27, ఆగస్టు 2025, బుధవారం

వినాయక చవితి శుభాకాంక్షలు

ఆకృతినీయ చెరువుల మట్టితో,
అలంకరింపఁగ ఓషధీ పత్రితో,
పూజఁచేయ గృహపుష్పాలతో,
నివేదింప ముదిత మోదకములతో.

నిమజ్జింపగ విగ్రహం నీటితో,
గ్రహించుడు తత్వం  బుద్ధితో,
వినాయక పూజ ప్రకృతి పూజయని,
తెలుసుకొనుడు హృదిన భక్తితో.

గణపతిపూజ గర్వ ప్రదర్శన కాదు,
సిద్ధి దాయిని బుద్ధి ప్రబోధమది,
విగ్రహం క్షణికమై, మట్టియై నీటిని లీనమగున్,
తత్వం శాశ్వతమై మనసున నిలుచున్.

వినాయకుని తత్వము తెలిసిన,
నిలుచును విజయం నీ పథమున,
సనాతన ధర్మపథ దర్శనమిది,
భక్తితో జ్ఞానప్రకాశ పాఠమిది.

— శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...