28, ఏప్రిల్ 2025, సోమవారం

భరత జాతి ప్రతిన బూనింది.

కాళ్ళ పారాణి ఆరని సోదరి,
నుదిటి కుంకుమ చెదిరింది.
ప్రకృతి అందాలకు మైమరచి,
సేదతీరుతున్న గుండె ఆగింది.
సంద్రమున అలసి నేలకు వచ్చిన,
నావికుని ప్రాణం నింగి కెగసింది.
నింగిన ఎగిరి, నేల విహరించ దిగిన
వాయుసైనికుని జీవం గాలిలో కలిసింది.
జీవిత చరమాంకన ప్రకృతి ఒడిన,
ప్రశాంతత వెదికిన కన్ను మూత బడింది.
కుంకుమ పువ్వు పండే భువిన,
నెత్తుటి కుంకుమ కళ్ళాపి జల్లింది.
ఉగ్రవాద మతమౌఢ్య పిశాచి,
విచక్షణ లేక  కరాళ నృత్యం చేసింది.

అన్ని గీతలు దాటిన దాయాదిని
ఉపేక్షింపబోమని, నేలకొరిగిన సహోదరుల
సాక్షిగా, భరత జాతి ప్రతిన బూనింది.

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...