17, సెప్టెంబర్ 2024, మంగళవారం

అమ్మలఁ గన్నయమ్మ

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

 

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

భారతీయ మహిళ ఔన్నత్యం

 నిజంగా లోతైన ఆలోచన కలిగించే వ్యాసం👇 🌼 మహిళల తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రయత్నించారా? 🌼  మనం తరచుగా తెలివి...