


ఇప్పుడు భారతీయ ఆధ్యాత్మిక చింతనలో చెప్పబడ్డ పంచకోశాలు గురించి తెలుసుకొందాం. ఈ పంచకోశాలను శుద్ధి చేయడం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకుంటూనే మన జీవితం మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు. ఈ కోశాలు ఐదు రకాలు. అవి
 
1)అన్నమయ కోశము: ఇది భౌతిక కోశం. మనకు కనిపించే శరీరం. మనకు ఉన్న శారీరక రుగ్మతలు లేదా ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. మన శరీరం వివిధ రకాల ఆహారాలకు ఎలా స్పందిస్తుందో కూడా మీరు శ్రద్ధ వహించవచ్చు.అయిదు జ్ఞానేంద్రియాలను కలిగి ఉంటుంది. 1.చూపు,2.వాసన, 3.స్పర్శ,4.రుచి,5.వినికిడి లతో ఉన్న శరీరం అన్న మాట. అలాగే ఆ శరీరంలో ఎముకలు,కండరాలు,అవయవాలు ఈ అన్నమయ కోశ పరిధిలోకే వస్తాయి.దీనిని శుద్ధి చేసుకొనుట ద్వారా మానవుడు శారీరక ఆరోగ్యాన్ని పొందుతాడు. దీనికి ఆహార నియమాలు, యోగాసనాలు ఉపయోగ పడతాయి. ఆయుర్వేద విజ్ఞానం ద్వారా శారీరక రుగ్మతలు తొలగించుకోవచ్చు. మన PQ మెరుగవుతుంది.
2)ప్రాణమయ కోశము: మనం పంచేంద్రియాల ద్వారా గ్రహించినది శరీరంలో ఉన్న పంచ ప్రాణాల ద్వారా మన మెదడుకు చేరవేయబడుతుంది. ఎవరిలో ఈ ప్రాణశక్తి అధికంగా ఉంటుందో వారు మెదడు ఎక్కువ సమర్ధవంతంగా పనిచేస్తుంది. వారి IQ ఎక్కువగా ఉంటుంది. యమ, నియమాలు , ప్రాణాయామం వల్ల ఇది చైతన్యవంతమవుతుంది.
3)మనోమయ కోశము: 'మన" అంటే మనస్సు.ఇది ఆలోచనలు మరియు భావనలు, మెదడు మరియు ఎమోషన్ ల సమ్మిళితం. ఇందులో చేతనా, ఉప చేతనా మరియు అచేతనా అవస్థలు ఉంటాయి. దీనినే కాన్సియస్, సబ్ కాన్సియెస్ మరియు అన్ కాన్స యెస్ అంటాము. మీ మనస్సులో ఏమి జరుగుతుందో అది మీ శరీరంలో కూడా జరుగుతుంది.బాహ్య ప్రపంచం నుండి అనుభవాలు మరియు అనుభూతులను మీ సహజమైన శరీరంలోకి తీసుకువస్తుంది. మీ భావలకు ఉద్వేగాలకు ఇది మూలం. దీనిని నియంత్రించడం ద్వారా మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోగలుగుతారు. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. అందరితోను మీ సంబంధములును మెరుగు పరుచుకుంటారు. అరిషడ్వర్గములు ఈ కోశ శుద్ధి ద్వారా అరికట్టబడతాయి. ఇది ధ్యానం వల్ల సాధ్య పడుతుంది. మీ EQ మెరుగవుతుంది
4)విజ్ఞానమయ కోశము: ఇది మీ అంతర్ దృష్టి మెరుగు పరుస్తుంది. ఇది లోతైన అవగాహనను పెంపొందిస్తుంది మరియు వాస్తవికతను చూడటం నేర్పిస్తుంది. మీరు మీ ఆలోచనలను అహంకారం నుండి వేరుచేయడం నేర్చుకున్నప్పుడు మీరు అంతర్గతంగా అభివృద్ధి చెందుతారు. మీ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేయడం తెలుసుకుంటారు. జీవితంలో జరిగే సంఘటనలకు సాక్షిభూతులుగా ఉంటారు. సమత్వ భావం అలవర్చుకోంటారు. గెలుపు ఓటములు యొక్క ఉద్వేగాలు మిమ్మల్ని చేరవు. మీరు కేవలం మీ ప్రయత్నాన్ని 100% చేయడంపై దృష్టి పెడతారు. ఫలితం ఏదైనా మీరు సిద్ధంగా ఉంటారు. ఈ స్థితి మీరు ధ్యానంలో ఉచ్ఛ స్థితికి చేరినప్పుడు కలుగుతుంది. ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు అనే పరిమితులు ఉండవు. ఏ పరిస్థితి ఎదురైనా అది మీకు అనుకూలంగా మార్చుకోగలిగే జ్ఞానం మీకు కలుగుతుంది. SQ మరియు AQ ను విజ్ఞానంమయ కోశ శుద్ధి చేసుకొనుట ద్వారా వృద్ధి చేసుకోవచ్చు.
5)ఆనందమయకోశము: ఇది ఆత్మ పరమాత్మ, సుఖ దుఃఖములు, ప్రియాప్రియములు మొదలగు ద్వంద్వాలకతీతముగా ఉంటుంది. అందువల్ల మీరొక అద్భుత అలౌకిక ఆనంద స్థితిలో ఉంటారు. మీరు దేనినుండి వేరుకాదు అంతా మీరే అన్న స్పృహ కలుగుతుంది. ఇది  సమాధి స్థితిలో అనుభవం అవుతుంది. 

రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్

రాజులు చేయగ ప్రజలను, వజ్రాయుధ సదృశ, ఓటు రాజ్యాంగ మిచ్చె! భాజాలు కొట్టుటలవడి, రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్!!  -శివ భరద్వాజ్