🔱 అంతర్యామి 🔱
# హారతి #
🍁శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. హారతిని ఆర్తితో స్వామికి అర్పిస్తాం.. తరచుగా అన్ని విధాలైన శుభకార్యాల్లో హారతినందిస్తాం. హారతి ఇస్తున్నప్పుడు ” మంత్రోచ్చారణ, మంగళవాద్యాలు, గంటానాదం, సంకీర్తనలు, శంఖం పూరించడం- ఇలాంటివన్నీ ఆయా దేవాలయాల్లోని ఆచారాలు, సంప్ర దాయాలను బట్టి అనుసరిస్తారు.
🍁హారతిని వలయాకారంలో గడి యారంలోని ముళ్ల దిశగా భగవంతుడి విగ్రహం ముందు తిప్పుతారు. ఆ జ్యోతి నుంచి ఉత్పన్నమయ్యే సాత్విక తరంగాలు వలయాకారంగా పరిభ్రమిస్తాయి. ఈ తరంగాల కవచం భక్తుల భక్తి భావనను ఉద్దీప్తం చేస్తుంది. ఆత్మ సమర్పణ భావానికి హారతి ప్రముఖమైన ఆలంబనం. ఏకాగ్రతకు, తాదాత్మ్యతకు హారతి స్పూర్తి అవుతుంది. హారతి భక్తుడిలో దాగి ఉన్న అహంకారాన్ని కరిగే కర్పూరంలా హరిస్తుంది. హారతిని స్వామివారి వదనానికి రెండు అరచేతులతో చూపి, ఆ తరవాత భక్తులందరూ శ్రద్ధాభక్తులతో కళ్లకద్దుకుంటారు.
🍁వ్రతాలు, నోములు, ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాదులు, వ్రతాలు, పుష్కరాలు, పర్వదినాలు, ఆయుధపూజలు, గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు... ఇలా అనేక సందర్భాల్లో హారతిని ఇస్తారు.
🍁ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం- మూడు పూటలా కొన్ని దేవాలయాల్లో హారతి ఇస్తారు. కాకడారతి, పూజారతి, ముఖ్యారతి, ధూపారతి, తేజారతి- ఇలా పలు పేర్లతో వీటిని పిలుస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మహాహార ఇస్తారు.
🍁హారతికి తరచుగా కర్పూరాన్నే వినియోగిస్తారు. కొన్ని హారతులను వత్తులతో వెలిగిస్తారు. అందుకు నేతినే ఉపయోగిస్తారు. క్షత్రియవీరులు రణరంగానికి బయలుదేరేముందు, తిరిగి విజేతలై వచ్చాక హారతినిస్తారు. నూతన దంపతులకు ఇచ్చే హారతి మంగళహారతి. పుట్టినరోజుల సందర్భాల్లో, సంక్రాంతి మొదలైన పర్వదినా. చిన్నారులకు హారతి పట్టి ఆశీస్సులిస్తారు.
🍁ఆశ్వయుజ పూర్ణిమనాడు జ్యేష్ఠాపత్య నీరాజనం, నరక చతుర్దశినాడు నారీకర్తుక నీరాజనం, బలిపాడ్యమినాడు, పతినీరాజనం, యమ విదియరోజున భ్రాతృ నీరాజనం వీటిని 'ఔక్షణ' నీరాజనం అంటారు. ఇంకా నేత్రహారతి, బిల్వహారతి, నందిహారతి, పంచహారతి, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, ధేనుహారతి, గజహారతి- ఇలా పలు సందర్భాలను బట్టి హారతులిస్తారు.
🍁దేహం ప్రమిదకు వత్తి వైరాగ్యానికి ప్రతీక.. జ్యోతి ఆత్మకు ప్రతీక. తైలం సాధనకు ప్రతీక. కాంతి జ్ఞానానికి ప్రతీక- ఇదే హారతికి గల అంతరార్థం, హారతికి నువ్వులనూనె, ఆవునెయ్యి, అవిశనూనె, కొబ్బరినూనె, అష్టమూలికా తైలం, ఆయా ప్రాంతాల ఆచారాలననుసరించి వినియోగిస్తారు. పాపపరిహారార్థం కొందరు ఆవనూనె, వేపను వాడతారు. హారతికి అయిదు నుంచి 365 వత్తుల వరకు వినియోగిస్తారు. పత్తిగింజల నుంచి తీసిన పత్తితో చేసిన వత్తులు మాత్రమే శ్రేష్ఠమైనవి. బూరుగు దూది నుంచి, చేనేత వస్త్రం ముక్కలతోను వత్తులు చేస్తారు.
🍁హారతి సమర్పణ చేసినవారికి, హారతి కాంతిని కళ్లకు అద్దుకున్నవారికి అనంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.🙏
✍️చిమ్మపూడి శ్రీరామమూర్తి
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
14, జులై 2024, ఆదివారం
అంతర్యామి - హారతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!
డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే! డబ్బు చేసిన మనిషి, జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే! పడవ పయనం సాగాలంటే, నీటి అవసరం నిజమే! పడవలోకి నీరు పయనిస్...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
తాతలు తాగెను పారేటి నదులందు నీరు నాన్నలు తాగెను ఊరి బావులందు నీరు మనము తాగెను చేతి పంపులందు నీరు పిల్లలిప్పుడు తాగెను ప్లాస్టిక్ బాటిలందు నీ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి