10, జూన్ 2024, సోమవారం

ఎలా అయితే కట్టె సహాయము లేకుండా గొడ్డలి చెట్టును నరకలేదో

 ఆటవెలది:

నిటుల జరుగు చున్నది మనుజలందున,
ఎటుల చెట్టు నరుకుటకును, చెట్టు
యొక్క కట్టె సాయ గొడ్డలి కందునో,
నటుల కొందరు తమ జాతి నరుకు.

భావం: ఎలా అయితే కట్టె సహాయము లేకుండా గొడ్డలి చెట్టును నరకలేదో, అలాగే కొందరు స్వార్ధపరులైన మనుషులు తమ జాతినే నరుకుటకు గొడ్డలివంటి పరాయి దుర్మార్గులకు సాయము చేయును.
ఇలాగే పూర్వము మొఘలులు, బ్రిటిష్ వారు మన జాతి మీద అధిపత్యము చలాయించారు.

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హృదయపు కొండలలో ప్రతిజ్ఞ మారుమోగుతోంది

  ఒక్క క్షణం, మనసులో ఒక ఆలోచన, విద్రోహం జన్మించి, వికృతంగా నవ్వింది. మరుక్షణం, ఆ ఆలోచన, మలుపు తిరిగి, ఆకులలో, చీకటిలో, ఇరుకైన కనుమలలో, లోయలల...