12, మే 2024, ఆదివారం

అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

💐💐💐*మా అమ్మలాంటి అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.*💐💐💐


*అమ్మా - నీ ఋణమెలా తీర్చగలనమ్మా*

నీ పొట్టలో వసతిని ఇచ్చి,
నీ ఎముకల సారము పంచి,
నాకొక రూపుని ఇచ్చి,
నే పెట్టిన ఇబ్బంది మరిచి,
నే తన్నితే ఎంతో మురిసి,
నాకై మరు జన్మను ఎత్తి,
నాకు జన్మను ఇచ్చిన అమ్మ!
నీ ఋణమెలా తీర్చగలనమ్మా!!

నీ రక్తము పాలను చేసి,
నీ గుండెలు పళ్ళెము చేసి,
నా ఆకలి తీర్చిన అమ్మ!
నీ ఋణమెలా తీర్చగలనమ్మా!!

నీ ఒడిలో జోలను పాడి,
నీ గుండెల దిండును చేసి,
నీ పొట్టను పరుపును చేసి,
నీ కొంగును దుప్పటి చేసి,
నీ చేతులు అభయము నిచ్చి,
నన్ను నిద్రపుచ్చిన అమ్మ!
నీ ఋణమెలా తీర్చగలనమ్మా!!


🙏*అమ్మా నీ ఋణమెలా తీర్చగలనమ్మా*🙏

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హిందు వీర లేవరా, కదం కదం కలపరా

 హిందు వీర లేవరా, కదం కదం కలపరా ఈ దేశము జగద్గురువు చేయగా, కదలిరా హిందు వీర లేవరా, కదం తొక్కి కదలిరా నీ దేశము విశ్వగురువు చేయగా, తరలిరా ధర్మ ...