16, ఫిబ్రవరి 2025, ఆదివారం

వింటున్నా శివ, వింటున్నా శివ

వింటున్నా శివ, వింటున్నా శివ,
వింటున్నా శివ, వింటున్నా ||వింటున్నా శివ||

పసిపాపల చిరు నవ్వులలో
పరుగులుపెట్టే వాగులలో
పారే నదముల గలగలలో
పక్షుల కిలకిలరవములలో ||వింటున్నా శివ||

పలికే తియ్యటి మాటలలో
మోగే గంటల సవ్వడిలో
ఆడే నర్తకి అందెలలో
పాడే గొంతుక స్వరములలో    ||వింటున్నా శివ||

మలయ మారుతపు వీచికలో
విలయ తాండవ గర్జనలో
ప్రణవనాదపు నాదములో
సరిగమ పదనిస గమకములో ||వింటున్నా శివ||

కూసే కోయిల గొంతుకలో
నేసే నేతల టకటకలో
కురిసే చినుకుల టపటపలో
ఎగిసే కెరటపు శబ్దములో ||వింటున్నా శివ||

మదపుటేనుగుల ఘీంకారములో
గండుతుమ్మెదల ఝంకారములో
వేదమంత్రముల ఓంకారములో
స్వయం సేవకుల హుంకారములో ||వింటున్నా శివ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హిందు వీర లేవరా, కదం కదం కలపరా

 హిందు వీర లేవరా, కదం కదం కలపరా ఈ దేశము జగద్గురువు చేయగా, కదలిరా హిందు వీర లేవరా, కదం తొక్కి కదలిరా నీ దేశము విశ్వగురువు చేయగా, తరలిరా ధర్మ ...