సాధ్యమా! నడుప వాహనమును
తధ్యము బ్రతుకు గతిని తప్పును
మద్యము మాని నడు ప్రగతి పథమున
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
పుడమి తల్లి ఆక్రోశం
పుడమి తల్లి ఆక్రోశం ఎవ్వరు విందురు
అడవి అంతా గనులగా మార్చునదెవ్వరు
ఎడారిగ మారుటకు పచ్చటి అడవుల ఎదురుచూపులొకవైపు అవని
తడారి పగిలిన పంట పొలాలు ఒకవైపు
జడివానల భీతావహం ఇంకొకవైపు
కడగండ్లు పెట్టించు వడగండ్లు ఒకవైపు ఎవరి స్వార్ధం ఫలితమిది
నడిరేయిన కూడా వేడి గాలి వీస్తుంటే
సడిచేయక ఏసిల మాటున నిదురిస్తుంటే
నడి సంద్రమున మృత్యుఘోష హోరెత్తుతుంటే కనికరించునదెవరు
సుడులు తిరిగి పెను తుఫాను విరుచుకుపడుతుంటే
మడమ తిప్పక సంద్రముప్పెనై మీద పడుతుంటే
వడిగా ఎవరు వచ్చి రక్షించి దయ చూప వలె? అమ్మ ధరణి గాక
మనిషి ఆశకు అంతులేదు
మనమున్న అవనిని పట్టించుకోక
కనరాని అంగారక ఆవాసం ఆలోచిస్తున్నాం!
తను కూర్చున్న కొమ్మనరికి సాధించేది ఏమిటి?
వార్ధక షట్పద:
ధర్మాన్ని చెప్పు తాతయ్య దండగపేర
మర్మం తెలియక ఊరిలోనే ఉంచాము
నిర్మలమగు నీతి కథలు చెప్పు తాతమ్మను చేర్చితి వృద్ధాశ్రమున
ఖర్మ నీతి శాస్త్ర పిరియడ్ తీసివేస్తిమి
కమ్మగ చిన, పెద బాల శిక్ష లకు శిక్షలు
సమ్మగా వేసి, స్మగ్లర్స్ ను, రౌడీ, డాన్ లను హీరోలు చేస్తిమి మరి
నీతిగ బ్రతుకు వాడికి లౌక్యం తెలియదని
నీతి మాలి పక్కన పెట్టినా, బ్రతికుంది
నీతి ప్రతివాడిలో "నేతి" బీరకాయన నేతి వలె, అవకాశముకు
నాత్రపడి రానంత వరకు శ్రీరాములే,
నీతి మంతులే, అవకాశము దొరికిన ఏ
మాత్రంబు మారకుండు వాడే అచ్చమైన సీతారాముడగు మరి
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
తపించు - ఆచరించు - సాధించు
రావాలనుకుంటే రానిదేదీ లేదు
కావాలనుకుంటే కానిదేదీ లేదు
చేయాలనుకుంటే చేయలేనిది లేదు
దక్కాలనుకుంటే దక్కలేనిది లేదు
అనుకో
బలంగా అనుకో
కోరుకో
బలంగా కోరుకో
తపించు
ప్రతిక్షణం తపించు
ఆచరించు
అనుక్షణం ఆచరించు
అపుడు నువ్వు పొంద లేనిదేదీ ఉండదు
అపుడు నువ్వు సాధించ లేనిదేదీ ఉండదు
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
విజయవంతమైన జీవితం కావాలంటే
విజయ జీవితం కావాలంటే
త్యాగబుద్ధి ఇక రావలోయ్
బద్దకాన్ని నీ వదలలోయ్
వేకువఝామున లేవలోయ్
ధ్యానము నీవు చేయాలోయ్
విజయ జీవితం కావాలంటే
యోగము నీవు చేయాలోయ్
ప్రాణాయామం సాగాలోయ్
బుద్ధిని నీవు పెంచాలోయ్
కండను కలిగి ఉండాలోయ్
విజయ జీవితం కావాలంటే
కలలను పెద్దగ కనలోయ్
నీ లక్ష్యం రూఢి కావలోయ్
నిరతం మెరుగులు అద్దలోయ్
సతతం ప్రగతిని చూపాలోయ్
విజయ జీవితం కావాలంటే
లక్ష్యం దిశగా సాగాలోయ్
శ్రద్ధను నీవు నిలపాలోయ్
ఓర్పుతో ముందుకు సాగాలోయ్
లక్ష్యం ముంగిట నిలవలోయ్
-- శివ భరద్వాజ్
భాగ్యనగరం
ప్రొద్దున్నే లేచాను నీ చిరునవ్వుల పలకరింపులేదు
స్నానానికి వెళ్ళాను నీ పైట కొంగు నా తల తుడవలేదు.
టిఫిన్ తింటున్నపుడు కొసరి తినిపించే నీ చెయ్యి లేదు.
ఆఫీసుకు వెళ్తుంటే ముగ్ధమనోహర నీ రూపం ఎదురు రాలేదు.
లంచ్ అవర్లో నీ ఆప్యాతకలగలిసిన కాల్ రాలేదు.
సాయంత్రం ఇంటికి వస్తే నీవందించే కాఫీ లేదు.
రోజంతా పడిన శ్రమను సేదతీర్చే నీ మాటల లాలింపు లేదు.
మగమహారాజుల తిరిగే నా మగసిరికి సిరివైన నా అర్ధంగామా
అర్ధాంతరంగా నన్ను వదిలేసిపోతే నే తట్టుకోతరమా
అయిన జీవితకాలం నీవన్దించిన జ్నాపకాలు నెమరువేస్తూ
నీవు మీగిల్చిన పిల్లల భాధ్యతలను నేరవేరుస్తాను,
నీవు నేనై పిల్లలను లాలిస్తాను, నిను మరపిస్తాను.
ప్రతీక్షణం నిన్నే స్మరిస్తూ నీవులేని లోటు తీరుస్తాను.
నిన్ను నాలో నిరంతరం బ్రతికించుకుంటాను.
మరలి రాని లోకాలకు తరలి వెళ్ళిన నేస్తమా! నాలో సగమా!
మరుజన్మకు తోడై మరల రా నేస్తమా! నాలో సగమా!
-- శివ భరద్వాజ్
భాగ్యనగరం
కులమని మతమనివిభజించి
సాధించేదేమిటి శూన్యము తప్ప
ఒక మతాన్ని మరో మతం ప్రేమిస్తుందా?
ఒక కులాన్ని మరో కులం ప్రేమిస్తుందా?
మానవత్వాన్ని ప్రతి మతం ప్రేమిస్తుంది
జన్మభూమిని ప్రతి కులం ప్రేమిస్తుంది
నాయకులందరూ, ప్రజలందరూ
మానవత్వపు సువాసనలు వెదజల్లితే
దేశభక్తి కమ్మని రుచి రుచిచూపిస్తే
ప్రతి మనిషి అమరుడై నిలుస్తాడు
ప్రతి పౌరుడు స్వర్గాన్నిక్కడే చూస్తాడు
కులమని మతమనివిభజించి
సాధించేదేమిటి శూన్యము తప్ప
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
ప్రేమించునా ఒక మతము మరొకదానిని
ప్రేమించునా ఒక కులము మరొకదానిని
ప్రేమించును ప్రతి మతము మానవ తత్వమును
ప్రేమించును ప్రతి కులము మన జన్మభూమిని
నాయకులందరూ, ప్రజలందరూ
మానవత్వపు సువాసనలు వెదజల్లితే
మనదేశభక్తి కమ్మని రుచిని చూపితే
మనుషులంతా అమరులై నిలిచెదరిచ్చట
మనుషులంతా స్వర్గమును చూచెదరిచ్చట
నిజంగా లోతైన ఆలోచన కలిగించే వ్యాసం👇 🌼 మహిళల తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రయత్నించారా? 🌼 మనం తరచుగా తెలివి...