16, మే 2025, శుక్రవారం

*ప్రజల మన్నన పొందేదెందరు!*

*ప్రజల మన్నన పొందేదెందరు!*

విసిరే మెతుకుల ఆశల బతుకులు,
నిండీ నిండక కాలే కడుపులు.
విరిసీ విరియక రాలే నవ్వులు,
ఎదిగీ ఎదగక ఒరిగే కలలు.

చేసి చేయక చేసే సాయము,
లంచపు రక్కసి అక్కున చేరు.
అందీ అందక అందే ఆసరా,
చాలీ చాలని దీపపు వెలుగు.

వెలుగులు పంచే చదువులు ఏవి?
న్యాయము చేసే చట్టములేవి?
రాజ్యము చేసే స్వాములు ఎవ్వరు?
దోపిడి దొంగల వారసులందరు.

కాసులు ఉంటే దాసోహం,
కులములు అంటే వ్యామోహం,
నైతిక వర్తన నేతి బీరరా,
నాయక వర్తన అధికారమురా.
ఓడిన , గెలిచిన, గెలిచిన పార్టీ,
మాదేనంటూ, గోడలు దూకే
గండు పిల్లులే నాయకులందరు.
ప్రజల మన్నన పొందేదెందరు!

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఓటు నా చేతిలో… అధికారం మాత్రం వారి చేతిలో!

ఓటు వేసేది నేనే… పన్ను కట్టేది నేనే… ఆట ఆడేది మాత్రం వారే! కోట కట్టేది మాత్రం వారే! అరాచక చదరంగంలో, రాజు ప్రజలే అయినా… మంత్రుల చేతిలోనే అధిక...