3, మే 2025, శనివారం

విజయ కమల వికాసం

మనుసులో ఆశల అలలు ఎగిసిపడుతుంటే,
ఊహలు కొండదాటిపోతున్నాయి.
మదిలో కోరికలు సుడులు తిరుగుతుంటే,
కళ్ళు ఓటమి భయంతో బెదురుతున్నాయి.
చేయగలనన్న ధీమా చేతులు వ్యక్తం చేస్తుంటే,
గెలవలేనన్న భయంతో కాళ్ళు తడబడుతున్నాయి.


నిరాశ చీకట్లు నిను ముసురుతున్న వేళ,
విజయం దోబూచులాటాడుతుంది.
విడువక నువ్వు ప్రయత్నిస్తే, నిలిస్తే,
సహనంతో ముందడుగేస్తే, తపిస్తే,
మనోధైర్యమనే చందురుడు వెలుగు పంచుతాడు.
ఆత్మస్థైర్యమనే సూరీడు నిరాశ చీకటి మింగివేస్తాడు.
విజయ కమలమపుడు నీ ముంగిట వికసిస్తుంది.

-శివ భరద్వాజ్ 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

స్నేహమే జీవిత సారథి

పంచప్రాణాలే జీవితానికి పునాది, ఆరోప్రాణం స్నేహమే దానికి సారథి.  ఉపిరి లేని శరీరంలా, పంజరంలోని పక్షిలా, స్నేహం లేని హృదయం, మౌనపు శిలలా. చూపుల...