25, జూన్ 2021, శుక్రవారం

సద్గురు బోధ

సద్గురు బోధ

మనమెవరం ఎక్కువ కాలం ఈ భూమిపై ఉండం మరియు మనం వెళ్ళినప్పుడు ఏమి మనతో తీసుకు వెళ్ళలేము,
కాబట్టి మన అవసరానికి మించి  పొదుపుగా ఉండవలసిన అవసరం లేదు.
కావున, ఖర్చు చేయాల్సిన డబ్బులు ఖర్చు చేయండి, ఆనందించవలసిన దాన్ని ఆస్వాదించండి, మీరు దానం చేయగలిగే దాన్ని దానం చేయండి.
మనం పోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి చింతించకండి, ఎందుకంటే మనం లేనప్పుడు ప్రశంసలు మరియు విమర్శల గురించి మనకు ఏమీ అనిపించదు.
మీ పిల్లల గురించి ఎక్కువగా చింతించకండి, ఎందుకంటే వారి తలరాత వారికి ఉంటుంది మరియు వారి జీవితం సాగించడానికి మార్గం వారు కనుగొనాలి.
వారి కోసం శ్రద్ధ వహించండి, వారిని ప్రేమించండి, వారికి బహుమతులు ఇవ్వండి కానీ మీ డబ్బులు లేదా దానితో మీ అవసరాలు పోను మిగిలి ఉన్న దాన్ని కూడా మీరు ఆస్వాదించండి.
జీవితమంటే కేవలం పుట్టినప్పటి నుండి  నుండి చనిపోయే వరకు పనిచేస్తూ ఉండటమే కాదు దానిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించడం కూడా.

60 సంవత్సరాలు దాటిన వారు, సంపద కోసం మీ జీవితంలో ఏ వ్యాపారం చేయవద్దు,
ఇకపై మీరు ఏ పని చేసినా ఆత్మ సంతృప్తి, ఆరోగ్యాన్ని పొందటానికే.
ఎందుకంటే మీ డబ్బు మీ ఆరోగ్యాన్ని ఎప్పటికీ కొనలేకపోవచ్చు.

డబ్బు సంపాదించడం ఎప్పుడు ఆపాలి మరియు ఎంత సరిపోతుంది?
మీకు 1000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమి ఉన్నా, మీరు రోజూ మూడు సోలల బియ్యం మాత్రమే తినగలుగుతారు, వెయ్యి భవనాలున్నా, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మీకు ఎనిమిది చదరపు మీటర్ల స్థలం మాత్రమే అవసరం.
కాబట్టి, మీరు ఖర్చు చేయడానికి తగినంత డబ్బు ఉంటే అది మంచిది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలి.
ఇతరులు ఏమనుకుంటారో అని బెంగ మీకు వద్దు
ప్రతి కుటుంబానికి వారి సమస్యలు వారికి  ఉంటాయి. కాబట్టి, మీ గురించి పట్టించుకునే తీరిక ఓపిక వారికి ఎల్లకాలం ఉండదు.
డబ్బు, కీర్తి, ప్రతిష్టలలో ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకండి,
కానీ ఎవరి పిల్లలు బాగా చదువుతున్నారు, మంచి బుద్ధులు చూపిస్తున్నారు, చురుకుగా ఉంటున్నారు, ఇతరులకు సహాయం చేస్తున్నారు గమనించండి
వీలైతే వారిని సరిదిద్దండి మరియు  ఆనందం, ఆరోగ్యం, సంతోషం, నీతి, నిజాయితీ మరియు దీర్ఘాయువు కోసం ఇతరులను సవాలు చేయండి.

మీరు మార్చలేని విషయాల గురించి చింతించకండి దాని వలన ఏ విధమైన ఉపయోగం ఉండదు మరియు అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
మీకు మీరు మంచిగా ఉండటానికి కావలసిన పరిస్థితులు కల్పించుకుని, మీకు ఆనందాన్ని కలిగించే  చోటు కనుగొనండి.
మీరు మంచి మానసిక స్థితిలో మరియు మంచి ఆరోగ్యంతో ఉన్నంత కాలం, సంతోషకరమైన విషయాల గురించి ఆలోచించండి,
ప్రతిరోజూ సంతోషకరమైన పనులు చేయండి మరియు ఆనందించండి, అప్పుడు మీరు ప్రతిరోజూ మీ సమయాన్ని సంతోషంగా గడుపుతారు.
ఒక రోజు ఆనందం లేకుండా గడిచింది అంటే మీ జీవితంలో ఒక రోజును  కోల్పోయినట్లే.
ఒక రోజు ఆనందంతో గడిపారంటే మీరు ఒక రోజు పొందినట్లే.

మంచి మనస్సుతో మీ అనారోగ్యం నయం అవుతుంది.
సంతోషంగా ఉంటే అనారోగ్యం వేగంగా నయమవుతుంది.
మంచి మనస్సు  కలిగి సంతోషంగా ఉంటే అనారోగ్యం ఎప్పటికీ రాదు.
మంచి మానసిక స్థితి, రోజూ వ్యాయామం, ఉదయం ఎండలో నడక మరియు మంచి మొత్తంలో విటమిన్ మరియు ఖనిజ పదార్థాలతో కూడిన వివిధ రకాల ఆహారాలు స్వీకరించడం వల్ల మీరు బ్రతికినంత కాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు.

మీ మంచి మిత్రులు, మీరు యవ్వనంలో  ఉన్న భావన మీకు కలిగిస్తారు, వారు కూడా భావిస్తారు మరియు వారి సాంగత్యం లేకపోతే మిమ్మల్ని మీరు కోల్పోయినట్లే.

అన్నింటికంటే మించి, మీ జీవిత భాగస్వామితో మంచిగా ఉంటూ వారిని ఆదరించడం నేర్చుకోండి, ఎందుకంటే వారు మీలో సగం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...