7, సెప్టెంబర్ 2025, ఆదివారం

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు,
విదేశీ శక్తులకు తలవొంచి నిలబడకు.  "స్వదేశీ"

నీ దేశపు సరుకులుండ ఇంకొకటి కొనబోకు 
విదేశీ వస్తువుల మోజులోన పడబోకు,
బెదిరింపులు ఇకమీద చెల్లబోవు చెల్లబోవు. 
బానిసత్వ బతుకులింక వద్దు మాకు వద్దుమాకు  "స్వదేశీ"

నీవద్ద లేనిదాన్ని తెచ్చుకో తప్పులేదు,
లగ్జరీల మాయలో పడిపోయి కొట్టుకోకు,
స్వచ్ఛమైన కొబ్బరీ నీళ్లుండగా కోకేందుకు,
నాటుకోడి పులుసుండగ kfc రుచులెందుకు   "స్వదేశీ"

శాశించే అధికారము డాలరుకి ఇవ్వబోకు 
బెదిరిస్తే రూపాయి బెదురునని చాటబోకు
ప్రజలంతా స్వదేశీ మంత్రాన్ని జపియిస్తే
ఎవరెస్టుకు చేరునోయి భారతీయ జీడీపీ   "స్వదేశీ"

-శివ భరద్వాజ్

  






6, సెప్టెంబర్ 2025, శనివారం

🔔 *అనగనగా...* 🔔

 🔔 *అనగనగా...* 🔔

ఒక సాధువు నడుస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంటి యజమాని ఆయన్ని ఆహ్వానించి, విశ్రాంతి తీసుకోమని కోరాడు. భోజనం పెట్టి, చీకటి పడిందని ఆ రాత్రి తన ఇంట్లోనే ఉండమన్నాడు.

మాటల్లో యజమాని అన్నాడు:
👉 “సంసారంలో సుఖం లేదండీ! మీ జీవితం ఎంత హాయిగా ఉంది!”
అందుకు సాధువు ప్రశాంతంగా:
👉 “అయితే నా వెంట రా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను.”
యజమాని తడబడుతూ:
👉 “అలా ఎలా సాధ్యం స్వామీ? పిల్లలు చిన్నవాళ్లు… వాళ్లను పెంచాలి కదా!” అన్నాడు.

⏳ సంవత్సరాలు గడిచాయి…
సాధువు మళ్లీ వచ్చాడు. యజమాని పిల్లలు పెద్దవాళ్లయ్యారు.
సాధువు: “ఇప్పుడైనా నా వెంట రా!”
యజమాని: “ఇంకా లేదు స్వామీ… పిల్లలు స్థిరపడాలి, పెళ్లిళ్లు చేయాలి.”

మరిన్ని సంవత్సరాలు గడిచాయి.
సాధువు మళ్లీ వచ్చాడు. యజమాని ఈ సారి కొంచెం విసుగ్గా:
👉 “పిల్లలకు డబ్బు విలువ తెలియదు. నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను. ఇల్లు కట్టాలి… మీలాగా నాకు ఎలా కుదురుతుంది?” అన్నాడు.

🌑 మరికొన్ని సంవత్సరాలు గడిచాయి.
సాధువు మళ్లీ ఆ మార్గం గుండా వెళ్తుంటే యజమాని కనబడలేదు. అతని కొడుకు చెప్పాడు:
👉 “నాన్నగారు మరణించారు.”

సాధువు బయటికి వచ్చి చెట్టు కింద చూసాడు. అక్కడ ఒక కుక్క కూర్చుంది.
మంత్రజలం జల్లి అన్నాడు:
👉 “ఏమిటి నీ మోహం? కుక్కగా పుట్టి కూడా ఇంటిని కాపలా కాస్తున్నావా? నా వెంట రా, మోక్షం చూపిస్తాను.”
కుక్క (యజమాని ఆత్మ):
👉 “అలా చేయలేను… నేను దాచిన సొమ్ము పిల్లలకు చెప్పలేదు. అది ఎవరూ దోచుకోకుండా చూడాలి.”

కొన్నాళ్లకు ఆ కుక్క కనిపించలేదు. చెట్టు కింద ఇప్పుడు ఒక పాము.
సాధువు మంత్రజలం చల్లగా అది మాట్లాడింది:
👉 “నా సొమ్ము పిల్లలకే దక్కాలి, వేరెవరికి దక్కకూడదు. అందుకే ఇక్కడే ఉంటున్నాను.”

సాధువు ఇంట్లోకి వెళ్లి పిల్లలతో అన్నాడు:
👉 “మీ నాన్న ఆ చెట్టు కింద ధనం దాచాడు. కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది.”

వెంటనే వారు కర్రలు పట్టుకొని అక్కడికి పరుగెత్తారు.
తన సొంత పిల్లలే తనను కర్రలతో కొడుతుంటే ఆ ఆత్మ సాధువును చూసి హాయిగా మొఱ్ఱ పెట్టింది… కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది.

🌸✨ నీతి ✨🌸

👉 గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు.
👉 కానీ మోహబంధాలు మరీ గట్టిగా కట్టేసుకుంటే అది ఇహపరముల రెండింటికీ అడ్డుపడుతుంది.
👉 సంపద, పిల్లలు, ఇల్లు – ఇవి అవసరం. కానీ పరమగమ్యం మరువకూడదు. 

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు, విదేశీ శక్తులకు తలవొంచి నిలబడకు.  "స్వదేశీ" నీ దేశపు సరుకులుండ ఇంకొకటి కొనబోకు  విదేశీ వస్తువు...