విజయదశమి ఉత్సవాన విజయగీతి పాడుదాం
జయ భారతమాతంటు పుడమి పులకరించగా "2" "విజయదశమి"
ప్రతిఒక్కరు సైనికులై కదం కదం కలుపుదాం
గణవేషధారణతో ఘనశక్తిని చూపుదాం
హిందూధర్మమంటే మతభావన కాదని,
హిందుదేశ పౌరుల ఐక్యతా చిహ్నమని "2" "విజయదశమి"
స్వదేశీ సంస్కృతిని మరువబోము మేమంటూ
విదేశీ వికృతుల మోజులో పడమంటూ
స్వధర్మీయ స్వాభిమాన శంఖమును పూరిస్తూ,
విధర్మీయ శక్తులకు తలవంచక నిలబడుతూ "2" "విజయదశమి"
పరమ వైభవమును పొందగా సాగరా
నిత్యశాఖ గంగనందు తరియించగ రమ్మురా
ప్రపంచానికాదర్శం హిందు ధర్మ పథమురా
ఆ పథమున పయనించి ధర్మరక్ష చేయరా "2" "విజయదశమి"
- శివ భరద్వాజ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి