24, జూన్ 2021, గురువారం

నాన్నల దినోత్సవ శుభాకాంక్షలతో

 

నాన్న! నిన్నేమి ఆశీంచక అన్నీ ఇచ్చేవాడు
నీవు గుండెలపై తన్నిన మురిసిపోయేవాడు
నీవెళ్లే దారిలో ముల్లు లేకుండా చేసేవాడు
నీ కన్నీరుచూసి మనసులో విలవిల్లాడేవాడు
నీవు దారి తప్పకుండా అదిలించి సరిదిద్దేవాడు
నీ కాళ్లపై నిలబడటానికి చేయూతనిచ్చేవాడు
నీకే ఆపద వచ్చిన నీ ముందు నిలబడినవాడు
నీవేది ఇచ్చిన తన ప్రేమనే పంచేవాడు
కొడుకు తనని మించిపోవాలని కలలు కనేవాడు
కూతురు కన్నీరు చూసి కదిలిపోయేవాడు

నాన్న నిన్ను కొట్టినా తిట్టినా నీ మంచికే అన్నది సత్యం
తాను కొవ్వొత్తిలా కరిగినా నీ జీవితానికి వెలుగిచ్చేందుకే  నిత్యం

నాన్నల దినోత్సవ శుభాకాంక్షలతో
- మీ శివ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ

 "ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు… ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ… ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?...