Enlightenment Story
🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂
పేదరరికంలో ఉన్న తల్లి గర్భాన పుట్టిన థామస్ ఆల్వా ఏడిసన్ గురించి చదివిన చాలా, చాలా విశేషాల్లో ఇది ఒకటి.
ఒక రోజు థామస్ ఎడిసన్ తన క్లాస్ టీచర్ నుండి ఒక ఉత్తరాన్ని తీసుకుని క్లాసు మధ్యలోనే ఇంటికి వచ్చాడు. తన క్లాసు టీచర్ తన తల్లికి ఇమ్మన్న ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. దీనిని నా టీచర్ నీకు మాత్రమే ఇమ్మన్నారు, ఇంకెవరికీ ఇవ్వవద్దని మరీ మరీ చెప్పారు అని కూడా చెప్పాడు.
ఆమె ఆ ఉత్తరాన్ని లోలోపల చదువుకుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.ఆమె కన్నీటిపర్యంతమయ్యింది. ఆత్రుత పడిన ఎడిసన్ అమ్మా అందులో ఏం రాసుంది? అని ఉత్సుకతగా అడిగాడు. నా గురించి ఏమైనా ఆరోపణగా అందులో రాయబడి ఉందా? అని కూడా అడిగాడు. అయితే, ఆ పేద తల్లి ఏమీ లేదు నాయనా! గట్టిగా చదువుతాను నువ్వూ విను అని ఇలా ఆ లేఖను పైకి గట్టిగా చదివింది.
"అమ్మా మీ బిడ్డ మేధావి. ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగిన మంచి ఉపాధ్యాయులు ఇక్కడ లేరు. దయచేసి అతనికి మీరే చదువు నేర్పండి."
ఇది విని ఎడిసన్ ముఖం బల్బులా వెలిగిపోయింది. ఆనందపడ్డాడు. ఆ తరువాత చాలాకాలం గడిసింది. ఎడిసన్ తల్లి మరణించింది. ఎడిసన్ చాలా సంవత్సరాల తరువాత, ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొని ఈ శతాబ్దపు గొప్ప శాస్త్రీయ ఆవిష్కర్తలలో ఒకడు అయ్యాడు.
ఒక రోజు, అతను పాత ఇంటి సామానులన్నింటినీ సర్దిస్తూ, అతని తల్లికి సంబందించిన టేబుల్ సొరుగు మూలలో చిన్నప్పుడు తన గురువు ఇచ్చిన కవరులో పెట్టిన ఉత్తరాన్ని కనుగొన్నాడు. అతను ఆనాటి సంఘటన గుర్తు చేసుకుని ఆ ఉత్తరాన్ని చదివాడు. అందులో ఇలా వ్రాయబడి ఉంది.
అమ్మా! మీ కొడుకు మానసిక అనారోగ్యంతో చాలా బలహీనంగా ఉన్నాడు. ఇతను దేనినైనా చాలా నెమ్మదిగా అర్ధం చేసుకొంటున్నాడు. మీరు బడికి పంపించి మిగతా పిల్లలతో సరి సమానంగా నేర్పించాలనుకోవడం సమయం వృధా తప్ప వేరొకటి కాదు. ఇలాంటి అనారోగ్యపు పిల్లలు జీవితంలో ఎప్పటికీ ఏ విజయాన్నీ సాధించలేరు. అందుచేత మేము మీ కుమారుడిని ఇకపై మా పాఠశాలకు అనుమతించలేము
ఆ ఉత్తరాన్ని చదివిన ఎడిసన్ కొంత సేపు గుండెను బాదుకుంటూ అరిచాడు, ఏడ్చాడు. రోధనతో విలవిల్లాడాడు. తరువాత తేరుకుని ఈ విషయాన్ని తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. "థామస్ ఆల్వా ఎడిసన్ మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ పిల్లవాడు, గొప్ప హీరోలాంటి తల్లి చేత శతాబ్దపు గొప్ప మేధావి అయ్యాడు"
ఎడిసన్ తల్లిని నమ్మాడు. తల్లి మాటలను ఎంతగానో నమ్మాడు, అందుకే అతడు గొప్ప మేధావి అయ్యాడు 🙏
🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂
🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
16, సెప్టెంబర్ 2024, సోమవారం
మీ బిడ్డ మేధావి - ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
🔱 అంతర్యామి 🔱
శ్రీ రామ జయ రామ జయజయ రామ: 🔱 అంతర్యామి 🔱 # బుద్ధి సూక్ష్మత... 🍁సబ్బునీటితో బుడగ సృష్టించి సంబరపడటం చిన్నతనం. మనిషి జీవితం నీటి బుడగన్నది ...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
తాతలు తాగెను పారేటి నదులందు నీరు నాన్నలు తాగెను ఊరి బావులందు నీరు మనము తాగెను చేతి పంపులందు నీరు పిల్లలిప్పుడు తాగెను ప్లాస్టిక్ బాటిలందు నీ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి