12, ఫిబ్రవరి 2025, బుధవారం

𝕝𝕝 శ్లోకం 𝕝𝕝

       𝕝𝕝 శ్లోకం 𝕝𝕝

ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యా చ సాంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమో
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.

          మాతృ పంచకం - శ్రీ శంకరాచార్య

తా𝕝𝕝  అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను అనుభవించావో కదా ! కళను కోల్పోయి, శరీరం శుష్కించి,శయ్య మలినమైనా - సంవత్సరకాలం ఆ క్లేశాన్ని ఎలా భరించావోకదా ! ఎవరైనా అలాంటి బాధను సహించ గలరా ? ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు అంజలి ఘటిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ

 "ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు… ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ… ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?...