పుడమి తల్లి ఆక్రోశం
పుడమి తల్లి ఆక్రోశం ఎవ్వరు విందురు
అడవి అంతా గనులగా మార్చునదెవ్వరు
ఎడారిగ మారుటకు పచ్చటి అడవుల ఎదురుచూపులొకవైపు అవని
తడారి పగిలిన పంట పొలాలు ఒకవైపు
జడివానల భీతావహం ఇంకొకవైపు
కడగండ్లు పెట్టించు వడగండ్లు ఒకవైపు ఎవరి స్వార్ధం ఫలితమిది
నడిరేయిన కూడా వేడి గాలి వీస్తుంటే
సడిచేయక ఏసిల మాటున నిదురిస్తుంటే
నడి సంద్రమున మృత్యుఘోష హోరెత్తుతుంటే కనికరించునదెవరు
సుడులు తిరిగి పెను తుఫాను విరుచుకుపడుతుంటే
మడమ తిప్పక సంద్రముప్పెనై మీద పడుతుంటే
వడిగా ఎవరు వచ్చి రక్షించి దయ చూప వలె? అమ్మ ధరణి గాక
మనిషి ఆశకు అంతులేదు
మనమున్న అవనిని పట్టించుకోక
కనరాని అంగారక ఆవాసం ఆలోచిస్తున్నాం!
తను కూర్చున్న కొమ్మనరికి సాధించేది ఏమిటి?