జయము జయము చౌడేశ్వరి,
జయము నీకు జగదీశ్వరి,
ఈ జగాన సాటి ఎవ్వరు ఓయమ్మ నీకు.
దేవాంగుల కులదేవతవు ఓయమ్మ నీవు. "జయము"
శంకరుని ఆనతిన, విష్ణుమూర్తి నాభినుండి,
నూలు పోగు వెలికితెచ్చి, దేవలుడు వెళుతుంటే,
రక్కసులు మాయచేసి, ప్రాణములు తీయరాగ,
నీ పుత్రుని కాపాడి ప్రాణ భిక్ష పెట్టినావు.
నిజముగ నువు మహా శక్తివే ఓయమ్మ నీవు. "జయము"
ఆషాఢ మాసాన, అమావాస్య చీకటిలో,
సూర్యుడంటి చూడముతో, అర్ధరాత్రి సమయాన,
దనుజులను ఉత్తరించ, వెలసితివి ఓయమ్మా ,
నిజముగ నువు పరాశక్తివే ఓయమ్మ నీవు. "జయము"
దేవలుని ప్రార్థనకు, పిలిచినా పలికెదనని,
అమావాస రోజులలో, ఆరాధన చేయమని,
దేవాంగుల కాపాడగ, కుల దేవతవైనావు,
నిజముగ మము కన్న తల్లివే ఓయమ్మ నీవు. "జయము"
-శివ భరద్వాజ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి