ఆరోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నుండి వెళ్ళిపో యింది. తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విష యం తెలియక ఒక వృద్ధురా లు రైలు కొరకు ఎదురుచూస్తూ ప్లాట్‌ఫారమ్పై కూర్చొని ఉంది. అది గమనించిన ఒక కూలీ ఆ తల్లిని అడిగాడు.అమ్మా,మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అని. దానికి సమాధానంగా ఆ పెద్దా విడ నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది. జవాబుగా కూలీ ఈరోజు ఇక రైలు లేదు కదామ్మాఅనిచెప్పా డు. అందుకు ఆ స్త్రీ నిస్సహా యంగా చూసింది. అయితే ఆమెకు వెయిటింగ్ రూమ్‌లో ఆశ్రయం కల్పించాడు. అంత టితో ఆగ కుండా ఆ కూలీ ఆమె కొడుకు గురించి అడగగా ఆమె తన కొడుకు రైల్వేలో పని చేస్తున్నాడని బదులిచ్చింది. పేరు చెప్పండి, సంప్రదించడాని కి మేము ప్రయత్నిస్తాము అన్నాడు ఆ కూలి. మా అబ్బా యిని అందరూ
లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు అని ఆమె బదులిచ్చారు. ఆ స్త్రీ మూర్తి కొడుకు అప్పుడు ఇండి యన్ రైల్వేస్ కేంద్ర కేబినెట్ మినిస్టర్. ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది. వెంటనే సైరన్ కారు వచ్చింది. వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. ఈ విష యం లాల్ బహదూర్ శాస్త్రికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్నిఏర్పాట్లు చేసింది. ఆవిడ ఢిల్లీలో తన కొడుకుని కలిసిన తర్వాత కొడుకుని ఈవిధంగా అడిగింది - "అబ్బాయి, నీవు రేల్వే లో ఏం పని చేస్తావు..."
"ఆయన అన్నారు. పెద్దగా చెప్పుకో దగ్గ పని కాదులెమ్మా అని.."
ఇంత సాత్వికతతో వున్నారు కాబట్టే ...ఒక రైలు ఆక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు తన బాధ్యతగా భావించి రాజీనామా చేశారు.
ఆతరం ఈ తరానికి ..
ఖచ్చితంగా ఆదర్శం...
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
26, ఆగస్టు 2024, సోమవారం
పెద్దగా చెప్పుకో దగ్గ పని కాదులెమ్మా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!
డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే! డబ్బు చేసిన మనిషి, జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే! పడవ పయనం సాగాలంటే, నీటి అవసరం నిజమే! పడవలోకి నీరు పయనిస్...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
తాతలు తాగెను పారేటి నదులందు నీరు నాన్నలు తాగెను ఊరి బావులందు నీరు మనము తాగెను చేతి పంపులందు నీరు పిల్లలిప్పుడు తాగెను ప్లాస్టిక్ బాటిలందు నీ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి