26, జూన్ 2025, గురువారం

హిందు వీర లేవరా, కదం కదం కలపరా

 హిందు వీర లేవరా, కదం కదం కలపరా
ఈ దేశము జగద్గురువు చేయగా, కదలిరా
హిందు వీర లేవరా, కదం తొక్కి కదలిరా
నీ దేశము విశ్వగురువు చేయగా, తరలిరా

ధర్మ భూమి, కర్మభూమి, యజ్ఞ భూమి, యశో భూమి
వేదాలు ప్రభవించిన, జ్ఞాన భూమి మనదిరా!!
శ్రీరాముడు నడయాడిన, శ్రీ కృష్ణుడు తిరుగాడిన
దేవతలే దిగివచ్చెడి పుణ్యభూమి మనదిరా!!

లోకమంతా ఒక్కటను, కుటుంబముగ భావించి,
సర్వజనుల సుఖము కోరు, స్వర్గ భూమి మనదిరా,
ఆ బుద్ధుని బోధలతో, మహావీరుని త్యాగముతో,
శాంతిని భోదించిన, ధన్య భూమి మనదిరా!

ఎంతమంది దోచిన, ఎన్నిసార్లు చీల్చిన,
సహనమునే చూపిన, త్యాగ భూమి మనదిరా,
ధీరులైన కుమార్తెలు, వీరులైన కుమారుల
త్యాగముతో నిలిచిన, వీర భూమి మనదిరా!

ఒక్కొక్కరు కదిలివచ్చి, మీ గొంతుక వినిపించి,
మీ బలమును చూపించి, మీ శౌర్యము ప్రకటించి,
వేదధర్మ స్థాపనతో, విజ్ఞానపు వెలుగు పంచి,
విశ్వగురువు భారతని, ఎలుగెత్తి చాటరా!

గానం: ఆరిందం కుమార్ గురూజీ
రచన: శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...