28, ఫిబ్రవరి 2022, సోమవారం

ప్రియతమా ! నాలో సగమా! అర్ధాంతరంగా నన్ను వదిలేసిపోతే నే తట్టుకోతరమా

ప్రొద్దున్నే లేచాను నీ చిరునవ్వుల పలకరింపులేదు
స్నానానికి వెళ్ళాను నీ పైట కొంగు నా తల తుడవలేదు.
టిఫిన్ తింటున్నపుడు కొసరి తినిపించే నీ చెయ్యి లేదు.
ఆఫీసుకు వెళ్తుంటే ముగ్ధమనోహర నీ రూపం ఎదురు రాలేదు.
లంచ్ అవర్లో నీ ఆప్యాతకలగలిసిన కాల్ రాలేదు.
సాయంత్రం ఇంటికి వస్తే నీవందించే కాఫీ లేదు.
రోజంతా పడిన శ్రమను సేదతీర్చే నీ మాటల లాలింపు లేదు.

మగమహారాజుల తిరిగే నా మగసిరికి సిరివైన నా అర్ధంగామా
అర్ధాంతరంగా నన్ను వదిలేసిపోతే నే తట్టుకోతరమా
అయిన జీవితకాలం నీవన్దించిన జ్నాపకాలు నెమరువేస్తూ
నీవు మీగిల్చిన పిల్లల భాధ్యతలను నేరవేరుస్తాను,
నీవు నేనై పిల్లలను లాలిస్తాను, నిను మరపిస్తాను.
ప్రతీక్షణం నిన్నే స్మరిస్తూ నీవులేని లోటు తీరుస్తాను.
నిన్ను నాలో నిరంతరం బ్రతికించుకుంటాను.

మరలి రాని లోకాలకు తరలి వెళ్ళిన నేస్తమా! నాలో సగమా!
మరుజన్మకు తోడై మరల రా నేస్తమా! నాలో సగమా!

-- శివ భరద్వాజ్
భాగ్యనగరం

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అద్భుతము జరుగునదే!

అద్భుతములు సృష్టించగ, అద్భుత యత్నములు, అవసరము లేదు సుమా! సద్బుద్ధి, యత్నములచే అద్భుతము జరుగునదే! నిరంతర శ్రమచే!! -శివ భరద్వాజ్