30, జులై 2022, శనివారం

స్నేహం - స్నేహితుడు (అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో )

 స్నేహం - స్నేహితుడు 

మిత్రమా


నీ స్నేహం ఓదార్పు నే భాదలో ఉన్నప్పుడు
నీ స్నేహం కనువిప్పు నే తప్పు చేసినప్పుడు
నీ స్నేహం ఆదరువు నాకే దారి దొరకానప్పుడు
నీ స్నేహం పెన్నిధి నాదగ్గరేది లేనప్పుడు

నే వాఖ్యాతనైతే నా మొదటి శ్రోతవు నువ్వు
నే గాయకుడినైతే నా మొదటి శ్రోతవు నువ్వు
నే నటుడినైతే నా తొలి వీక్షకుడు నువ్వు
నే చిత్రకారునైతే నా తొలి సందర్శకుడు నువ్వు
నే రచయితనైతే నా తొలి విమర్శకుడు నువ్వు
నే కళాకారునైతే నా తొలి ఆరాధకుడు నువ్వు
నే నేదైన నా తొలి చెలికాడు నువ్వు

--శివ భరద్వాజ్
భాగ్యనగరం 

28, జులై 2022, గురువారం

మార్పు రావాలంటే - మనతోనే సాధ్యం

మార్పు రావాలంటే - మనతోనే సాధ్యం


మార్పు రావాలనుకుంటాం
ఓర్పు వహించి ఓటేయం
మార్పు రావాలనుకుంటాం
నేర్పుగా నాయకుని ఎన్నుకోం
మార్పు కోరుకుంటాం
మార్పు మనతో మొదలెట్టం
మార్పు రావాలన్నా
మార్పు కావాలన్నా
మార్పు తేవాలన్నా
మార్పు మనతోనే సాధ్యం
మనం మారితేనే సాధ్యం

 

--శివ భరద్వాజ్,

భాగ్యనగరం

21, జులై 2022, గురువారం

పాలకుల మాయ - ప్రజలు కుక్క గతి పొందు

పాలకుల మాయ - ప్రజలుకు కుక్క గతి పట్టు


కుక్కను చావబాదిన, మాంసపు
ముక్కను చూపగను తోక నూపు,
చక్కగా చెంతను చేరు, మరచు
నిక్కముగ గతము నంతయు, తప్పు
లొక్కటి లెక్కింపక ఉచిత పధకాలకు
నిక్కముగా  ఆశ పడిన ప్రజలకు
కుక్క గతి పట్టు పాలకుల మాయచేతను

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

 

16, జులై 2022, శనివారం

అవని తలమున అతని జన్మ ధన్యము

అవని తలమున అతని జన్మ ధన్యము

ఎవని చేతులు గురువు పాదములంటునో
ఎవని చేతులు తల్లిదండ్రుల కాళ్ళు పట్టునో
ఎవని చేతులు భార్యను పొదివి పట్టునో
ఎవని చేతులు మిత్రులకు అండగా ఉండునో
ఎవని చేతులు పిల్లలకు అభయ మిచ్చునో
ఎవని చేతులు ఇతరులకు సాయమందించునో
అతని చేతులు భవుడు నెప్పుడు వదలడు
అవని తలమున అతని జన్మ ధన్యము

--శివ భరద్వాజ్
భాగ్యనగరం 

15, జులై 2022, శుక్రవారం

ఉచిత పధకాలకు బిచ్చగాళ్లను చేసి

ఉచిత పధకాలకు బిచ్చగాళ్లను  చేసి

 
ఉచిత పధకాలకు బిచ్చగాళ్లను చేసి, అ
నుచితముగ గెలుపుకు గేలమేయుట
ఉచితమగునే, జనుల వృద్ధి జనులు
ఉచితానుచిత విచక్షణ చేసి ఓటేసిన
ఉచితరీతిన కలుగు, నిజ నాయకుడు
ఉచితమగు స్థానం పొందు, దేశం స
ముచిత స్థానం ప్రపంచమున పొందు, సం
కుచిత ధోరణి తొలగి సుఖింతురు జనులు

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

13, జులై 2022, బుధవారం

జ్ఞానమయుని జన్మదినం గురు పూర్ణిమ నేడు


ఏక రాశిగా ఉన్న వేదాలను విభజించి
చతుర్వేవేదములుగా మార్చిన జ్ఞాని
అష్టాదశ పురాణములను రచించి
పంచమ వేదము సృజించిన పద్మయోని
భాగవతుడై మహాభాగవతం రచించి
సమస్త జ్ఞాన సారాన్ని గీతగా రాసెనీ
వ్యాసుడు విశ్వగురువై నిలిచిన చిరంజీవి

కలియుగపు చీకటి చీల్చే
వెలుగు సూరీడు గీత నందించి
అజ్ఞానందకరం పారదోలిన పరమ గురుని
జ్ఞానమయుని జన్మదినం గురు పూర్ణిమ నేడు

గురువులను దైవముగా భావించే
సనాతన భారతీయ గురు పూజోత్సవం నేడు
వ్యాస పూర్ణిమ గురు పూజోత్సవ శుభాకాంక్షలతో
--శివ భరద్వాజ్
భాగ్యనగరం

12, జులై 2022, మంగళవారం

నాకే ఎందుకిలా అని కుమిలిపోకు - నేటిని సరిగ్గా నిర్మిస్తే - విశ్వ విజేతవు నీవే

లేదు లేదు అని బాధపడకు
కాదు కాదు అని నిలిచిపోకు
నాకే ఎందుకిలా అని కుమిలిపోకు
గడిచింది తలచి బాధపడినా
గడిచింది తలచి మిడిసిపడిన
ఒరిగేది వచ్చేది ఏమి లేదు
మరి మార్చగలిగేది ఏమి లేదు
గత అనుభవాలు పునాది చేసి
నేటిని సరిగ్గా నిర్మిస్తే
నిలకడ కొనసాగిస్తే
రేపటి అందాల కోటకి
రారాజువి నీవే
విశ్వ విజేతవు నీవే
-- శివ భరద్వాజ్
భాగ్యనగరం

11, జులై 2022, సోమవారం

కాదు కాదు ఇది వృద్ధాప్యం ఎంత మాత్రం కాదు

 

కరిగిన కాలం సాక్షిగా
ఉడిగిన శరీరం
జవలేని కండలు
గుంతలడిన కండ్లు
ఎముకలు తేలిన ఒళ్ళు

ఏ పని చేయలేని దిగులు
ముందుకు పడని అడుగులు
చేయూతకై చేతులు
పలకరింపుకై  చెవులు
వణుకుతున్న కంఠాలు
తప్పనిసరైన చేదు మందులతో
రుచులు మరిచిన నాలుకలు
నిరాశ నిండిన మనస్సు
ఇదేనా వృద్ధాప్యం

కాదు కాదు ఇది ఎంత మాత్రం కాదు
ఊడింగింది శరీరం కాని ఉరకలు వేసే మనసు కాదు
జవచచ్చింది కండలుకు కాని ఉత్సాహానికి కాదు
గుంతలు పడ్డది కళ్లకు కాని అనుభవానికి కాదు
ఎముకలు తేలింది ఒంటికి కాని సునిశిత బుద్ధికి కాదు
నిరాశనిండిన మనసును ఉరకలెట్టించగల మిత్రులు లేకపోలేదు
ఏ పనిచేయలేనని దిగులెందుకు నీ జ్ఞానం పంచితే చాలదు
ముందుకు పడంది అడుగులు గాని మీ ఊహలు కాదు
చేయూత కోసం చూడటమెందుకు జాతిని చైతన్య పరిచే చేతలు మీవి
వణుకుతుంది కంఠమే కానీ మీ వ్యక్తిత్వం కాదు
పలకరింపుల కోసం చూడటమెందుకు పులకించే మనసుండగా
మనసు ఉత్సాహంగా ఉంటే మందు మాకుల పని లేదు
రుచులు మరిచిన నాలుక చవులూరింప సంగీత కచేరీ చేయండి
ఈ జన్మకు మరుజన్మకు కావల్సిన జ్ఞాన సంపద పెంచండి, పంచండి
 

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

9, జులై 2022, శనివారం

ఇదేనా వృద్ధాప్యం

కరిగిన కాలం సాక్షిగా
ఉడిగిన శరీరం
జవలేని కండలు
గుంతలడిన కండ్లు
ఎముకలు తేలిన ఒళ్ళు

ఏ పని చేయలేని దిగులు
ముందుకు పడని అడుగులు
చేయూతకై చేతులు
పలకరింపుకై  చెవులు
వణుకుతున్న కంఠాలు
తప్పనిసరైన చేదు మందులతో
రుచులు మరిచిన నాలుకలు
నిరాశ నిండిన మనస్సు
ఇదేనా వృద్ధాప్యం

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

7, జులై 2022, గురువారం

ఆలోచనల పీకులాటలో

అది పీకుతా ఇది పీకుతా
అని పీకులాట ఎందుకు
పీకాలనుకుంటే పీకేయ్
చేయాలనుకొంటే చేసేయ్
ఆలోచనల పీకులాటలో
నీకై వేచిన అవకాశం
వేరే వాడు పీక్కుపోతాడోయ్
నీ స్వంత అడ్డదిడ్డ ఆలోచనలకంటే
అధికంగా నీ నీచమైన  శత్రువు
కూడా నిన్ను బాధించలేడోయ్
--శివ భరద్వాజ్
భాగ్యనగరం 

6, జులై 2022, బుధవారం

చూపించలేని ప్రేమ ఎంత ఉన్నా నిష్ఫలమే

నీకై ఎదురుచూసే ప్రతిక్షణం
ఎదురు చూపులే ఎంతసేపు
విరహపు బాధలే అంతసేపు
ఎదురుపడిన నీకు మనసు తెలపనపుడు
కనులు పలికే మౌన భాష తెలియనపుడు
ఎంత ప్రేమ ఉన్న నీకు కనపడదెపుడు
సువాసన లేని పుష్పం అలంకారినికే ఎపుడు
చూపించలేని ప్రేమ ఎంత ఉన్నా నిష్ఫలమే అపుడు
--శివ భరద్వాజ్
భాగ్యనగరం

4, జులై 2022, సోమవారం

నీకై ఎదురుచూసే ప్రతిక్షణం

నీకై ఎదురుచూసే ప్రతిక్షణం
ఎదురు చూపులే ఎంతసేపు
విరహపు బాధలే అంతసేపు
ఎదురుపడిన మనసు తెలపనపుడు
కనులు పలికే మౌన భాష తెలుసుకోలేనపుడు
ఎంత ప్రేమ ఉన్న కనబడదెపుడు
సువాసన లేని పుష్పం అలంకారినికే ఎపుడు

--శివ భరద్వాజ్

నిందించుటేల ఆప్తుల

నిందించుటేల ఆప్తుల ||కందము|| నిందించుటేల ఆప్తుల, నిందించుట మాని తోడు నిలచిన, మద్ధతు నందించి, సున్నితముగ స్పందించిన, బంధము బలపడి నిలుచు ఉమా! ...