29, ఫిబ్రవరి 2024, గురువారం

కనులు తెరవనిచో నేటి తరం - పర్యావరణానికది హానికరం

తాతలు తాగెను పారేటి నదులందు నీరు
నాన్నలు తాగెను ఊరి బావులందు నీరు
మనము తాగెను చేతి పంపులందు నీరు
పిల్లలిప్పుడు తాగెను ప్లాస్టిక్ బాటిలందు నీరు
మనవలేతీరుగ తాగవలసి వచ్చునో నీరు
మందుగుళికల వలె కావచ్చునేమో మరి
కనులు తెరవనిచో నేటి తరం
పర్యావరణానికది హానికరం
-శివ భరద్వాజ్

ఆశించనిచో దుఃఖము ఉండదు

మోహంలేనిచో మోసం ఉండదు
కోరిక లేనిచో  కోపం ఉండదు
ఆశలేనిచో అగచాటు ఉండదు
ఆశించనిచో దుఃఖము ఉండదు
స్వార్ధపరునికి స్వర్గము దక్కదు
దుర్మార్గునికి దుఃఖము వీడదు

-శివ భరద్వాజ్

28, ఫిబ్రవరి 2024, బుధవారం

మన ఇల్లు - మన భూమి

మన ఇల్లు భద్రమైతే, మన కుటుంబం సురక్షితం.
మన భూమి భద్రమైతే, సర్వ జీవులు సురక్షితం.
ఆశించక ప్రేమ పంచేది తల్లి.
ఆశించక మనుగడ నిచ్చేది నేల తల్లి.
స్వార్ధమెరుగక నేల తల్లి ఇచ్చేది తీసుకునే మనం,
స్వార్ధమెరుగక నేల తల్లిని రక్షించాల్సింది మనం.
ప్రకృతి అందానికి పరవశించే మనం,
ప్రకృతి అందాన్ని కాపాడాల్సింది మనం.
ప్రతి ఇల్లు నందనవనమైతే,
పుడమంతా పచ్చదనమే, మనసంతా ఆనందమే.
మనకు దక్కిన భాగ్యం, మూగ జీవులకు లేదు.
కలుషితం చేయకుంటే అది వాటికి వరమే.
సృష్టిలో ఏ జీవి కలుషితానికి కారణం కాదు,
కరుణలేని కర్కశ మానవుడు తప్ప.

స్వార్ధపరులమైన మనం భూమిని మనదిగా చేసుకున్నాం.
పచ్చని అడవులు నరుకుతున్నాం,
పారె నదులను కాలుష్య విషంతో ప్రవహింపచేస్తున్నాం.
ఎవరికి తలవంచని కొండలను,
మన స్వార్ధనికి మెడలు వంచి , నడుము విరిచి
కనుమరుగు చేసేస్తున్నాం.
సముద్రాలు కాలుష్య గరళంతో నింపేస్తున్నాం.

మన మార్గాన్ని మార్చుకోవాలి,
వన సంరక్షణ చేయాలి,
వన్య ప్రాణుల సంరక్షించాలి,
వ్యర్ధాలను తగ్గించాలి,
తిరిగి ఉపయోగించాలి,
తిరిగి వాడుకోగలిగేలా మార్చాలి.
మనమిది గ్రహించాలి,
మన తప్పును దిద్దుకోవాలి,
మనమంతా మనవంతు భాద్యతతో మెలగాలి.

మన ఇంటిలా భూమిని చూసుకుంటే,
మనకు చాలా వరాలు ఇస్తుంది.
స్వచ్చమైన గాలి,
స్వచ్చమైన నీరు,
ఆరోగ్యవంతమైన ఆహారం,
ఆహ్లాద పరిచే ప్రకృతిని ప్రసాదిస్తుంది.
పర్యావరణ భాద్యత మనపై ఉంది.
అన్నిజీవులకు బతికే హక్కు ఉంది.
ప్రకృతితో బంధం పెంచుకోవాల్సి ఉంది.

ఇల్లు లేకపోయినా బతకవచ్చు,
భూమి ఆక్రోశిస్తే బతుకులేదు.

-శివ భరద్వాజ్



27, ఫిబ్రవరి 2024, మంగళవారం

స్వార్థం


స్వార్థం నిశ్శబ్ద మృగం, మనందరిలో తిరుగుతుంది.
అది అవసరం ముసుగు వేసుకుని, నీడలో గుసగుసలాడుతుంది,
స్వార్థం మన కోరికల మాంసపు ముక్కలను తింటుంది.
ఇతరుల ఆకలిని సంపద మార్గంలా చూస్తుంది
మనం ప్రతిక్షణం, సంపదకోసమే పనిచేసేలా చేస్తుంది.

స్వార్థం మనుగడ మోసపూరితమైనది,
దాని వెచ్చదనానినికి ఆకర్షితుడైన మనిషి,
చీకటి జ్వాలల చిక్కిన మిడతలా దగ్ధంకాక మానడు,

సోదరా స్వార్ధపు పిడికిలి విప్పుదాం,
మూసిన హృదయపు కిటికీలను తెరుద్దాం,
ఆహ్లాదపు నవోదయ కిరణాలకు ఆహ్వానం పలుకుదాం.
నిస్వార్థతలో మనం సమృద్ధిని కనుగొందాం,
దాచుకోవడంలో కాదు, పంచుకోవడంలో ఆనందం చవిచూద్దాం.
మన ప్రపంచం, మన ఉదయం మరింత  ప్రకాశవంతంగా వికసిస్తుంది.

-శివ భరద్వాజ్

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

అడుగేస్తే అవినీతి - ప్రశ్నిస్తే అధోగతి.

 అడుగడుగున సమాజం,
అవినీతిన ఇది నిజం.
అడుగేస్తే అవినీతి,
ప్రశ్నిస్తే అధోగతి.
నీతిలేని వాని వైపు మొగ్గు,
న్యాయ దేవత తరాజు,
అవినీతిన రారాజు,
తిరిగివచ్చు మారాజు.
దండనేది నేతి బీరన
నేయి చందమున,
న్యాయమనేది దక్కునా  
ఉచితాల ప్రభుత్వముల.
గొంతెత్తిన గొంతుపైన
విరిగిన లాఠీల సాక్షిగా.

-శివ భరద్వాజ్

24, ఫిబ్రవరి 2024, శనివారం

అమ్మా నీకు వీడ్కోలు

 కొత్త రోజును ప్రారంభించడానికి,  ప్రతి ఉదయం మేల్కొంటాను,
కానీ అమ్మ నిన్ను కోల్పోయిన బాధ ఎన్నటికీ పోదు.
నేను చేయవలసిన పనులను చేయటానికి ఉద్యోగానికి వెళ్తాను,
కానీ సమయం గడిచేకొద్దీ, అమ్మ నీ గురించి మళ్లీ ఆలోచిస్తున్నాను.
నాకు తెలియకుండానే నీకు కాల్ చేసి నీతో మాట్లాడాలనుకుంటున్నాను.
కానీ ఈ జన్మకు ఆ అవకాశం రాదని గుర్తుకువచ్చి గొంతు ఆగిపోతుంది,
అమ్మ నువ్వు ఊరిలో లేవు అన్న విషయం జ్ఞప్తికి వచ్చి నా హృదయం ఏడుస్తుంది
నిన్ను మళ్ళీ చూడాలని, వీడ్కోలు చెప్పాలని అది ఆశ పడుతుంది
"అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు ప్రేమిస్తూనే ఉంటాను" .

నువ్వు వెళ్లిపోయిన రోజు నాకు తెలియదు
నేను వెళ్ళలేని చోటికి నువ్వు వెళ్తున్నావని.
నీ గురించిన జ్ఞాపకాలన్నీ అమూల్యమైనవి,
నిన్ను చాలా మిస్ అవుతున్నాను అమ్మా,
నువ్వు నాతోనే ఉంటే బావుండేదని కోరుకొని రోజు  లేదమ్మా!
నేను ఏడవాల్సిన అవసరం వచ్చినప్పుడు, నా వెన్నుతట్టి ఓదార్చేవారెవరమ్మ?
నా గుండె లోతులోని భావాలు అర్ధం చేసుకోగలిగేవారెవరమ్మ?

"అమ్మా నీకు వీడ్కోలు" అని చెప్పడం చాలా కష్టం.

ఏదో ఒక రోజు అంతా బాగానే ఉంటుందని నాకు తెలుసు,
మీరు లేకపోయినా, మీరు నేర్పిన విలువలతో,
జీవిత పోటీలో ఎలా నిలిచామో, మేము ఎలా ఎదిగామో,
అన్నీ కథలుగా నీతో పంచుకోవడానికి నిన్ను మళ్లీ కలుస్తాను,
అప్పటి వరకు నీ జ్ఞాపకాలు  నా గుండె అరలలో భద్రమే అమ్మా.
నీ జ్ఞాపకాలన్నిటిని, నీ ప్రేమనంతటిని నా  ప్రియమైన వారికి అందజేస్తాను.

కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను,  అమ్మ!

21, ఫిబ్రవరి 2024, బుధవారం

ఆధ్యాత్మవిద్య

1. ఆత్మ అంటే నేను. నిౙమైన నా స్వరూపం. దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రవృత్తి కాని నేను. 

 2. జీవుడు అంటే, తప్పుగా నేననుకుంటున్న రూపం, ప్రవృత్తి రూపం. 

 3. సాధకుడు అంటే జీవభావం నుండి, ఆత్మభావానికి వృద్ధిపొందటానికి ప్రయత్నిస్తున్నవాడు. 

4. అధ్యాత్మవిద్య అంటే తననుగుఱించి తాను తెలిసికొనే విద్య. 

5. అధ్యాత్మవిద్య ధ్యేయం: దుఃఖం లేకుండా చేయుట, శాశ్వత సుఖం పొందింౘుట, నిరంతరం నిజస్వరూపంలో నిలుపుట.

6. తానెవరో తెలియక జీవుడు నిరంతరం, ఏదో తెలియని వెంపర్లాట, తపన, శోధన (Internal quest, eternal quest) తో ఉండి, బాహ్యదృష్టితో బయట వెతుకుతున్నాడు.

7. భౌతికమైన పదార్థములు నామ-రూపములుగలవి.

8. అభౌతికమైన విషయములన్నీ నామ-రూపములపైన క్రియా-గుణములే.

9. తనను తాను తప్పుగా గుర్తింౘుకొనుట వలన (False Identification of self), జీవుడు అభౌతికమైన విషయముల యందు ప్రవర్తిస్తున్నాడు.

రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్

రాజులు చేయగ ప్రజలను, వజ్రాయుధ సదృశ, ఓటు రాజ్యాంగ మిచ్చె! భాజాలు కొట్టుటలవడి, రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్!!  -శివ భరద్వాజ్