25, ఆగస్టు 2023, శుక్రవారం

తెలుసుకుంటావా ఓ మానవుడా !

 డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు
నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా సిగ్గు పడటం లేదు పడినా పట్టించుకోవడం లేదు.
జవసత్వాలు ఉడిగినా మానవత్వపు జాడ మరుగవుతున్నా మతం చిచ్చు ఆరడం లేదు  ఆరినా రాజేయడం ఆపడం లేదు.
యవ్వన మోహంలో కన్నవారిని, తమ కన్నవారిని, కట్టుకున్న వారిని కడతేర్చగ వెనకాడడం లేదు ఆడినా మోహపు మత్తు ఆగనివ్వడం లేదు.

తాము బ్రతుకుతున్నది అద్దాల మేడలో అని రాయి తాము విసిరినా
తమపై ఎదుటి వారు విసిరినా నిలువ నీడ లేనిది తమకేనని ఏనాటికైనా
తెలుసుకుంటావా ఓ మానవుడా ! విధి ఆటకు నువ్వు రాజువైన
బంటువైన చేరేది ఒకే విడిదికని తెలుసుకుంటావా ఓ మానవుడా !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కోటియున్న నిద్ర కొన లేము - కోటిఇచ్చిన బాధ వేరొకరు పడరు

కోటియున్నను నిద్రను కొనగ లేము! కోటిఇచ్చిన బాధ వేరొకరు పడరు! నీవు చేసిన తప్పుకు శిక్ష, నీకు  పడుట సత్యము. అక్రమార్జనమువలదు. భావం: కోటి రూపాయల...