5, జూన్ 2022, ఆదివారం

తెలుసుకో మానవుడా - పర్యావరణం ప్రకృతి వరం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 

తెలుసుకో మానవుడా - పర్యావరణం ప్రకృతి వరం 

పర్యావరణం ప్రకృతి వరం
తెలిసినా చేస్తున్నాం నాశనం
అలసత్వం ప్రధాన కారణం
నేనొక్కడిని మారితే మారుతుందా
అని ప్రతి ఒక్కరు తలో చేయేసి చేస్తున్నారీ దారుణం
కొండలు కరగనిదే ఇల్లు కట్టలేం
కాండాలు కోయనిదే పేపర్ చదవలేం
కారులు లేనిదే షికారు చేయలేం
ఏసీలు లేనిదే ఇంట ఉండలేం
ఇవి పర్యావరణానికి చేసే హాని ఊహించలేం
పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా స్థలం పెరగదు
మన ఆవాసం కోసం, అటవీ సంపద కోసం
అడవుల నాశనం చేసి పుడమి తల్లి
ఊపిరితిత్తులు చిదిమేస్తున్నాం
ఆ ఊపిరి ఆగితే మన ఊపిరి
ఆగుతుందని తెలియకుంటున్నాం
అవసరం లేనిదే భూముల స్థలాలు చేసి
విక్రయం చేసి ఫలించే భూమిని గొడ్రాలు చేస్తున్నాం
తెలుసుకో మానవుడా నీ స్వార్ధం కోసం
సర్వ జీవుల ఆవాసాన్ని బలిచేస్తున్నావు
ఆ జీవులలో నీవు ఒకడని తెలుసుకో

----శివ భరద్వాజ్
భాగ్యనగరం


చిన్న స్పందనైనా తెలపకుందామా

ప్రాణములు తీయుచున్నా
మానములు పోవుచున్నా
రణములు పెరుగుతున్నా
కారణములు తెలిసున్నా
మిన్నకుండి పోదామా
కన్నులుండి కనకుందామా
తన్నుచున్నా కదలకుందామా
చిన్న స్పందనైనా తెలపకుందామా
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
 


3, జూన్ 2022, శుక్రవారం

నిజాలు వెలికి తీసి బయట పెడదామా?

ప్రాణాలు పోతున్నా,
కొట్లాటలు పెరుగుతున్నా,
అసత్యాలు ప్రచారం చేస్తున్నా,
పట్టించుకోక ఎవడి అభిప్రాయం వాడిదని ఊరకుండి పోదామా!
స్పందించడం మొదలెడదామా?
నిజమే అనిపించే మాటల గారడి మాయలో పడి పోదామా!
నిజాలు వెలికి తీసి బయట పెడదామా?
నిర్ణయించు మిత్రమా!
ముందడుగు వేయాల్సిన తరుణమిది.
గోముఖ వ్యాఘ్రాల ముసుగు తొలగించాల్సిన సమయమిది.
--శివ భరద్వాజ్
భాగ్య నగరం

1, జూన్ 2022, బుధవారం

ఆందోళన తొలగాలనుకుంటే

ఆందోళన తొలగాలనుకుంటే
ఆందోళన ఏం చేయగలదో
ఆందోళన ఏం చేయగలేదో
ఆందోళన మూల మేమిటో తెలుసుకో
చివరి నిమిష హడావిడి మానుకో
వృత్తిగత, వ్యక్తిగత జీవిత సంతులనం చేసుకో

ఆందోళనలో ఏ తీర్పులు ఇవ్వకు
ప్రతికూల ఆలోచనలు రానివ్వకు
చేయవలసిన పనులన్ని రాసుకో
నీకు తెలిసిన పరిష్కారాలు ఎంచుకో
నీ హితముగోరువారి సలహాలు తీసుకో
ఎప్పుడు నువ్వు ఒంటరివి కావని గుర్తించుకొ
ఒకసారి ఒకే పని చేయగలవని తెలుసుకో

ఆగి ఆగి గాఢమైన ఊపిరి తీసుకో
చిన్న చిన్న విరామాలు
చిన్న చిన్న సరదాలు
నచ్చిన పని చేయడాలు
ఆందోళన తగ్గించును తెలుసుకో

నిజమైన స్నేహితులను పెంచుకో
బలమైన సంబంధాలు నిలుపుకో
నీ గురించి జాగ్రత్తలు తీసుకో
నీకంటూ సమయం కేటాయించుకో

-- శివ భరద్వాజ్
భాగ్యనగరం

ఓటు మన హక్కు - వదులుకోమాకు

 పిల్లలు బాగుండాలని మంచి కాలేజీ చూస్తావు! బతుకు బాగుండాలని మంచి ఉద్యోగం చేస్తావు! అమ్మాయి బాగుండాలని మంచి సంబంధం చూస్తావు! మనము బాగుండాలని  ...