26, ఫిబ్రవరి 2025, బుధవారం

లోకాన్ని ఏలేటి ఓ శంకరా !

లోకాన్ని ఏలేటి ఓ శంకరా !
నీ జాడేందో చెప్పవయ్య ఓ దేవరా !

వెండికొండనుంటావని ఓ శంకరా
కొండంతా  వెదికాను ఓ దేవరా
కాశీలోన ఉంటావని ఓ శంకరా
గంగంతా  ఈదాను ఓ దేవరా    "లోకాన్ని ఏలేటి"

శ్రీశైలానుంటావని ఓ శంకరా
అడవంతా తిరిగాను ఓ దేవరా
ఏ లోకానున్నావో ఓ శంకరా
పుడమంతా వెదికాను ఓ దేవరా    "లోకాన్ని ఏలేటి"

గౌరమ్మ నడిగాను ఓ శంకరా!
నీ జాడంతా చెప్పింది ఓ దేవరా!
నీలోనే లీనమైతే ఓ శంకరా!
నా గుండెలోన ఉన్నావు ఓ దేవరా!    "లోకాన్ని ఏలేటి"

లోకాన్ని ఏలేటి ఓ శంకరా!
నీ జాడేందో తెలిసింది ఓ దేవరా!
నాలోనే ఉన్నావని ఓ శంకరా!
తెలియకుండ తిరిగాను ఓ దేవరా!

లోకాన్ని ఏలేటి ఓ శంకరా!
నీ జాడేందో తెలిసింది ఓ దేవరా!
నీ జాడేందో తెలిసింది ఓ శంకరా!
నీ జాడేందో తెలిసింది ఓ దేవరా!

రచన: శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...