మీ రోజును నాలుగు భాగాలుగా విభజించడం ద్వారా రోజంతా వాయిదావేయడం అనే సమస్యను పరిష్కరించుకోండి.
-ఒక ఎదురుదెబ్బ రోజు మొత్తం తుడిచి పెట్టలేదు.
మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఇలా అనుకున్నవారమే. ఈరోజు బాలేదని, ఈరోజు ఏంచేసిన కలసి రావట్లేదని, ఈరోజు లేచిన టైమ్ బాగోలేదు కాబట్టి ఈరోజు ఇక ఏ పని చేసిన అలానే ఉంటుందని అనుకొని ఇక ఆరోజు మరేపని ముట్టుకోకుండా మరునాటికి వాయిదా వేసిన వారమే అయ్యూంటాము. దాని వల్ల మనం జీవితంలో ఒకరోజుని కోల్పోయినట్లే, నిరుపయోగంగా వదిలేసినట్లే. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఆరోజులో కేవలం ఒక గంటో, రెండు గంటలు మాత్రమే ప్రోబ్లెమ్ ఫేస్ చేసి(సమస్యనెదుర్కొని) ఉంటాం. రోజుమొత్తం కాదు. మనందరికీ ఉన్న సహజ లక్షణం ఏమిటంటే ఒక సంఘటన(వైఫల్యం/సమస్య/భాద) జరిగి పోయిన తరువాత, ఇక దానిని మార్చలేమని తెలిసీ, దాని గురుంచి ఆలోచిస్తూ దానిని మోస్తూఉంటాము. ఒక్కోసారి జీవితాన్నే మోడుబార్చుకుంటాము. మనం తప్పుచేస్తున్నది ఇక్కడే, మన చేతుల్లోలేని దాని గురుంచి ఆలోచిస్తూ, మన చేతుల్లో ఉన్నదానిని వదిలేస్తూ ఉంటాము. కానీ మనం అలవర్చుకోవాల్సింది జరిగినదాన్లో లోటుపాట్లు తెలుసుకొని భవిష్యత్తులో ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి కానీ గతంలోనే బ్రతికేస్తూ ఉండకూడదు. ఇప్పుడు జరిగిన తప్పుని చిన్న మార్పులతో సరిదిద్దుకోగలమేమో ప్రయత్నించాలి.
ఓటమి/వైఫల్యం ఎప్పుడూ శాశ్వతం కాదు.
మనం దానిని అంగీకరించి, మన ప్రయత్నం ఆపివేసినప్పుడు మాత్రమే అది శాశ్వతం అవుతుంది.
మనము సాధారణంగా ఒక రోజును ఒకటిగా భావిస్తాము, ఈ పరిమిత రోజులో మీరు విజయం సాధించవచ్చు లేదా విఫలం కావచ్చు. మీరు ఒకే రోజును చిన్న భాగాలుగా విభజించి ఆచరించడం ప్రారంభిస్తే మీకు తక్కువ చెడ్డ రోజులు-ఇంకా ఎక్కువ మంచి రోజులు ఉన్నాయని మీరు తెలుసుకొంటారు.
మీకు కలసి రాని రోజున మీరు పని చేసి వైఫల్యం చెందినట్లు భావించి మీరు నిరుత్సాహానికి గురైతే, మీ రోజును నాలుగు విభిన్న భాగాలుగా విభజించడం ద్వారా , ప్రతి ఒక్క భాగానికి విజయావకాశాలు సమంగా ఉంచవచ్చు.
మీరు ఒక రోజు పోయిందని భావించి, "నేను రేపు తిరిగి వెళ్తాను/ప్రయత్నిస్తాను" అని ఆలోచించే బదులు, ప్రతి రోజు నాలుగు భాగాలుగా చేసి ఆలోచించడానికి ప్రయత్నించండి: ఉదయం(6-9), మధ్యాహ్నం ముందు(9-12)
, మధ్యాహ్నం తరువాత(12-3), సాయంత్రం(3-6). మీరు ఒక భాగంలో భంగపడితే, తరువాతి భాగంలో తిరిగి ట్రాక్‌లోకి వస్తారు. అందువల్ల మీ వైఫల్యం చిన్నది అవుతుంది కాని, పెద్దది కాదు.
మీరు వైఫల్యన్ని అంగీకరించి మరొక కొత్త పద్దతిలో, కొత్త ఆలోచనతో ముందుకు సాగిపోండి. ఎవరూ ఊహించని విధంగా, పొరపాట్లు చేయకుండా జీవితం సాగదు (లేదా వృత్తి/ఉద్యోగం ముందుకు సాగదు). నాలుగు భాగాలుగా రోజుని విభజించి ఆలోచించడం వైఫల్యం యొక్క అనివార్యతను నివారించ లేకపోవచ్చు కానీ మీరు ఇంకా కోలుకునే అవకాశం ఉందనే ఆలోచనను, నమ్మకాన్ని మీకు కలిగిస్తుంది. ఎందుకంటే కోల్పోయిన దానిని తిరిగి పొందటానికి మరో పావుగంట ఎప్పుడూ ఉంటుంది. మీరు రోజులో ఒక భాగంలో సమస్య నెదుర్కొంటే, రెండో భాగంలో ఇంకోలా ప్రయత్నించవచ్చు లేదా వేరేపని కోసం ప్రయత్నించవచ్చు. అలా మీ పనిని, మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకొంటూ, అభినందించికొంటూ కొనసాగించండి.
సహజంగానే, మీ ఆలోచనను ఈ విధంగా తిరిగి మార్చడం ఆరంభంలో చాలా శ్రద్ధతో మాత్రమే సాధ్యపడుతుంది, నిజంగా విజయవంతం కావడానికి మీరు మీ ప్రయత్నాన్ని మీ రోజు యొక్క నాలుగు వంతులు-ఉదయం, మధ్యాహ్నం ముందు, తరువాత మరియు సాయంత్రం అనే దానిని ప్రతిపనిలో/విషయంలో కేటాయించి, ఆచరణలో పెట్టడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం పనిలో మీ సాధికారతను పెంచుతుంది, ఆ విధంగా, మీరు ఈ రోజు నాలుగింట ఒక వంతు లక్ష్యం లేకుండా పని చేసినప్పటికీ, ముఖ్యమైన పనిని గమనించకుండా ఉంచినప్పటికీ, రోజంతా వృథాగా మారదు ఎందుకంటే తరువాతి భాగాన్ని మీరు ఉపయోగించుకొంటారు.
గుర్తుంచుకోండి మిత్రులారా! భయం, కంగారు, గాభరా, బెంభెలెత్తి పోవడం వంటివాటివల్ల మీకేవిధమైన ప్రయోజనం కలగదు, కేవలం మీ బిపి పెరిగి అనవసర తప్పిదాలు జరగడం, పరిస్థితి మరింత దిగజారిపోవడం తప్ప, అవి మీరు ఆలోచించే సామర్ధ్యం కోల్పోయేలా చేసి మిమ్మల్ని సాధారణంగా మార్చివేస్తాయి.
దీనిని సాధారణంగా తరచుగా ఆటల్లో గమనించవచ్చు. ప్రధమార్ధంలో ఆధిపత్యం చెలాయించిన జట్టు, ద్వితీయార్ధంలో ఓడిపోవచ్చు. మొదటి మూడు సెషన్లు వెనుకంజలో ఉన్న జట్టుయొక్క స్థితి చివరి సెషన్లో మారిపోయి విజయం సాధించవచ్చు.
మనకు కావలసిందల్లా సుస్పష్టమైన లక్ష్యం, సాధించాలన్న సంకల్పం, గెలవాలనే పట్టుదల, చివరిక్షణం వరకు ఓటమి అంగీకరించని మానసికస్థైర్యం ఇవే మిమ్మల్ని జీవితమనే ఆటలో విజేతలుగా నిలబెడతాయి.
- మీ శ్రేయోభిలాషి శివ
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
28, జూన్ 2021, సోమవారం
మీ రోజును నాలుగు భాగాలుగా విభజించడం ద్వారా రోజంతా వాయిదావేయడం అనే సమస్యను పరిష్కరించుకోండి - ఒక ఎదురుదెబ్బ రోజు మొత్తం తుడిచి పెట్టలేదు.
25, జూన్ 2021, శుక్రవారం
సద్గురు బోధ
మనమెవరం ఎక్కువ కాలం ఈ భూమిపై ఉండం మరియు మనం వెళ్ళినప్పుడు ఏమి మనతో తీసుకు వెళ్ళలేము,
కాబట్టి మన అవసరానికి మించి పొదుపుగా ఉండవలసిన అవసరం లేదు.
కావున, ఖర్చు చేయాల్సిన డబ్బులు ఖర్చు చేయండి, ఆనందించవలసిన దాన్ని ఆస్వాదించండి, మీరు దానం చేయగలిగే దాన్ని దానం చేయండి.
మనం పోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి చింతించకండి, ఎందుకంటే మనం లేనప్పుడు ప్రశంసలు మరియు విమర్శల గురించి మనకు ఏమీ అనిపించదు.
మీ పిల్లల గురించి ఎక్కువగా చింతించకండి, ఎందుకంటే వారి తలరాత వారికి ఉంటుంది మరియు వారి జీవితం సాగించడానికి మార్గం వారు కనుగొనాలి.
వారి కోసం శ్రద్ధ వహించండి, వారిని ప్రేమించండి, వారికి బహుమతులు ఇవ్వండి కానీ మీ డబ్బులు లేదా దానితో మీ అవసరాలు పోను మిగిలి ఉన్న దాన్ని కూడా మీరు ఆస్వాదించండి.
జీవితమంటే కేవలం పుట్టినప్పటి నుండి నుండి చనిపోయే వరకు పనిచేస్తూ ఉండటమే కాదు దానిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించడం కూడా.
60 సంవత్సరాలు దాటిన వారు, సంపద కోసం మీ జీవితంలో ఏ వ్యాపారం చేయవద్దు,
ఇకపై మీరు ఏ పని చేసినా ఆత్మ సంతృప్తి, ఆరోగ్యాన్ని పొందటానికే.
ఎందుకంటే మీ డబ్బు మీ ఆరోగ్యాన్ని ఎప్పటికీ కొనలేకపోవచ్చు.
డబ్బు సంపాదించడం ఎప్పుడు ఆపాలి మరియు ఎంత సరిపోతుంది?
మీకు 1000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమి ఉన్నా, మీరు రోజూ మూడు సోలల బియ్యం మాత్రమే తినగలుగుతారు, వెయ్యి భవనాలున్నా, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మీకు ఎనిమిది చదరపు మీటర్ల స్థలం మాత్రమే అవసరం.
కాబట్టి, మీరు ఖర్చు చేయడానికి తగినంత డబ్బు ఉంటే అది మంచిది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలి.
ఇతరులు ఏమనుకుంటారో అని బెంగ మీకు వద్దు
ప్రతి కుటుంబానికి వారి సమస్యలు వారికి ఉంటాయి. కాబట్టి, మీ గురించి పట్టించుకునే తీరిక ఓపిక వారికి ఎల్లకాలం ఉండదు.
మీరు మార్చలేని విషయాల గురించి చింతించకండి దాని వలన ఏ విధమైన ఉపయోగం ఉండదు మరియు అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
మీకు మీరు మంచిగా ఉండటానికి కావలసిన పరిస్థితులు కల్పించుకుని, మీకు ఆనందాన్ని కలిగించే చోటు కనుగొనండి.
మీరు మంచి మానసిక స్థితిలో మరియు మంచి ఆరోగ్యంతో ఉన్నంత కాలం, సంతోషకరమైన విషయాల గురించి ఆలోచించండి,
ప్రతిరోజూ సంతోషకరమైన పనులు చేయండి మరియు ఆనందించండి, అప్పుడు మీరు ప్రతిరోజూ మీ సమయాన్ని సంతోషంగా గడుపుతారు.
ఒక రోజు ఆనందం లేకుండా గడిచింది అంటే మీ జీవితంలో ఒక రోజును కోల్పోయినట్లే.
ఒక రోజు ఆనందంతో గడిపారంటే మీరు ఒక రోజు పొందినట్లే.
మంచి మనస్సుతో మీ అనారోగ్యం నయం అవుతుంది.
సంతోషంగా ఉంటే అనారోగ్యం వేగంగా నయమవుతుంది.
మంచి మనస్సు కలిగి సంతోషంగా ఉంటే అనారోగ్యం ఎప్పటికీ రాదు.
మంచి మానసిక స్థితి, రోజూ వ్యాయామం, ఉదయం ఎండలో నడక మరియు మంచి మొత్తంలో విటమిన్ మరియు ఖనిజ పదార్థాలతో కూడిన వివిధ రకాల ఆహారాలు స్వీకరించడం వల్ల మీరు బ్రతికినంత కాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు.
మీ మంచి మిత్రులు, మీరు యవ్వనంలో ఉన్న భావన మీకు కలిగిస్తారు, వారు కూడా భావిస్తారు మరియు వారి సాంగత్యం లేకపోతే మిమ్మల్ని మీరు కోల్పోయినట్లే.
అన్నింటికంటే మించి, మీ జీవిత భాగస్వామితో మంచిగా ఉంటూ వారిని ఆదరించడం నేర్చుకోండి, ఎందుకంటే వారు మీలో సగం.
24, జూన్ 2021, గురువారం
నాన్నల దినోత్సవ శుభాకాంక్షలతో
23, జూన్ 2021, బుధవారం
విజయవాడ సంఘటన పై నా స్పందన
ఎన్ని నిర్భయలు తెచ్చినా! ఎన్ని దిశలు వచ్చినా!
ఆడపిల్ల నిర్భయంగా తిరిగేదెన్నడు?
ఏ దిశకు వెళ్ళినా తిరిగివచ్చేదెన్నడు?
తేవాల్సింది చట్టాలా? వేయాల్సింది శిక్షలా?
ఎందుకింత అమానుషం! ఎందుకింత కర్కశత్వం!
మనిషే మృగమై చెలరేగుతుంటే
వావివరుస మరిచి పశువైపోతుంటే
వేటాడే నాధుడే లేడా? ఆదుకునే ఆప్తుడే రాడా?
ఏమి చేస్తే మారుతుంది నా సోదరి భవిత
ఏమి చేసి మార్చగలను నా కూతురి విధిరాత
15, జూన్ 2021, మంగళవారం
ఉద్యమిం"చైనా" నవభారతి నిర్మిద్దాం
తెలుగా! మజాకా!
కరోనా
ఎక్కడి నుం"చైనా" వస్తుంది
ఎవరి నుం"చైనా" వస్తుంది
ఎటు నుం"చైనా" వస్తుంది
ఎందరి నుం"చైనా" వస్తుంది
కావునా
ఇక నుం"చైనా" జాగ్రత్త పడదాం
ఇక మం"చైనా" చెడైనా మనమే పడదాం
ఇక నుం"చైనా" దిగుమతులాపుదాం
ఇక నుం"చైనా " స్వదేశీవే వాడుదాం
ఇక కష్టిం"చైనా" స్వయం సమృద్ధి సాధిద్దాం
మననుం"చైనా" మొదలుపెడదాం
ఉద్యమిం"చైనా" నవభారతి నిర్మిద్దాం
మొదటి నాలుగు లైన్లు నా ఫ్రెండ్ పంపిన మెసేజ్ లోనివి.
-మీ శివ
14, జూన్ 2021, సోమవారం
పోరాటం మరిచింది ఈతరం
తరాలు మారినవి అంతరంగాలు మారినవి
స్వాతంత్ర్యం కోసం సమర శంఖం పూరించింది ఒక తరం
భూస్వాముల ఆగడాలు అంతమొంచింది మలితరం
కర్షక, కార్మిక సంక్షేమానికి కదనుతొక్కింది మన పూర్వతరం
వారిచ్చిన ఫలాలను అనుభవిస్తూ పోరాటం మరిచింది ఈతరం
రాజకీయ ఉచిత భక్ష్యాలను భక్షించి
ఏ వర్గం నోరెత్తక కష్టపడటం మరిచి
ఉన్నదేదో ఉంటే చాలని తృప్తి తలచి
వారిచ్చిన వాటితో సంతృప్తి చెందిన మనం
గొంతెత్తిన గొంతుకని గొంతునులిమి చంపి
మానవత్వం మంటగలిపి, కుల మత వర్గాలు పెంచి
రాజకీయ వైకుంఠపాళీ ఆడిస్తున్న నాయకుల
అంటకాగి, చేవచచ్చి మిన్నకుండి పోతున్నాం
5, జూన్ 2021, శనివారం
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా
పర్యావరణ హితమే మన హితం
ప్రకృతి సమతౌల్యనికి సహితం
పర్యావరణ సంరక్షణమే శరణ్యం
సర్వప్రాణి సంరక్షణయే శరణ్యం
మానవునికి బుద్ధి ప్రసాదించిన ప్రకృతి
ఆ బుద్ధి పెడదోవకు అవుతుంది వికృతి
భావితరాలకు దొరుకుతుందా జీవనభృతి
ఇకనైనా ఆగుతుందా మానవ దుష్కృతి
ప్రకృతి ఊపిరితిత్తులైన ఆరణ్యాలకు మన మిచ్చిన శాపం
పాపమై మన ఊపిరితిత్తుల కబళించింది కరోనా రూపం
మన దుష్కృత్యాలకు రాలిపోతున్న పిట్టలు చూశాం
మన ఆకృత్యాలకు కూలిపోతున్న చెట్టులు చూశాం
మన స్వార్ధకృత్యాలకు కుంగిపోతున్న మిట్టలు చూశాం
మన రాక్షసకృత్యాలకు బలియవుతున్న జంతువులు చూశాం
ఇన్ని చూసినా చలించని మనం!
ఆక్సిజన్ అందక అశువులు బాసిన ఆప్తుల చూస్తున్నాం
విజ్ణానంతో విర్రవీగి రక్షించుకోలేక చేష్టలుడిగి చూస్తున్నాం
ముక్కుకు మాస్కు లేకుండా బయట తిరిగిరాలేకున్నాం
ఏదిఏమైనా పలకరించే దిక్కులేక చెప్పుకోలేక చస్తున్నాం
ప్రకృతితో శరణమా! రణమా! తేల్చుకో
లేకుంటే నీ మూలలే ఉండవు చూసుకో
ఇకనైనా నీ మూసిన కనులు తెరుచుకో
అన్నీ ప్రాణులతో కలసి సుఖంగా ఈ ధరిత్రిని ఏలుకో
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా
లోకాః సమస్త సుఖినోభవంతు
-మీ శివ
కరోనా సంతోషం కలిగించింది
కరోనా సంతోషం కలిగించింది
జనాలను నిలువు దోపిడి చేస్తున్న వైద్యాలయాలకు
టీకాల తో వ్యాపారం చేస్తున్న మందుల కంపెనీ లకు
మందులను బ్లాక్ మార్కెట్ చేస్తున్న ఔషధాలయాలకు
పాఠాలు చెప్పకుండా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాలయాలకు
నిత్యావసరాల రేట్లు పెంచి అమ్ముతున్న వ్యాపారులకు
కరోనా బూచి చూపి జీతాలు పెంపు ఆపిన కంపెనీలకు
మహమ్మారి కాలంలో రికార్డు అమ్మ కాల మందు వ్యాపారులకు
శవాలతో బేరం ఆడుతున్న కార్పొరేట్ దవాఖానాలకు
మీ ఆలోచన దేశగతిని మార్చాలి
ప్రియమైన మిత్రులారా/పిన్నలారా/పెద్దలరా
మనందరం ఒక్కసారి ఆలోచించాలి. మన దేశం ఎక్కడికి వెళుతుంది? ఏమవుతుంది?
మన కర్తవ్యం ఏమిటి?
స్వాతంత్ర్యం వచ్చినపుడు 1రూ = 1 డాలరు
ఇప్పుడు 1రూ = 73.15 (05 జూన్ 2021 నాటికి)
ఇలా ఎందుకు జరిగింది? ఎందుకు జరుగుతుంది?
ఒక్కసారి ఆలోచించండి. మీ ఆలోచన భావితరాలకు మనదేశం అప్పులు లేని భారతదేశంగా కనిపించేలా చేయాలి.
ప్రస్తుత మన దేశ అప్పు సుమారు 2కోట్ల కోట్లు అంటే మన దేశ జనాభా 130 కోట్లు అనుకుంటే తలసరి ఒక్కింటికి 150000 రూపాయల అప్పు ఉందన్నమాట!ఇది కాక రాష్ట్ర ప్రభుత్వ అప్పులు వేరే!
దీనిని నివారించడానికి వ్యక్తిగతంగా ప్రతిఒక్కరం ఏమి చేయాలో, ఏమి చేస్తే బావుంటుందో మీ ఆలోచనాలకి పదును పెట్టండి.
మీ ఒక్క ఆలోచన దేశగతిని మార్చవచ్చు.
4, జూన్ 2021, శుక్రవారం
కరోనా కష్టం
ఎంత కష్టం ఎంత కష్టం
మానవాళికి ఎంత కష్టం
బ్రతకాలంటే పనిచేయక తప్పదు
పని చేయాలంటే బయటకు రాక తప్పదు
బయటకు పోతే కరోనా ముప్పు తప్పదు
ముప్పు తప్పాలంటే ఇంటిలో ఉండక తప్పదు
ఎంత కష్టం ఎంత కష్టం
మానవాళికి ఎంత కష్టం
తూటాలు పేలలేదు
బాంబులు దద్దరిల్ల లేదు
శతఘ్నులు గర్జించ లేదు
ప్రపంచ యుద్ధాలకు మించిన కరోనా మారణహోమం
ఎంత కష్టం ఎంత కష్టం
మానవాళికి ఎంత కష్టం
కని పెంచిన కన్నవారు కడతేరి పోతుంటే
స్నేహం పంచిన స్నేహితులాయువు తీరిపోతుంటే
బంధాలన్నీ కరోనా రక్కసి పాలవుతుంటే
ఎందుకోసం నీ జన్మం మానవాళికి ఎంత కష్టం
నాగరికత పేరుతో నోరులేని జంతువుల ఆవాసాలు జనారణ్యాలుగా మార్చినందుకా
మానవ ధర్మమైన మానవత్వం మరిచినందుకా
తరచి చూచిన కారుణ్యం కాన రానందుకా
ఎందుకోసం ఈ కష్టం మానవాళికి ఎంత కష్టం
- లోకా సమస్తసుఖినోభవంతు మీ శివ
మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?
శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి? తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
కరోనా సంతోషం కలిగించింది జనాలను నిలువు దోపిడి చేస్తున్న వైద్యాలయాలకు టీకాల తో వ్యాపారం చేస్తున్న మందుల కంపెనీ లకు మందులను బ్లాక్ మార్కెట్ చ...