11, మే 2025, ఆదివారం

*మురళీ నాయకా నీకిదే వందనం.*

అగ్నివీరుడవై జ్వలించావు.
రక్త సింధూరమై నిలిచావు.
యువతకో స్ఫూర్తి నిచ్చావు,
దేశరక్షణ పథం చూపించావు.

ఇకనైనా కళ్ళు తెరవాలి జనం,
సంఘటితమై, మెలగాలిక మనం,
మూగబోయింది మురళీగానం,
వ్యర్ధంకాకూడదు ఆ బలిదానం.

భరతమాత సేవలో నీ జన్మధన్యం,
ఆమె నుదుట సింధూరమై,
భాసిల్లిన నీ పవిత్ర జన్మ ధన్యం.
మురళీ నాయకా నీకిదే వందనం.

- శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హిందు వీర లేవరా, కదం కదం కలపరా

 హిందు వీర లేవరా, కదం కదం కలపరా ఈ దేశము జగద్గురువు చేయగా, కదలిరా హిందు వీర లేవరా, కదం తొక్కి కదలిరా నీ దేశము విశ్వగురువు చేయగా, తరలిరా ధర్మ ...