కలగని కల్మషము లేక,
లక్ష్యము స్థిరము కాగా,
నిలకడ యత్నము చేయ,
జలధి ఉప్పొంగనీ, కల నిజము కాదా!
-శివ భరద్వాజ్
ఏవిధమైన కల్మషము లేకుండా మనము కన్న కలలు ఏమైతే ఉన్నాయో, వాటిని మనం లక్ష్యాలుగా ఏర్పరుచుకోవాలి. ఈ లక్ష్యం స్థిరము కావాలి. పరిస్థితులు అనుకూలమైన, అనుకూలంగా లేక పోయినా, లక్షంపై మాత్రమే మన దృష్టి ఉండాలి. మన అడుగులు ఎప్పుడూ లక్ష్యంపై పడుతూ ఉండాలి. ఏకారణం చేతనైనా మనం పక్కదారి పడితే తిరిగి మన అడుగులు లక్ష్యం వైపు వేయాలి. అందుకు మీ లక్ష్యంని ఒక పోస్టర్ గా రూపొందించి దానిని మీ బెడ్ రూమ్ లో, మీరు ఇంటి హాలులో, మీ కారులో, మీ whatsapp DP గా, మీ movile wallapaper గా పెట్టుకోవాలి. నలుగురికి చెప్పాలి. ముఖ్యంగా మిమ్మల్ని ఎగతాళి చేసేవారికి, అప్పుడు మీరు పక్కకి తప్పుకుంటున్నప్పుడు అవి/వారు మీకు గుర్తు చేస్తాయి/చేస్తారు. మీరు లక్ష్యం సాధించగలరన్న బలమైన నమ్మకంతో, మీ లక్ష్యం కోసం క్రమం తప్పకుండా, ప్రతిరోజూ మీ ప్రయత్నం చేయాలి. అప్పుడు మీరు అనుకున్న లక్ష్యం సముద్రం ఉప్పొంగిపోయినా అంటే ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీరు సాధించగలరు. మీ కలని నిజం చేసుకోగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి