16, ఫిబ్రవరి 2025, ఆదివారం

ప్రతి ఒక్కరి పరువు రూపాయే

ప్రతి ఒక్కరి పరువు రూపాయే
జనజీవన గమ్యము రూపాయే
అనునిత్యము పరుగు రూపాయే
ప్రతిమనిషి తలపున రూపాయే

సంపాదన పరువాయే నడవడికలు తరువాయే
రూపాయే పవరాయే భోగాలే అవధాయే

ప్రతి ఒక్కరి పరువు రూపాయే
జనజీవన గమ్యము రూపాయే
అనునిత్యము పరుగు రూపాయే
ప్రతిమనిషి తలపున రూపాయే

లక్ష్యాలే కోట్లాయే కొట్లాటలు పెరిగాయే
జీవితమే బరువాయే తృప్తన్నది లేదాయే

ప్రతి ఒక్కరి పరువు రూపాయే
జనజీవన గమ్యము రూపాయే
అనునిత్యము పరుగు రూపాయే
ప్రతిమనిషి తలపున రూపాయే

నీ పరుగు రూపాయే, నా పరుగు రూపాయే
రోజంతా దిగులాయే, రోగాలే బదులాయే

ప్రతి ఒక్కరి పరువు రూపాయే
జనజీవన గమ్యము రూపాయే
అనునిత్యము పరుగు రూపాయే
ప్రతిమనిషి తలపున రూపాయే

మాటల్లో ఊసులు రూపాయే, మురిపాల్లో పాలు రూపాయే
తలపుల్లో శివుడే ఉండాలే, పరమార్థము తెలియక ఉన్నావే

ప్రతి ఒక్కరి పరువు రూపాయే
జనజీవన గమ్యము రూపాయే
అనునిత్యము పరుగు రూపాయే
ప్రతిమనిషి తలపున రూపాయే

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...