26, జూన్ 2025, గురువారం

హిందు వీర లేవరా, కదం కదం కలపరా

 హిందు వీర లేవరా, కదం కదం కలపరా
ఈ దేశము జగద్గురువు చేయగా, కదలిరా
హిందు వీర లేవరా, కదం తొక్కి కదలిరా
నీ దేశము విశ్వగురువు చేయగా, తరలిరా

ధర్మ భూమి, కర్మభూమి, యజ్ఞ భూమి, యశో భూమి
వేదాలు ప్రభవించిన, జ్ఞాన భూమి మనదిరా!!
శ్రీరాముడు నడయాడిన, శ్రీ కృష్ణుడు తిరుగాడిన
దేవతలే దిగివచ్చెడి పుణ్యభూమి మనదిరా!!

లోకమంతా ఒక్కటను, కుటుంబముగ భావించి,
సర్వజనుల సుఖము కోరు, స్వర్గ భూమి మనదిరా,
ఆ బుద్ధుని బోధలతో, మహావీరుని త్యాగముతో,
శాంతిని భోదించిన, ధన్య భూమి మనదిరా!

ఎంతమంది దోచిన, ఎన్నిసార్లు చీల్చిన,
సహనమునే చూపిన, త్యాగ భూమి మనదిరా,
ధీరులైన కుమార్తెలు, వీరులైన కుమారుల
త్యాగముతో నిలిచిన, వీర భూమి మనదిరా!

ఒక్కొక్కరు కదిలివచ్చి, మీ గొంతుక వినిపించి,
మీ బలమును చూపించి, మీ శౌర్యము ప్రకటించి,
వేదధర్మ స్థాపనతో, విజ్ఞానపు వెలుగు పంచి,
విశ్వగురువు భారతని, ఎలుగెత్తి చాటరా!

గానం: ఆరిందం కుమార్ గురూజీ
రచన: శివ భరద్వాజ్

17, జూన్ 2025, మంగళవారం

*🌹హనుమాన్ సర్వస్వం🌹*

 *🌹హనుమాన్ సర్వస్వం🌹*

*పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం  ప్రశ్నలు జవాబులు.* 

🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?
జవాబు : అంజనా దేవి !
🚩2) హనుమంతుని తండ్రి పేరు?
జవాబు : కేసరి !
🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : కశ్యపుడు !
🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : సాధ్య !
🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది?
జవాబు : వైశాఖ బహుళ దశమి!

🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది?
జవాబు : తిరుమల  - అంజనాద్రి.
🚩7) హనుమంతుని నక్షత్రము ?
జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.
🚩8) హనుమంతుని జనన లగ్నం  ?
జవాబు : కర్కాటక.
🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?
జవాబు : వైదృవీయోగం లో 
🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?
జవాబు : ఈశ్వరాంశ 

🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?
జవాబు : వాయుదేవుని వరం వలన.
🚩12)హనుమ జనన కారకులు ?
జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు.
🚩13) హనుమంతుని గురువు ?
 జవాబు : సూర్య భగవానుడు.
🚩14) హనుమంతుని శపించిన వారు ?
 జవాబు : భృగుశిష్యులు.
🚩15) హనుమంతునికి గల శాపం ?
 జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం.

🚩16) హనుమంతుని శాప పరిహారం ?
 జవాబు : స్తుతించినా,
నిందించినా తన శక్తి తను గ్రహించుట.
🚩17) హనుమంతుని బార్య ?
 జవాబు : సువర్చలా దేవి.

🚩18) సువర్చాలా దేవి మాతామహుడు ?
జవాబు : విశ్వకర్మ.

🚩19) హనుమంతుని మాతామహుడు ?
 జవాబు : కుంజరుడు.

🚩20)సువర్చల తల్లి పేరు ?
 జవాబు : సంజాదేవి, ఛాయాదేవి.

🚩21) హనుమంతుని బావమరుదులు ?
 జ : అశ్వనీ దేవతలు, శని,యముడు.

🚩22) హనుమంతుని వివాహ తేదీ ?
 జ : జేష్ఠ శుద్ధ దశమి.

🚩23) హనుమంతుని తాత, అమ్మమ్మ ?
 జ : గౌతముడు , అహల్య.

🚩24) హనుమంతుని మేన మామలు ?
 జ : శతానందుడు, వాలి, సుగ్రీవులు.

🚩25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ?
 జ : సుగ్రీవుని మంత్రి.

🚩26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ?
 జ : ఋష్యమూక పర్వతం.

🚩27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ?
 జ : భిక్షుక రూపం.

🚩28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ?
 జ : పంపానదీ తీరం .

🚩29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ?
 జ : శ్రీరాముడు.

🚩30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ?
 జ : శ్రీరామ సుగ్రీవులకు.

🚩31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం?
జ : తల్లి అజ్ఞ.

🚩32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ?
 జ : చందన వృక్ష శాఖ.

🚩33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ?
 జ : శ్రీ పరాశర సంహిత.

🚩34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ?
 జ : తార, రమ.

🚩35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ?
 జ : పుష్యమి నక్షత్రం గల రోజు.

🚩36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.?
 జ : దక్షిణ దిక్కు.

🚩37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ?
 జ : ఆశ్లేష నక్షత్రం.

🚩38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ?
 జ : స్వయంప్రభది.

🚩39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ?
 జ : సంపాతి.

🚩40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ?
 జ : మహేంద్ర పర్వతం.

🚩41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ?
 జ : 100 యోజనాలు.

🚩42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ?
 జ : మైనాకుడు.

🚩43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ?
 జ : సముద్రుడు.

🚩44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు?
 జ : రొమ్ము తో తాకాడు.

🚩45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.?
 జ : చేతితో స్పృశించి.

🚩46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ?
 జ : సురస.

🚩47) సురస ఏ జాతి స్త్రీ ?
 జ : నాగజాతి.

🚩48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.?
 జ : ఉపాయంతో.

🚩49) సురసను పంపిన దెవరు ?
 జ : దేవతలు.

🚩50) సురసను దేవతలు ఎందుకు పంపారు ?
 జ : హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు .

🚩51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ?
 జ : సింహిక.

🚩52) సింహిక హనుమంతుని ఎం చేసింది ?
 జ : నీడ పట్టి లాగింది.

🚩53) సింహిక వృత్తి ఎమిటి ?
 జ : లంకను కాపాడడం.

🚩54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ?
 జ : శ్రీ పరాశర మహర్షి చే.

🚩55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.?
జ : సువేల పర్వత ప్రాంతం లో.

🚩56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ?
 జ : త్రికూటాచలం.

🚩57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ?
 జ : సూర్యాస్తమయం కోసం.

🚩58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు?
 జ : పిల్లి పిల్ల అంత వాడు అయ్యి.

🚩59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ?
 జ :లంకిణి

🚩60)  లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ?
 జ : ఎడమ చేతి పిడికిలి తో.

🚩61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ?
 జ : ప్రాకారం దూకి.

🚩62) శతృపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఎమిటి ?
 జ : ఎడమ కాలు ముందు పెట్టీ పోవడం.

🚩63) ఎవరిని చూసి హనుమంతుడు సీతగా బ్రమించాడు ?
 జ : మండోదరిని.
🚩64)హనుమంతుడు ప్రవేశించిన వనం ?
 జ : అశోక వనం.

🚩65) అశోక వనం ఏ పర్వతం పైన ఉన్నది ?
 జ : సుందర పర్వతం.

🚩66)లంకా నగరం ఏ పర్వతం పై ఉన్నది ?
 జ : నీల పర్వతం.

🚩67)శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షి చే ఎవరికి చెప్పబడింది ?
 జ : మైత్రేయ మహర్షి కి.

🚩68)హనుమంతుడు అందించిన అద్భుత సందేశం ?
 జ : జీవనృద్రాణిపశ్యతి. -(బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు)

🚩69) సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు ?
 జ : శింశుపా వృక్షము.

🚩70) సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు ?
 జ : రాముడి ఉంగరం.

🚩71) హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమి ఇచ్చింది ?
 జ : చూడామణీ.

🚩72)హనుమంతుడు అశోక వనం ద్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు ?
 జ : జంబుమాలిని.

🚩73) హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు ?
 జ : అక్షయ కుమారుడు.

🚩74)హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ?
 జ : ఇంద్రజిత్తు నకు.

🚩75) హనుమంతుని రావణ దర్భారు లో ఎవరు ప్రశ్నించారు. ?
 జ : ప్రహస్తుడు .

🚩76) సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం ?
 జ : అరిష్ట పర్వతం.

🚩77) సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ?
 జ : 30 ఘడియలు.

7, జూన్ 2025, శనివారం

హిందూ ధర్మం - జ్ఞానం

 కులముతో పనిలేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. 
(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 
~~~~
1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.
2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.
3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..
4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.
5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 
6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.
7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 
వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 
8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.
9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.
ఇంకా 
1.ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
2.ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)
3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.
ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు
1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.
2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..
3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 
4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.
5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.
6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)
7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 
8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).
9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).
10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.
మీరు షేర్ చేసే ప్రతి సందేశం తో పాటు ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*
తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి
ఇదే మన సనాతన ధర్మం యెుక్క గొప్పతనం.

శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
.🕉

4, జూన్ 2025, బుధవారం

నీ ధ్యేయ నిష్ఠేరా - ఈ జాతికి రక్షణ

 
నీ ధ్యేయ నిష్ఠేరా, ఈ జాతికి రక్షణ,
నిదురపోక నిలబడరా శ్రీ రామ రక్షగా.

దండాయుధపాణియై, సంఘటనము చేయరా,
నిత్య శాఖలోన నువ్వు సాధననే చేయరా,
గడ్డిపోచలన్నిగూడి గజమును బంధించురా,
అసాధ్యమేది కాదురా, కలిసిమెలిసి ఉండరా

చుట్టు ఉన్న పరిస్థితికి, కలత చెందబోకురా
సంయమనము పాటించి, ముందు నువ్వు నడవరా
భయమును ఓడించినా విజయమ్మే నీదిరా,
ఛత్రపతి ఆదర్శము, ధీరుడవై నిలవరా,

పంచ పరివర్తన నీ జాతిలో తెమ్మురా,
అహరహము శ్రమియించి ఆ కార్యము చేయరా,
హిందు సమ్మేళనము, మన లక్ష్యము సోదరా,
సధ్భావన కలిగించి, సంఘటనము చేయరా 

-శివ భరద్వాజ్

హిందు వీర లేవరా, కదం కదం కలపరా

 హిందు వీర లేవరా, కదం కదం కలపరా ఈ దేశము జగద్గురువు చేయగా, కదలిరా హిందు వీర లేవరా, కదం తొక్కి కదలిరా నీ దేశము విశ్వగురువు చేయగా, తరలిరా ధర్మ ...