25, ఆగస్టు 2025, సోమవారం

గణపతి పూజ

ఆకృతినీయుడు అవని మట్టితో,
అలంకరించుడు ఓషధీయ పత్రితో,
పూజచేయుడు నిజగృహ పూలతో,
నివేదించుడు ముదమున మోదకములతో, 
నిమజ్జనచేయుడు విగ్రహము నీటితో,
గణేశ తత్వమన ఘనమగు విగ్రహము కాదు,
ప్రకృతి ఆరాధనమని గ్రహించుడు భక్తితో,
గణపతిపూజ, అహంకార ప్రదర్శన కాదు,
బుద్ధిగా మసలిన సిద్ధి లభించునని తెలిపెడి,
సనాతన ధర్మ సంస్కృతియని తెలుసుకో. 

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...