కరకు రాక్షస రూపుడైన
నరకు కన్న కొడుకైనా
మరణము నిచ్చె అమ్మైన
ధీర సత్యభామ, పడతుల చెర విడిపించ
నరకు మారు రూపులై అబలల
మానముతో నాటలాడు కొడుకుల
శిరము నుత్తరించవలె అమ్మైన
ధీర నేటి భామ, మగువల నుద్దరించగ
మిత్రులకు బంధువులకు
దీపావళి శుభాకాంక్షలు
--శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
24, అక్టోబర్ 2022, సోమవారం
పడతుల చెర విడిపించ - మగువల నుద్దరించగ
27, సెప్టెంబర్ 2022, మంగళవారం
మంచిమాట - Quotation
ఈనాటి మంచిమాట:
22 అక్టోబర్ 2022
సరైన వైఖరితో
సరైన సాధనాలతో
సరైన సమయంలో
సరైన పద్ధతిలో
సరిగ్గా పనులను చేస్తే
విజయం మీతో దోస్తీ చేస్తుంది.
సదాలోచన మాధవుని చేస్తుంది.
రంధ్రాన్వేషణ చేయకు
రసాస్వాదన మానకు
10 అక్టోబర్ 2022
తాను జీవించడానికి మూల్యం చెల్లించే ఏకైక జీవి మనిషి 27 సెప్టెంబర్ 2022
చిరునవ్వు ద్వేషాన్ని సైతం జయిస్తుంది.
చిరునవ్వు కోపాన్ని సైతం కరిగిస్తుంది.
4, సెప్టెంబర్ 2022, ఆదివారం
పంచకోశ శుద్ధి - పంచ జ్ఞాన సిద్ధి
భారతీయ వేదాంత తత్వచింతన చెప్పిన ఆధునిక సైకాలజీ సంగతులు:
మనందరం ఆధునిక మనోతత్వశాస్త్రంలో (సైకాలజీ) లో మనిషి తెలివితేటలు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తరుచుగా IQ గురించి వింటుంటాం. IQ అనే పదాన్ని 1912లో జర్మన్ మనస్తత్వవేత్త విలియం స్టెర్న్ రూపొందించారు. ఒక మనిషి ఎదుగుదలకు IQ చాలావరకు కారణం అవుతుంది. మరోవైపు, పని మరియు వృత్తి వంటి జీవిత రంగాలలో మీ విజయాన్ని నిర్ణయించే విషయంలో EQ ముఖ్యమైనది అనే భావన 1990లలో పుట్టి, 1995లో డేనియల్ గోలెమాన్ పుస్తకం ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని తర్వాత SQ కూడా మనిషి విజయానికి తోడ్పడుతుందని కనుగొన్నారు. ప్రస్తుతం వీటన్నిటికీ తోడుగా AQ కూడా విజయానికి దోహద పడుతుందని వివరిస్తున్నారు.
సమగ్ర నాయకత్వ విధానానికి, జీవితంలో విజయానికి ఐదు Qలు అవసరం. అవి
1) Physical Quotient (PQ) భౌతిక
2) Intelligence Quotient (IQ) మేధస్సు
3) Emotional Quotient (EQ) ఉద్వేగం
4) Spiritual Quotient (SQ) ఆధ్యాత్మికం
5) Adversity Quotient (AQ) ప్రతికూలత నెదుర్కొనటం
Physical Quotient: మనిషి విజయంలో వ్యక్తిగత ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కు గల ప్రాధాన్యత వివరిస్తుంది. ఆరోగ్యం మరియు ఫిట్నెస్ లేని వ్యక్తి విజయం పొందే అవకాశాలు తక్కువ.
Intelligence Quotient: ఇది గ్రహణశక్తి స్థాయికి కొలమానం. సమస్యలు పూరించడం, తార్కికంగా ఆలోచించటం మరియు జ్ఞాపకశక్తికి ఇది కొలమానం.
Emotional Quotient: ఇది ఆత్మవిశ్వాసం, స్వయం నియంత్రణ, అనుకూలత మరియు చొరవచూపగలగటం గురించి తెలుపుతుంది. అదేవిధంగా సామాజిక సంబంధాల మెరుగుదల, ఇతరులపట్ల సానుభూతితో వ్యవహరించటం, సేవాధోరణి. స్ఫూర్తిదాయక నాయకత్వ పద్ధతులు; మార్పు నిర్వహణ; సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలు; సమిష్టి కృషి మెళుకువలు గురించి ఇది తెలుపుతుంది.
Spiritual Quotient:
ఇది పరిస్థితితో సంబంధం లేకుండా, అంతర్గత మరియు బాహ్య శాంతిని కొనసాగిస్తూ,
జ్ఞానం మరియు కరుణతో ప్రవర్తించే సామర్థ్యం. అహంకారాన్ని నియంత్రించగల
సామర్ధ్యం. మన ఉద్దేశ్యాలు, విలువలు వాటి పట్ల మన దృష్టి మరియు నమ్మకం
కోల్పోకుండా ఉన్నతమైన శక్తినుండి మార్గదర్శకత్వం కోరడం.
Adversity Quotient: ఇది ప్రతికూల పరిస్థితులను చక్కగా నిర్వహించగల సామర్థ్యం మరియు మారుతున్న పరిస్థితులను అనుకులంగా మార్చుకోగల సామర్ధ్యం గురించి తెలుపుతుంది.
ఇప్పుడు భారతీయ ఆధ్యాత్మిక చింతనలో చెప్పబడ్డ పంచకోశాలు గురించి తెలుసుకొందాం. ఈ పంచకోశాలను శుద్ధి చేయడం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకుంటూనే మన జీవితం మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు. ఈ కోశాలు ఐదు రకాలు. అవి
1)అన్నమయ కోశము: ఇది భౌతిక కోశం. మనకు కనిపించే శరీరం. మనకు ఉన్న శారీరక రుగ్మతలు లేదా ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. మన శరీరం వివిధ రకాల ఆహారాలకు ఎలా స్పందిస్తుందో కూడా మీరు శ్రద్ధ వహించవచ్చు.అయిదు జ్ఞానేంద్రియాలను కలిగి ఉంటుంది. 1.చూపు,2.వాసన, 3.స్పర్శ,4.రుచి,5.వినికిడి లతో ఉన్న శరీరం అన్న మాట. అలాగే ఆ శరీరంలో ఎముకలు,కండరాలు,అవయవాలు ఈ అన్నమయ కోశ పరిధిలోకే వస్తాయి.దీనిని శుద్ధి చేసుకొనుట ద్వారా మానవుడు శారీరక ఆరోగ్యాన్ని పొందుతాడు. దీనికి ఆహార నియమాలు, యోగాసనాలు ఉపయోగ పడతాయి. ఆయుర్వేద విజ్ఞానం ద్వారా శారీరక రుగ్మతలు తొలగించుకోవచ్చు. మన PQ మెరుగవుతుంది.
2)ప్రాణమయ కోశము: మనం పంచేంద్రియాల ద్వారా గ్రహించినది శరీరంలో ఉన్న పంచ ప్రాణాల ద్వారా మన మెదడుకు చేరవేయబడుతుంది. ఎవరిలో ఈ ప్రాణశక్తి అధికంగా ఉంటుందో వారు మెదడు ఎక్కువ సమర్ధవంతంగా పనిచేస్తుంది. వారి IQ ఎక్కువగా ఉంటుంది. యమ, నియమాలు , ప్రాణాయామం వల్ల ఇది చైతన్యవంతమవుతుంది.
3)మనోమయ కోశము: 'మన" అంటే మనస్సు.ఇది ఆలోచనలు మరియు భావనలు, మెదడు మరియు ఎమోషన్ ల సమ్మిళితం. ఇందులో చేతనా, ఉప చేతనా మరియు అచేతనా అవస్థలు ఉంటాయి. దీనినే కాన్సియస్, సబ్ కాన్సియెస్ మరియు అన్ కాన్స యెస్ అంటాము. మీ మనస్సులో ఏమి జరుగుతుందో అది మీ శరీరంలో కూడా జరుగుతుంది.బాహ్య ప్రపంచం నుండి అనుభవాలు మరియు అనుభూతులను మీ సహజమైన శరీరంలోకి తీసుకువస్తుంది. మీ భావలకు ఉద్వేగాలకు ఇది మూలం. దీనిని నియంత్రించడం ద్వారా మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోగలుగుతారు. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. అందరితోను మీ సంబంధములును మెరుగు పరుచుకుంటారు. అరిషడ్వర్గములు ఈ కోశ శుద్ధి ద్వారా అరికట్టబడతాయి. ఇది ధ్యానం వల్ల సాధ్య పడుతుంది. మీ EQ మెరుగవుతుంది
4)విజ్ఞానమయ కోశము: ఇది మీ అంతర్ దృష్టి మెరుగు పరుస్తుంది. ఇది లోతైన అవగాహనను పెంపొందిస్తుంది మరియు వాస్తవికతను చూడటం నేర్పిస్తుంది. మీరు మీ ఆలోచనలను అహంకారం నుండి వేరుచేయడం నేర్చుకున్నప్పుడు మీరు అంతర్గతంగా అభివృద్ధి చెందుతారు. మీ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేయడం తెలుసుకుంటారు. జీవితంలో జరిగే సంఘటనలకు సాక్షిభూతులుగా ఉంటారు. సమత్వ భావం అలవర్చుకోంటారు. గెలుపు ఓటములు యొక్క ఉద్వేగాలు మిమ్మల్ని చేరవు. మీరు కేవలం మీ ప్రయత్నాన్ని 100% చేయడంపై దృష్టి పెడతారు. ఫలితం ఏదైనా మీరు సిద్ధంగా ఉంటారు. ఈ స్థితి మీరు ధ్యానంలో ఉచ్ఛ స్థితికి చేరినప్పుడు కలుగుతుంది. ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు అనే పరిమితులు ఉండవు. ఏ పరిస్థితి ఎదురైనా అది మీకు అనుకూలంగా మార్చుకోగలిగే జ్ఞానం మీకు కలుగుతుంది. SQ మరియు AQ ను విజ్ఞానంమయ కోశ శుద్ధి చేసుకొనుట ద్వారా వృద్ధి చేసుకోవచ్చు.
5)ఆనందమయకోశము: ఇది ఆత్మ పరమాత్మ, సుఖ దుఃఖములు, ప్రియాప్రియములు మొదలగు ద్వంద్వాలకతీతముగా ఉంటుంది. అందువల్ల మీరొక అద్భుత అలౌకిక ఆనంద స్థితిలో ఉంటారు. మీరు దేనినుండి వేరుకాదు అంతా మీరే అన్న స్పృహ కలుగుతుంది. ఇది సమాధి స్థితిలో అనుభవం అవుతుంది.
21, ఆగస్టు 2022, ఆదివారం
మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
తూటాల కన్నా బలంగా విసిరేస్తుంటాం
ఒక్క క్షణం ఆగి ఆలోచించం
తగులుతుంది ఎక్కడని!
మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
ఝటాలు పదేపదే చెబితే నమ్మేస్తుంటాం
ఒక్క క్షణం తర్కించి ఆలోచించం
బలయ్యేది ఎవరని!
మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
నాటకాలను నమ్మి మోసపోతుంటాం
ఒక్కక్షణం ఉద్వేగాలను వదిలి నిజాయితీగా నీ మనసునడిగితే
చెబుతుంది నిజమేమిటని!
మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
అది కొన్ని జీవితాలను
అది కొన్ని కుటుంబాలను
సమాజాన్ని శాశ్వతంగా నిశీధిలోకి
నెట్టేస్తుందని ఆలోచించం
వారికి చెప్పుకునే ఏ ఒక్క అవకాశాన్ని
మిగల్చకుండా
మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
-- శివ భరద్వాజ్
భాగ్యనగరం.
16, ఆగస్టు 2022, మంగళవారం
నా గుండెలో బాధ మేఘసందేశమై వర్షిస్తుంది అందుకో ప్రియతమా!
నా గుండెలో బాధ మేఘసందేశమై వర్షిస్తుంది అందుకో ప్రియతమా!
నీ విరహపు తలపుల ఊహలలో
బరువెక్కిన కన్నుల చూచి
నింగినుండి మబ్బు తునక నను చేరి
కంటినున్న కన్నీటిని మోసుకెళ్లి
నా ప్రేమను వర్షిస్తానన్నది
నా గుండెలో బాధ
మేఘసందేశమై వర్షిస్తుంది అందుకో ప్రియతమా!
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
15, ఆగస్టు 2022, సోమవారం
ఎగరేయండి భారత కీర్తి పతాకను - జరపండి స్వాతంత్ర్య అమృతోత్సవాలను
వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్న ఈ దేశంలో
రావాలి స్వాతంత్య్రం ఆకలి చావుల నుండి
కావలి స్వాతంత్య్రం విద్య వ్యాపారం నుండి
తేవాలి స్వాతంత్య్రం వైద్య వ్యాపారం నుండి
రావాలి ఒకే దేశం, ఒకే చట్టం
కావలి ఒకే కులం, ఒకే మతం
ద్వేషం మరింత పెరిగి, స్వార్ధం మరింత కలిగి
ఉన్న దేశ భక్తి కరిగి స్వాతంత్రం పరతంత్రం
అయ్యేలా చేష్టలుడిగి జవచచ్చిన పౌరులారా
మేల్కొండి తిప్పండి ప్రగతి రధచక్రాలను
ఉచితాలకు బిక్షగాళ్ళై మిగలక
చేరండి సమున్నత శిఖరాలను
దేశభక్తిని విశ్వ శక్తిగా మార్చి
ఎగరేయండి భారత కీర్తి పతాకను.
జరపండి నిజమైన స్వాతంత్ర్య అమృతోత్సవాలను
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
14, ఆగస్టు 2022, ఆదివారం
ఆగష్టు 14 అఖండ భారతి ముక్కలైన రోజు
ఆగష్టు 14 అఖండ భారతి ముక్కలైన రోజు
అఖండ భారతి ముక్కలైన రోజు
కుటిల నీతికి నేతలు తలవంచిన రోజు
ఈ రోజుకి ఆగని చితి రగిలి న రోజు
అన్నదమ్ముల బద్ధ శత్రువులజేసి
మతము చేసిన మారణ హోమానికి
అమాయక ప్రజలు సమిధలైన రోజు
జన్మభూమితో బంధం తెగిపడి
ప్రాణాలరచేతినబట్టి పరిగెత్తిన రోజు
రాబందుల రాజ్యంలో రాబందులకాహారంగా
లక్షల పీనుగులు అనాధ ప్రేతలై మిగిలిన రోజు
ఆత్మ బంధాలు, రక్త బంధాలు
తెగిపడి రక్తం ఏరులై పారినరోజు
కుటిల నీతికి నేతలు తలవంచిన రోజు
ఈరోజే ఆరని చితి రేగిన రోజు
స్వతంత్రామృతం దక్కే ముందు
మతము పేరిట హాలాహలం ప్రభవించిన రోజు
-- శివ భరద్వాజ్,
భాగ్య నగరం
5, ఆగస్టు 2022, శుక్రవారం
చీకట్లో నీడైన నీ తోడు నిలవదు - వెలుగులో నీడ అవసరం నీకు ఉండదు
మిత్రులు ఎవ్వరు శత్రువులెవ్వరు
బంధువులెవ్వరు రాబందువులెవ్వరు
కన్నుల ముందర పొగుడునదెవ్వరు
కన్నుల దాటిన తెగుడునదెవ్వరు
కష్టములందు కాచునదెవ్వరు
సుఖములందు చేరునదెవ్వరు
భాగ్యనగరం
30, జులై 2022, శనివారం
స్నేహం - స్నేహితుడు (అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో )
స్నేహం - స్నేహితుడు
మిత్రమా
నీ స్నేహం ఓదార్పు నే భాదలో ఉన్నప్పుడు
నీ స్నేహం కనువిప్పు నే తప్పు చేసినప్పుడు
నీ స్నేహం ఆదరువు నాకే దారి దొరకానప్పుడు
నీ స్నేహం పెన్నిధి నాదగ్గరేది లేనప్పుడు
నే వాఖ్యాతనైతే నా మొదటి శ్రోతవు నువ్వు
నే గాయకుడినైతే నా మొదటి శ్రోతవు నువ్వు
నే నటుడినైతే నా తొలి వీక్షకుడు నువ్వు
నే చిత్రకారునైతే నా తొలి సందర్శకుడు నువ్వు
నే రచయితనైతే నా తొలి విమర్శకుడు నువ్వు
నే కళాకారునైతే నా తొలి ఆరాధకుడు నువ్వు
నే నేదైన నా తొలి చెలికాడు నువ్వు
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
భారతీయ మహిళ ఔన్నత్యం
నిజంగా లోతైన ఆలోచన కలిగించే వ్యాసం👇 🌼 మహిళల తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రయత్నించారా? 🌼 మనం తరచుగా తెలివి...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
స్పందించేందుకు సమయం లేదు వివరించేందుకు విషయం లేదు వినేటందుకు ఓపిక లేదు తెలుసుకునేంత తీరిక లేదు మన బ్రతుకేదో బ్రతికేస్తున్నాం మన చావేదో చస్త...