28, జూన్ 2021, సోమవారం

మీ రోజును నాలుగు భాగాలుగా విభజించడం ద్వారా రోజంతా వాయిదావేయడం అనే సమస్యను పరిష్కరించుకోండి - ఒక ఎదురుదెబ్బ రోజు మొత్తం తుడిచి పెట్టలేదు.

మీ రోజును నాలుగు భాగాలుగా విభజించడం ద్వారా రోజంతా వాయిదావేయడం అనే సమస్యను పరిష్కరించుకోండి.

-ఒక ఎదురుదెబ్బ  రోజు మొత్తం తుడిచి పెట్టలేదు.

మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఇలా అనుకున్నవారమే. ఈరోజు బాలేదని, ఈరోజు ఏంచేసిన కలసి రావట్లేదని, ఈరోజు లేచిన టైమ్ బాగోలేదు కాబట్టి ఈరోజు ఇక ఏ పని చేసిన అలానే ఉంటుందని అనుకొని ఇక ఆరోజు మరేపని ముట్టుకోకుండా మరునాటికి వాయిదా వేసిన వారమే అయ్యూంటాము.  దాని వల్ల మనం జీవితంలో ఒకరోజుని కోల్పోయినట్లే, నిరుపయోగంగా వదిలేసినట్లే. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఆరోజులో కేవలం ఒక గంటో, రెండు గంటలు మాత్రమే ప్రోబ్లెమ్ ఫేస్ చేసి(సమస్యనెదుర్కొని) ఉంటాం.  రోజుమొత్తం కాదు. మనందరికీ ఉన్న సహజ లక్షణం ఏమిటంటే ఒక సంఘటన(వైఫల్యం/సమస్య/భాద) జరిగి పోయిన తరువాత, ఇక దానిని మార్చలేమని తెలిసీ, దాని గురుంచి ఆలోచిస్తూ దానిని మోస్తూఉంటాము. ఒక్కోసారి జీవితాన్నే మోడుబార్చుకుంటాము. మనం తప్పుచేస్తున్నది ఇక్కడే, మన చేతుల్లోలేని దాని గురుంచి ఆలోచిస్తూ, మన చేతుల్లో ఉన్నదానిని వదిలేస్తూ ఉంటాము. కానీ మనం అలవర్చుకోవాల్సింది జరిగినదాన్లో లోటుపాట్లు తెలుసుకొని భవిష్యత్తులో ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి కానీ గతంలోనే బ్రతికేస్తూ ఉండకూడదు. ఇప్పుడు జరిగిన తప్పుని చిన్న మార్పులతో సరిదిద్దుకోగలమేమో ప్రయత్నించాలి.

ఓటమి/వైఫల్యం ఎప్పుడూ శాశ్వతం కాదు.
మనం దానిని అంగీకరించి, మన ప్రయత్నం ఆపివేసినప్పుడు మాత్రమే అది శాశ్వతం అవుతుంది.

మనము సాధారణంగా ఒక రోజును ఒకటిగా భావిస్తాము, ఈ పరిమిత రోజులో మీరు విజయం సాధించవచ్చు లేదా విఫలం కావచ్చు. మీరు ఒకే రోజును చిన్న భాగాలుగా విభజించి ఆచరించడం ప్రారంభిస్తే మీకు తక్కువ చెడ్డ రోజులు-ఇంకా ఎక్కువ మంచి రోజులు ఉన్నాయని మీరు తెలుసుకొంటారు.

మీకు కలసి రాని రోజున మీరు పని చేసి  వైఫల్యం చెందినట్లు భావించి మీరు నిరుత్సాహానికి గురైతే, మీ రోజును నాలుగు విభిన్న భాగాలుగా విభజించడం ద్వారా , ప్రతి ఒక్క భాగానికి  విజయావకాశాలు సమంగా ఉంచవచ్చు.

మీరు ఒక రోజు పోయిందని భావించి, "నేను రేపు తిరిగి వెళ్తాను/ప్రయత్నిస్తాను" అని ఆలోచించే బదులు, ప్రతి రోజు నాలుగు భాగాలుగా చేసి ఆలోచించడానికి ప్రయత్నించండి: ఉదయం(6-9), మధ్యాహ్నం ముందు(9-12)
, మధ్యాహ్నం తరువాత(12-3), సాయంత్రం(3-6). మీరు ఒక భాగంలో భంగపడితే, తరువాతి భాగంలో తిరిగి ట్రాక్‌లోకి వస్తారు.  అందువల్ల మీ వైఫల్యం చిన్నది అవుతుంది కాని, పెద్దది కాదు.

మీరు వైఫల్యన్ని అంగీకరించి మరొక కొత్త పద్దతిలో, కొత్త ఆలోచనతో ముందుకు సాగిపోండి. ఎవరూ ఊహించని విధంగా, పొరపాట్లు చేయకుండా జీవితం సాగదు (లేదా వృత్తి/ఉద్యోగం ముందుకు సాగదు). నాలుగు భాగాలుగా రోజుని విభజించి ఆలోచించడం వైఫల్యం యొక్క అనివార్యతను నివారించ లేకపోవచ్చు కానీ మీరు ఇంకా కోలుకునే అవకాశం ఉందనే ఆలోచనను, నమ్మకాన్ని మీకు కలిగిస్తుంది. ఎందుకంటే కోల్పోయిన దానిని తిరిగి పొందటానికి మరో పావుగంట ఎప్పుడూ ఉంటుంది. మీరు రోజులో ఒక భాగంలో సమస్య నెదుర్కొంటే, రెండో భాగంలో ఇంకోలా ప్రయత్నించవచ్చు లేదా వేరేపని కోసం ప్రయత్నించవచ్చు. అలా మీ పనిని, మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకొంటూ, అభినందించికొంటూ కొనసాగించండి.

సహజంగానే, మీ ఆలోచనను ఈ విధంగా తిరిగి మార్చడం ఆరంభంలో చాలా శ్రద్ధతో మాత్రమే సాధ్యపడుతుంది, నిజంగా విజయవంతం కావడానికి మీరు మీ ప్రయత్నాన్ని మీ రోజు యొక్క నాలుగు వంతులు-ఉదయం, మధ్యాహ్నం ముందు, తరువాత మరియు సాయంత్రం అనే దానిని ప్రతిపనిలో/విషయంలో కేటాయించి, ఆచరణలో పెట్టడం అలవాటు చేసుకోవాలి.  అలా చేయడం పనిలో మీ సాధికారతను పెంచుతుంది,  ఆ విధంగా, మీరు ఈ రోజు నాలుగింట ఒక వంతు లక్ష్యం లేకుండా పని చేసినప్పటికీ, ముఖ్యమైన పనిని గమనించకుండా ఉంచినప్పటికీ, రోజంతా వృథాగా మారదు ఎందుకంటే తరువాతి భాగాన్ని మీరు ఉపయోగించుకొంటారు.

గుర్తుంచుకోండి మిత్రులారా! భయం, కంగారు, గాభరా, బెంభెలెత్తి పోవడం వంటివాటివల్ల మీకేవిధమైన ప్రయోజనం కలగదు, కేవలం మీ బి‌పి పెరిగి అనవసర తప్పిదాలు జరగడం, పరిస్థితి మరింత దిగజారిపోవడం తప్ప, అవి మీరు ఆలోచించే సామర్ధ్యం కోల్పోయేలా చేసి మిమ్మల్ని సాధారణంగా మార్చివేస్తాయి.

దీనిని సాధారణంగా  తరచుగా ఆటల్లో గమనించవచ్చు.  ప్రధమార్ధంలో ఆధిపత్యం చెలాయించిన జట్టు, ద్వితీయార్ధంలో ఓడిపోవచ్చు. మొదటి మూడు సెషన్లు వెనుకంజలో ఉన్న జట్టుయొక్క స్థితి చివరి సెషన్లో మారిపోయి విజయం సాధించవచ్చు.
మనకు కావలసిందల్లా సుస్పష్టమైన లక్ష్యం, సాధించాలన్న సంకల్పం, గెలవాలనే పట్టుదల, చివరిక్షణం వరకు ఓటమి అంగీకరించని మానసికస్థైర్యం ఇవే మిమ్మల్ని జీవితమనే ఆటలో విజేతలుగా నిలబెడతాయి.

- మీ శ్రేయోభిలాషి శివ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...