ఓ భగవంతుడా!
ఆదిశంకర పరంపరాగతమైన పీఠ జగద్గురువుల యందు ఎటువంటి ద్వేషము లేకుండా గౌరవించే
సద్బుద్ధిని మాకు ప్రసాదించు.
త్రిమతస్థులు ( స్మార్త, వైష్ణవ, మాధ్వ ) ఎవరి సంప్రదాయాన్ని వారు శ్రద్ధతో ఆచరిస్తూ ఇతరులను ద్వేషించకుండా పరస్పరము గౌరవము కలిగే సద్బుద్ధిని మాకు ప్రసాదించు.
ప్రపంచంలో ఉన్న అన్ని మతాలను అనుసరించేవారు వారి వారి ధర్మాలను ఆచరిస్తూ హింసను విడనాడి పరస్పర గౌరవంతో ఉండే సద్బుద్ధిని ప్రసాదించు.
"ఏకో దేవః సర్వభూతేషు గూడః
సర్వ వ్యాపీ సర్వభూతాంతరాత్మా"
శ్వేతాశ్వతర ఉపనిషత్
అయం నిజః పరోవేతి గణనా లఘు చేతసామ్ l
ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకమ్ ll
స్మృతి వాక్యమ్
సనాతన ధర్మాభిలాషీ 🙏🙏🙏
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
29, ఏప్రిల్ 2025, మంగళవారం
ఏకో దేవః - భగవంతుడొక్కడే
28, ఏప్రిల్ 2025, సోమవారం
భరత జాతి ప్రతిన బూనింది.
కాళ్ళ పారాణి ఆరని సోదరి,
నుదిటి కుంకుమ చెదిరింది.
ప్రకృతి అందాలకు మైమరచి,
సేదతీరుతున్న గుండె ఆగింది.
సంద్రమున అలసి నేలకు వచ్చిన,
నావికుని ప్రాణం నింగి కెగసింది.
నింగిన ఎగిరి, నేల విహరించ దిగిన
వాయుసైనికుని జీవం గాలిలో కలిసింది.
జీవిత చరమాంకన ప్రకృతి ఒడిన,
ప్రశాంతత వెదికిన కన్ను మూత బడింది.
కుంకుమ పువ్వు పండే భువిన,
నెత్తుటి కుంకుమ కళ్ళాపి జల్లింది.
ఉగ్రవాద మతమౌఢ్య పిశాచి,
విచక్షణ లేక కరాళ నృత్యం చేసింది.
అన్ని గీతలు దాటిన దాయాదిని
ఉపేక్షింపబోమని, నేలకొరిగిన సహోదరుల
సాక్షిగా, భరత జాతి ప్రతిన బూనింది.
-శివ భరద్వాజ్
25, ఏప్రిల్ 2025, శుక్రవారం
రోగ లక్షణాలకు వైద్యం చేస్తే రోగం నయం కాదు.
రోగ కారణానికి కాకుండా ,
రోగ లక్షణాలకు వైద్యం చేస్తే రోగం నయం కాదు.
- శివ భరద్వాజ్
మనం శారీరకంగా కాదు, మానసికంగా లేదా ఆత్మీయంగా ఎదుర్కొనే సమస్యలకూ అదే వర్తిస్తుంది.
ఈ వాక్యం ప్రధానంగా చెప్పే విషయమేమిటంటే —
లక్షణాలను తాత్కాలికంగా అదుపు చేయడమే కాకుండా, ఆ లక్షణాలకు మూలంగా ఉన్న కారణాన్ని గుర్తించి, దాన్ని మూలం నుండి చికిత్స చేయాలి. లేదంటే అది తిరిగి వస్తూనే ఉంటుంది.
ఇది వైద్యంలోనే కాక, జీవన శైలిలో, సమస్యల పరిష్కారంలో, అంతర్గత వ్యక్తిత్వ వికాసంలో కూడా వర్తిస్తుంది.
విజయ కమల వికాసం
మనుసులో ఆశల అలలు ఎగిసిపడుతుంటే, ఊహలు కొండదాటిపోతున్నాయి. మదిలో కోరికలు సుడులు తిరుగుతుంటే, కళ్ళు ఓటమి భయంతో బెదురుతున్నాయి. చేయగలనన్న ధీ...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
కరోనా సంతోషం కలిగించింది జనాలను నిలువు దోపిడి చేస్తున్న వైద్యాలయాలకు టీకాల తో వ్యాపారం చేస్తున్న మందుల కంపెనీ లకు మందులను బ్లాక్ మార్కెట్ చ...