🔱 అంతర్యామి 🔱
🍁జ్ఞానార్జనపై ఉత్సుకత, అభివృద్ధిపై ఆకాంక్ష, లక్ష్యసాధనపై ఆసక్తి ఏర్పడినప్పుడు మానవుల మనో జ్ఞాననేత్రాలు వికసిస్తాయి. మేధా వికాసానికి, సమాజ పురోగతికి దారులు ఏర్పడతాయి. అలాంటి జ్ఞాన సంపత్తి పొందడానికి జిజ్ఞాస అవసరం. ఆ జిజ్ఞాసే మానవుల్ని ఇతర జీవులకన్నా ఉన్నతుల్ని చేసింది.
🍁మహాభారతం అరణ్యపర్వంలో యక్షప్రశ్నల ఘట్టంలో యమధర్మరాజు పాండవాగ్రజుని అనేక అంశాలపై ప్రశ్నిస్తాడు. వాటికి చక్కటి సమాధానాలు చెప్పి తన సోదరులను పునర్జీవితులను చేసుకుంటాడు ధర్మరాజు. సాక్షాత్తు యమధర్మరాజు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేంత ప్రజ్ఞ ధర్మరాజుకు కలగడానికి కారణం ఆయనకున్న జిజ్ఞాసే. తన సోదరులతో కలిసి పన్నెండేళ్లపాటు ధర్మరాజు చేసింది అరణ్యవాసం మాత్రమే కాదు. అరణ్యమనే విశ్వవిద్యాలయంలో ఓ జిజ్ఞాసిగా విద్యాభ్యాసం చేశాడు. యక్షప్రశ్నలు ఆయనకు స్నాతక పరీక్ష వంటివి. దానికి పరీక్షాధికారి యమధర్మరాజు. అరణ్యవాస కాలంలో అనేకమంది మహర్షులను ప్రశ్నించి, ఆకళింపు చేసుకున్న విషయ పరిజ్ఞానమే ధర్మజుడి చెవి జ్ఞానులు మెచ్చే సమాధానాలను చెప్పించింది. నలుగురు తమ్ముళ్ల ప్రాణాలను నిలబెట్టింది.
🍁జిజ్ఞాస పెంచుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. వృద్ధాప్యం, రోగం, మరణాల మూలాలను తెలుసుకుని వాటిని అరికట్టే మార్గాన్ని అన్వేషిస్తూ సన్యాసిగా మారి ధ్యానించాడు సిద్ధార్థుడు. ఆయనలోని జిజ్ఞాసే జ్ఞానోదయం కలిగించి గౌతమ బుద్ధుడిగా ఆధ్యాత్మిక వెలుగులు పంచేలా సహాయపడింది.
🍁'విజ్ఞుడవును నరుడు జిజ్ఞాస చేతనే' అన్నట్టు ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకుని అద్భుతాలు సాధించారు కొందరు శాస్త్రజ్ఞులు. అలాంటివారిలో అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాబీ ఒకరు. రాబీకి నోబెల్ బహుమతి ప్రకటించగా ఒక విలేకరి ఆయన్ని విజయరహస్యం చెప్పమన్నాడు. అందుకాయన'నా తల్లే' అని బదులిచ్చాడు. ఆశ్చర్యపోయిన విలేకరి వివరంగా చెప్పమని కోరినప్పుడు 'నేను పాఠశాల నుంచిఇంటికి వెళ్లేసరికి బడిలో ఉపాధ్యాయుణ్ని ఏమైనా ప్రశ్నించావా' అనడిగేది అమ్మ. బడిలో నేను ప్రశ్నించాలంటే ఆలోచించాల్సి వచ్చేది. అలా ఆలోచనలకు పదును పెట్టేవాడిని. అమ్మ నేర్పిన ప్రశ్నలడిగే తత్వమే నాకు నోబెల్ బహుమతిని ఇప్పించింది' అని చెప్పాడు రాబీ.
🍁ప్రశ్నించే తత్వాన్ని పెంచుకుంటూ జ్ఞానమార్గంలో నిరంతరమూ పయనించడమే జిజ్ఞాసువు లక్షణం. అనుక్షణం జ్ఞాన సముపార్జన దిశగా అడుగులేసేవారు మేధావిగా రూపుదిద్దుకుంటారు. అనేకమంది మేధావుల అన్వేషణా శ్రమ ఫలితమే నేటి తరం అనుభవిస్తున్న కృత్రిమ మేధ సహా అనేక సదుపాయాలు, సౌకర్యాలు, 'కఠినంగా ఉన్నదాన్ని సరళంగాను, సరళం ఉన్నదాన్ని అలవాటుగాను, అలవాటుగా ఉన్నదాన్ని ఆహ్లాదంగానూ తయారు చేసుకున్నప్పుడే విజయం సులభం' అని గ్రంథాలు చెబుతాయి. అందరూ జిజ్ఞాసువులై నూతన విషయాలు ఆకళింపు చేసుకుని జగత్ప్రయోజనకర కార్యాలు చేపట్టినప్పుడే మానవాళికి మేలు జరుగుతుంది.🙏
✍️- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
23, ఆగస్టు 2024, శుక్రవారం
🔱 అంతర్యామి 🔱
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!
డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే! డబ్బు చేసిన మనిషి, జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే! పడవ పయనం సాగాలంటే, నీటి అవసరం నిజమే! పడవలోకి నీరు పయనిస్...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
తాతలు తాగెను పారేటి నదులందు నీరు నాన్నలు తాగెను ఊరి బావులందు నీరు మనము తాగెను చేతి పంపులందు నీరు పిల్లలిప్పుడు తాగెను ప్లాస్టిక్ బాటిలందు నీ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి