2, ఏప్రిల్ 2022, శనివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

 మధురమైన ప్రేమలు
పుల్లనైన స్నేహాలు
చేదైన సత్యాలు
కారపు  స్పర్ధలు
వగరపు విరుపులు
ఉప్పుతిన్న కృతజ్ఞతలు
సమపాళ్లలో కలగలసిన
జీవితం కమ్మనైన
ఉగాది పచ్చడిలా సాగిపోవాలని
శుభకృత్ నూతన సంవత్సరంలో
శుభాలు మిమ్మల్ని సదా పలకరించాలని
ఎవరిని ఆశించక జీవితం సాగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
-- శివ భరద్వాజ్
భాగ్యనగరం

భారతీయ మహిళ ఔన్నత్యం

 నిజంగా లోతైన ఆలోచన కలిగించే వ్యాసం👇 🌼 మహిళల తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రయత్నించారా? 🌼  మనం తరచుగా తెలివి...