5, జూన్ 2021, శనివారం

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా

పర్యావరణ హితమే మన హితం
ప్రకృతి సమతౌల్యనికి సహితం
పర్యావరణ సంరక్షణమే శరణ్యం
సర్వప్రాణి సంరక్షణయే శరణ్యం

మానవునికి బుద్ధి ప్రసాదించిన ప్రకృతి
ఆ బుద్ధి పెడదోవకు అవుతుంది వికృతి
భావితరాలకు దొరుకుతుందా జీవనభృతి
ఇకనైనా ఆగుతుందా మానవ దుష్కృతి

ప్రకృతి ఊపిరితిత్తులైన ఆరణ్యాలకు మన మిచ్చిన శాపం
పాపమై మన ఊపిరితిత్తుల కబళించింది కరోనా రూపం

మన దుష్కృత్యాలకు రాలిపోతున్న పిట్టలు చూశాం
మన ఆకృత్యాలకు కూలిపోతున్న చెట్టులు చూశాం
మన స్వార్ధకృత్యాలకు కుంగిపోతున్న మిట్టలు చూశాం
మన రాక్షసకృత్యాలకు బలియవుతున్న జంతువులు చూశాం

ఇన్ని చూసినా చలించని మనం!

ఆక్సిజన్ అందక అశువులు బాసిన  ఆప్తుల చూస్తున్నాం
విజ్ణానంతో విర్రవీగి రక్షించుకోలేక చేష్టలుడిగి చూస్తున్నాం
ముక్కుకు మాస్కు లేకుండా బయట తిరిగిరాలేకున్నాం
ఏదిఏమైనా పలకరించే దిక్కులేక చెప్పుకోలేక చస్తున్నాం

ప్రకృతితో శరణమా! రణమా! తేల్చుకో
లేకుంటే నీ మూలలే ఉండవు చూసుకో
ఇకనైనా నీ మూసిన కనులు తెరుచుకో
అన్నీ ప్రాణులతో కలసి సుఖంగా ఈ ధరిత్రిని ఏలుకో

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా

లోకాః సమస్త సుఖినోభవంతు
-మీ శివ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...