🔱 అంతర్యామి 🔱
# మనోమౌనం #
🍁మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది, అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. మాట్లాడకుండా కూడా చాలా పనులు చక్కబెట్టవచ్చు. భావాన్ని వ్యక్తం చేయనూ వచ్చు. అలాచేస్తే మాట్లాడటానికి ఖర్చయ్యే శక్తి ఆదా అవుతుంది. పైగా అనవసర వివాదాలకు ఆస్కారం ఉండదు. నిజానికి కొన్ని సమయాల్లో మాట్లాడటంకన్నా మౌనం వహించడం మరీ మంచిది. దానికెంతో ఓర్పు, నేర్పు, నిగ్రహశక్తి, సంయమనం కావాలి.
🍁అనవసర పదజాలాన్ని, మాటలను నియంత్రించి పరిపూర్ణత కలిగిన ఆలోచనా విధానానికి తొలి మెట్టు మౌనం. దీన్ని వహించడం వల్ల సాత్వికత ఏర్పడుతుంది. సాత్వికత మంచిచెడుల విచక్షణను తెలియజేస్తుంది.
🍁మౌనం రెండు రకాలు. అవి వాక్ మౌనం (మాట్లాడకుండా మౌనంగా ఉండటం), మనోమౌనం(ధ్యానం) అని గీతాచార్యులు వివరించారు. ఒక్కొక్కసారి ఎదుటివారి కాఠిన్యపు మాటలుగాని, ఆధారరహిత ఆరోపణలను కానీ ఖండించవలసిన అవసరం ఏర్పడుతుంది. కానీ వాటిని వారు వినే స్థితి లో ఉండరు. అలాంటి సమయంలో మాట్లాడకుండా ఊరు కోవడమే ఉత్తమం. అదీకాక మనం చెప్పే మాటలకు విలువ, ఆచరణ లేనప్పుడు సైతం మాట్లాడకుండా ఉండటం మేలు. దీన్నే వాకామౌనం అంటారు. ఇంద్రియాలు మనసును విషయాదుల వైపు లాగుతాయి. వాటి వైపు మనసు మరలకుండా జాగ్రత్తలు తీసుకోవడం మనోమౌనం.
🍁ధ్యానం చేయడంలో మౌనం ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది ఆత్మశక్తిని పెంచుతుంది. పరిణతి చెందిన మనస్తత్వానికి, ఆలోచనా పరిధికి మౌనం నిదర్శనం. గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుంది. కాబట్టి మౌనం వహించడం చేతగానితనం మాత్రం కాదు. మౌనం అర్ధాంగీకారం అనే నానుడి ఉంది. అంటే మౌనంగా ఉంటే సగం అంగీకరించినట్లే అని. కానీ అలా ఉండటం అంగీకారం కాదు. ఆలోచన, విశ్లేషణ కారణకారణాల సమతుల్యతను బేరీజు వేసుకునే సంధిసమయం మాత్రమే.
🍁మౌనం మానసిక తపస్సు అంటే మానసిక మౌనమే విలక్షణమని గ్రహించాలి. అయితే మనోమౌనం కోసం ప్రయత్నించకుండా వాక్ మౌనం మాత్రమే కలిగి ఉంటే... మనసు అనేక సంకల్పాలతో కూడిఉండి. చంచలమవుతుంది. అంటే ఆ మౌనం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.
🍁మౌనాన్ని అభ్యసించాలి. దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లుంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, సందిగ్ధావస్థలో పడినప్పుడు, విరుద్ధ విషయాలను చర్చిస్తున్నప్పుడు, మౌనం శక్తిమంతమైన ఆయుధమై గట్టున పడేస్తుంది. ప్రశాంతమైన పరిసరాలు మౌన ధారణకు తోడ్పడతాయి. ధ్యానాది విషయాల్లో ఏకాగ్రతను కలిగించే ఇంధనం మౌనం. అయితే అవసర సమయాల్లో మౌనం వహిస్తే అగచాట్లు తప్పవు. అశక్తతను, చేతగానితనాన్ని తెలియజేస్తుంది. మౌనం దివ్యాయుధం. సందర్భోచితంగా ప్రయోగించినప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుంది.
🍁మౌనం పాటించినప్పుడు ఆ వ్యక్తి సులభంగా మానసిక స్థైర్యాన్ని పొందగలడని గుర్తిస్తాం. భోజనం చేసినప్పుడు మౌనంగా భుజించడ0 అవసరం. జాతిపిత మహాత్మాగాంధీ వారాని ఒకరోజు మౌనం పాటించేవారట. కొంతమంది ఇప్పటికీ వారానికి ఒకరోజు ఆనవాయితీగా మౌనవ్రతం పాటిస్తుంటారు.🙏
✍️- వి. ఎస్. రాజమౌళి
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
16, జులై 2024, మంగళవారం
అంతర్యామి - మనోమౌనం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!
డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే! డబ్బు చేసిన మనిషి, జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే! పడవ పయనం సాగాలంటే, నీటి అవసరం నిజమే! పడవలోకి నీరు పయనిస్...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
తాతలు తాగెను పారేటి నదులందు నీరు నాన్నలు తాగెను ఊరి బావులందు నీరు మనము తాగెను చేతి పంపులందు నీరు పిల్లలిప్పుడు తాగెను ప్లాస్టిక్ బాటిలందు నీ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి