30, జులై 2022, శనివారం

స్నేహం - స్నేహితుడు (అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో )

 స్నేహం - స్నేహితుడు 

మిత్రమా


నీ స్నేహం ఓదార్పు నే భాదలో ఉన్నప్పుడు
నీ స్నేహం కనువిప్పు నే తప్పు చేసినప్పుడు
నీ స్నేహం ఆదరువు నాకే దారి దొరకానప్పుడు
నీ స్నేహం పెన్నిధి నాదగ్గరేది లేనప్పుడు

నే వాఖ్యాతనైతే నా మొదటి శ్రోతవు నువ్వు
నే గాయకుడినైతే నా మొదటి శ్రోతవు నువ్వు
నే నటుడినైతే నా తొలి వీక్షకుడు నువ్వు
నే చిత్రకారునైతే నా తొలి సందర్శకుడు నువ్వు
నే రచయితనైతే నా తొలి విమర్శకుడు నువ్వు
నే కళాకారునైతే నా తొలి ఆరాధకుడు నువ్వు
నే నేదైన నా తొలి చెలికాడు నువ్వు

--శివ భరద్వాజ్
భాగ్యనగరం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగష్టు 14 అఖండ భారతి ముక్కలైన రోజు

ఆగష్టు 14 అఖండ భారతి ముక్కలైన రోజు అఖండ భారతి ముక్కలైన రోజు కుటిల నీతికి నేతలు తలవంచిన రోజు ఈ రోజుకి ఆగని చితి రగిలి న రోజు అన్నదమ్ముల బద్ధ ...