31, జులై 2024, బుధవారం

ఆదమరిచావా! అమ్మా అంతే సంగతులు

ఏ కంచె ఎప్పుడు ముల్లులా మారి గుచ్చుకుంటుందో,
ఏ బంధమెప్పుడు వరుస మారి బుగ్గిచేస్తుందో,
ఏ కన్ను ఏ వైపు నుండి ఎప్పుడు దాడి చేస్తుందో,
ఏ క్షణాన బతుకు ఆశలు కూలి చావు దరి చేరుతుందో,
ఆదమరిచావా! అమ్మా అంతే సంగతులు,
కాదని కదిలావా, కదల లేవు ఇక ఎన్నడూ,
తల్లిలా, చెల్లిలా, అక్కలా ఆరాధించలేని సమాజం,
నిన్ను ఒంటరిని చేసి కబళిస్తుంది.

ఓ యువతా, మారండి, సైనికులై కదలండి,
అన్నలా, తమ్ముడిలా అండగా నిలవండి.
లేవండి, తోడుగా మేమున్నామని చాటండి.
భారతీయులందరూ నా సహోదరులన్న
భావనా, భరోసా మీ సహోదరికి ఇవ్వండి.

-శివ భరద్వాజ్

🙏🌺హిందూ సాంప్రదాయంలో భోజన నియమాలు 🌺🙏

 🙏🌺హిందూ సాంప్రదాయంలో భోజన నియమాలు 🌺🙏

🌺1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. 🌺

🌺2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

🌺3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. అది చాలా పెద్ద దోషం.

🌺4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

🌺5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

🌺6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు.

🌺7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.

🌺8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.

🌺9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. బఫే పద్దతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం. దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు. పాదరక్షలు తో పొరపాటున కూడా భోజనం చేయవద్దు.

🌺10. భగవదార్పితం చేసి, భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి. 🌺

🌺11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

🌺12. పరిషేచనము అయ్యాక ఉప్పు వడ్డించు కోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించు కోవాలి.

🌺13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. (ఇది వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి వర్తించదు)

🌺14. మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. మన ఇంటి చాకలి వారికి పొరపాటున కూడా పెట్టకూడదు.

🌺15. భోజనం అయ్యాక క్షుర కర్మ చేసుకోరాదు (వెంట్రుకలు కత్తిరించడం).

🌺16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టరాదు. వారికి మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.

🌺17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తి బేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.

🌺18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

🌺19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.

🌺20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం. 🌺

🌺21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ముఖ్యముగా అయ్యప్ప దీక్షల వద్ద ఈ చెడు అలవాటు ఇటీవల కాలములో మితి మీరుచున్నది. అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు.

🌺22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం తింటూ మధ్యలో) వేదం చదువరాదు.

🌺23. పళ్ళెం మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

🌺24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

🌺25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

🌺26. అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవ కూడదు. తిన్న విస్తరిని మడవడం అనాచారం. తన ఇంటిలో ఒక్కడే ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

🌺27. ఎంగిలి విస్తరాకులను తీసే వాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.

🌺28. భోజనం అయ్యాక రెండు చేతులూ, కాళ్ళూ కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కిలించు కోవాలి.

🌺29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి (మెతుకులు తీసేసి, తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.

🌺30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము. పెద్దలు, సదాచార పరాయణులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయక పోవడానికి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు. పాచి ముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసినా దోషం. అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

🌺31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది.

🌺32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు. 🌺

🌺మన ఆంధ్ర రాష్ట్రము అన్నపూర్ణ గా కీర్తించ బడటానికి మన పూర్వీకులు పాటించిన పై సూత్రాలే ప్రధాన కారణం. 🌺

శయన నియమాలు

శయన నియమాలు

పడుకునేందుకు పాటించవలసిన 15 సూత్రాలు:-

1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో, ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.( మనుస్మృతి)
2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగానిద్ర లేపకూడదు ( విష్ణుస్మృతి)
3. విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలప వచ్చును.( *చాణక్య నీతి)
4. ఆరోగ్యవంతులు ఆయు రక్ష కోసం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలి (దేవీ భాగవతము). పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు (పద్మ పురాణము)
5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది. (అత్రి స్మృతి) విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం. (మహాభారతం)
6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు. (గౌతమ ధర్మ సూత్రం)
7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది. (ఆచార మయూఖ్)
8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో  1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగ హేతువు మరియు ఆయు క్షీణత కలుగ చేస్తుంది)
9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.( *బ్రహ్మా వైవర్తపురాణం*)
10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాతనే పడుకోవాలి
11. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
12. *దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు*.యముడు మరియు దుష్ట గ్రహములు నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.
13. గుండెపై చేయి వేసుకుని, గృహము యొక్క బీము కింద మరియు కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
14. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.
15. పడుకొని పుస్తక పఠనం (చదవడం) వలన నేత్ర జ్యోతి(కంటి చూపు) మసక బారుతుంది.

 ఈ 15 నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు

30, జులై 2024, మంగళవారం

ఉన్నదానితో తృప్తిని చెందక - విఫలమయ్యానన్న వ్యధతో కుములుటేలరా!

వార్ధక షట్పద:

ఉన్నదానితో తృప్తిని చెందక, మరింత
ఉన్నతముగా  ఎదగవలెననన్న కోరిక!
నిన్ను కుదురుగా కూర్చోనీయక, నీ సామర్ధ్యనికి తగినట్లుగా,
మున్ను కలలు గన్నట్టి  జీవితము లేదని,
కన్ను మీద కునుకైనా  లేక పరిగెత్తి,
ఉన్న జీవిమంతా విఫలమయ్యానన్న వ్యధతో కుములుటేలరా!

-శివ భరద్వాజ్

16, జులై 2024, మంగళవారం

అంతర్యామి - మనోమౌనం

 🔱 అంతర్యామి 🔱

# మనోమౌనం #

🍁మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది, అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. మాట్లాడకుండా కూడా చాలా పనులు చక్కబెట్టవచ్చు. భావాన్ని వ్యక్తం చేయనూ వచ్చు. అలాచేస్తే మాట్లాడటానికి ఖర్చయ్యే శక్తి ఆదా అవుతుంది. పైగా అనవసర వివాదాలకు ఆస్కారం ఉండదు. నిజానికి కొన్ని సమయాల్లో మాట్లాడటంకన్నా మౌనం వహించడం మరీ మంచిది. దానికెంతో ఓర్పు, నేర్పు, నిగ్రహశక్తి, సంయమనం కావాలి.

🍁అనవసర పదజాలాన్ని, మాటలను నియంత్రించి పరిపూర్ణత కలిగిన ఆలోచనా విధానానికి తొలి మెట్టు మౌనం. దీన్ని వహించడం వల్ల సాత్వికత ఏర్పడుతుంది. సాత్వికత మంచిచెడుల విచక్షణను తెలియజేస్తుంది.

🍁మౌనం రెండు రకాలు. అవి వాక్ మౌనం (మాట్లాడకుండా మౌనంగా ఉండటం), మనోమౌనం(ధ్యానం) అని గీతాచార్యులు వివరించారు. ఒక్కొక్కసారి ఎదుటివారి కాఠిన్యపు మాటలుగాని, ఆధారరహిత ఆరోపణలను కానీ ఖండించవలసిన అవసరం ఏర్పడుతుంది. కానీ వాటిని వారు వినే స్థితి లో ఉండరు. అలాంటి సమయంలో మాట్లాడకుండా ఊరు కోవడమే ఉత్తమం. అదీకాక మనం చెప్పే మాటలకు విలువ, ఆచరణ లేనప్పుడు సైతం మాట్లాడకుండా ఉండటం మేలు. దీన్నే వాకామౌనం అంటారు. ఇంద్రియాలు మనసును విషయాదుల వైపు లాగుతాయి. వాటి వైపు మనసు మరలకుండా జాగ్రత్తలు తీసుకోవడం మనోమౌనం.

🍁ధ్యానం చేయడంలో మౌనం ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది ఆత్మశక్తిని పెంచుతుంది. పరిణతి చెందిన మనస్తత్వానికి, ఆలోచనా పరిధికి మౌనం నిదర్శనం. గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుంది. కాబట్టి మౌనం వహించడం చేతగానితనం మాత్రం కాదు. మౌనం అర్ధాంగీకారం అనే నానుడి ఉంది. అంటే మౌనంగా ఉంటే సగం అంగీకరించినట్లే అని. కానీ అలా ఉండటం అంగీకారం కాదు. ఆలోచన, విశ్లేషణ కారణకారణాల సమతుల్యతను బేరీజు వేసుకునే సంధిసమయం మాత్రమే.

🍁మౌనం మానసిక తపస్సు అంటే మానసిక మౌనమే విలక్షణమని గ్రహించాలి. అయితే మనోమౌనం కోసం ప్రయత్నించకుండా వాక్ మౌనం మాత్రమే కలిగి ఉంటే... మనసు అనేక సంకల్పాలతో కూడిఉండి. చంచలమవుతుంది. అంటే ఆ మౌనం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.

🍁మౌనాన్ని అభ్యసించాలి. దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లుంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, సందిగ్ధావస్థలో పడినప్పుడు, విరుద్ధ విషయాలను చర్చిస్తున్నప్పుడు, మౌనం శక్తిమంతమైన ఆయుధమై గట్టున పడేస్తుంది. ప్రశాంతమైన పరిసరాలు మౌన ధారణకు తోడ్పడతాయి. ధ్యానాది విషయాల్లో ఏకాగ్రతను కలిగించే ఇంధనం మౌనం. అయితే అవసర సమయాల్లో మౌనం వహిస్తే అగచాట్లు తప్పవు. అశక్తతను, చేతగానితనాన్ని తెలియజేస్తుంది. మౌనం దివ్యాయుధం. సందర్భోచితంగా ప్రయోగించినప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుంది.

🍁మౌనం పాటించినప్పుడు ఆ వ్యక్తి సులభంగా మానసిక స్థైర్యాన్ని పొందగలడని గుర్తిస్తాం. భోజనం చేసినప్పుడు మౌనంగా భుజించడ0 అవసరం. జాతిపిత మహాత్మాగాంధీ వారాని  ఒకరోజు మౌనం పాటించేవారట. కొంతమంది ఇప్పటికీ వారానికి ఒకరోజు ఆనవాయితీగా మౌనవ్రతం పాటిస్తుంటారు.🙏

✍️- వి. ఎస్. రాజమౌళి

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

14, జులై 2024, ఆదివారం

అంతర్యామి - హారతి

 🔱 అంతర్యామి 🔱

# హారతి #

🍁శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. హారతిని ఆర్తితో స్వామికి అర్పిస్తాం.. తరచుగా అన్ని విధాలైన శుభకార్యాల్లో హారతినందిస్తాం. హారతి ఇస్తున్నప్పుడు ” మంత్రోచ్చారణ, మంగళవాద్యాలు, గంటానాదం, సంకీర్తనలు, శంఖం పూరించడం- ఇలాంటివన్నీ ఆయా దేవాలయాల్లోని ఆచారాలు, సంప్ర దాయాలను బట్టి అనుసరిస్తారు.

🍁హారతిని వలయాకారంలో గడి యారంలోని ముళ్ల దిశగా భగవంతుడి విగ్రహం ముందు తిప్పుతారు. ఆ జ్యోతి నుంచి ఉత్పన్నమయ్యే సాత్విక తరంగాలు వలయాకారంగా పరిభ్రమిస్తాయి. ఈ తరంగాల కవచం భక్తుల భక్తి భావనను ఉద్దీప్తం చేస్తుంది. ఆత్మ సమర్పణ భావానికి హారతి ప్రముఖమైన ఆలంబనం. ఏకాగ్రతకు, తాదాత్మ్యతకు హారతి స్పూర్తి అవుతుంది. హారతి భక్తుడిలో దాగి ఉన్న అహంకారాన్ని కరిగే కర్పూరంలా హరిస్తుంది. హారతిని స్వామివారి వదనానికి రెండు అరచేతులతో చూపి, ఆ తరవాత భక్తులందరూ శ్రద్ధాభక్తులతో కళ్లకద్దుకుంటారు.

🍁వ్రతాలు, నోములు, ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాదులు, వ్రతాలు, పుష్కరాలు, పర్వదినాలు, ఆయుధపూజలు, గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు... ఇలా అనేక సందర్భాల్లో హారతిని ఇస్తారు.

🍁ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం- మూడు పూటలా కొన్ని దేవాలయాల్లో హారతి ఇస్తారు. కాకడారతి, పూజారతి, ముఖ్యారతి, ధూపారతి, తేజారతి- ఇలా పలు పేర్లతో వీటిని పిలుస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మహాహార ఇస్తారు.

🍁హారతికి తరచుగా కర్పూరాన్నే వినియోగిస్తారు. కొన్ని హారతులను వత్తులతో వెలిగిస్తారు. అందుకు నేతినే ఉపయోగిస్తారు. క్షత్రియవీరులు రణరంగానికి బయలుదేరేముందు, తిరిగి విజేతలై వచ్చాక హారతినిస్తారు. నూతన దంపతులకు ఇచ్చే హారతి మంగళహారతి. పుట్టినరోజుల సందర్భాల్లో, సంక్రాంతి మొదలైన పర్వదినా. చిన్నారులకు హారతి పట్టి ఆశీస్సులిస్తారు.

🍁ఆశ్వయుజ పూర్ణిమనాడు జ్యేష్ఠాపత్య నీరాజనం, నరక చతుర్దశినాడు నారీకర్తుక నీరాజనం, బలిపాడ్యమినాడు, పతినీరాజనం, యమ విదియరోజున భ్రాతృ నీరాజనం వీటిని 'ఔక్షణ' నీరాజనం అంటారు. ఇంకా నేత్రహారతి, బిల్వహారతి, నందిహారతి, పంచహారతి, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, ధేనుహారతి, గజహారతి- ఇలా పలు సందర్భాలను బట్టి హారతులిస్తారు.

🍁దేహం ప్రమిదకు వత్తి వైరాగ్యానికి ప్రతీక.. జ్యోతి ఆత్మకు ప్రతీక. తైలం సాధనకు ప్రతీక. కాంతి జ్ఞానానికి ప్రతీక- ఇదే హారతికి గల అంతరార్థం, హారతికి నువ్వులనూనె, ఆవునెయ్యి, అవిశనూనె, కొబ్బరినూనె, అష్టమూలికా తైలం, ఆయా ప్రాంతాల ఆచారాలననుసరించి వినియోగిస్తారు. పాపపరిహారార్థం కొందరు ఆవనూనె, వేపను  వాడతారు. హారతికి అయిదు నుంచి 365 వత్తుల వరకు వినియోగిస్తారు. పత్తిగింజల నుంచి తీసిన పత్తితో చేసిన వత్తులు మాత్రమే శ్రేష్ఠమైనవి. బూరుగు దూది నుంచి, చేనేత వస్త్రం ముక్కలతోను వత్తులు చేస్తారు.

🍁హారతి సమర్పణ చేసినవారికి, హారతి కాంతిని కళ్లకు అద్దుకున్నవారికి అనంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.🙏

✍️చిమ్మపూడి శ్రీరామమూర్తి

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

అంతర్యామి - మోక్ష మార్గం

 🙏శ్రీరస్తు-శుభమస్తు🙏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🌹ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది, అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది.
ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు, రాజు అందుకు సమ్మతించాడు.
ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు.
ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది! ... రాత్రి అయింది.
అది మొదటి యామం, తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు, హెచ్చరిక చేసే సమయం వచ్చింది.అప్పుడు మూగవాడు ఆ  బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:
“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః."
మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు...
కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు.
'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు.
ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది, కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.
మళ్ళా రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:
“జన్మదుఃఖం జరాదుఃఖం
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”
పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.
ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది:
“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”
తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు.
ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు...
ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ బాలుడు...
“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”అని చాటింపు వేశాడు.ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు...
ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు.
పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు.
కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.
మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు...
అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు.
అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు.”
తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు.
అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.
తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు.
అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు.
అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు.
“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి.
నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు.
రాజు అమితాశ్చర్యపోయాడు, అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు.
ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు,
ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు.
“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు.
అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు.
నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం.”
బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు.
అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు.
వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు.
ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు.
అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది...అదేమంటే:..*
మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి.
అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది...
అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి.
ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది...
మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు...
అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు.
అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు...
దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.
ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు.
బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.
"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు.
అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ...
ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా?
నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది.
భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు !!!...
కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం ఒక పాఠమైనది.”
అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు.
మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది.
సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది.
కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది...
నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక!
కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుని  గౌరవిస్తూ ప్రవర్తిస్తే‌‌ తప్పకుండా అంత్యకాల నామ స్మరణ తప్పక లభిస్తుంది...
భగవద్గీత లో చెప్పినటుల‌ "అద్వేష్టా సర్వ భూతానాం" ఆచరించుతూ ఉంటేనే ఇది సాధ్యము.
ఏ ఒక్కరి మీద ద్వేషము లేని వారికే ఇది సుసాధ్యము...
ఎందుకనగా తను వేరొకరిని ద్వేషించే సమయములో ఒకవేళ  మరణము సంభవస్తే అదే ద్వేషముతో పాము-కప్ప జన్మలను, మరియు గజ-కచ్చప (ఏనుగు-తాబేలు) జన్మలను పొంది అనేక యుగములు తగవులాడుకొనే అవకాశము ఉన్నదని పురాణములు చెప్పుచున్నవి. కావున మొట్టమొదలు మనము శత్రువులు అనుకునే వారిమీద మన అభిప్రాయములను సరిదిద్దుకుని "అద్వేష్టా సర్వభూతానాం" గా తయారు అవడము అత్యంతావశ్యకము.
🙏🙏🙏🙏🙏🙏      
🌹🚩జై శ్రీ కృష్ణ🚩🌹
🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం పరమాత్మ పాదార విందార్పణమస్తు*                  
🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹
లోకాసమస్త సుఖినోభవంతు
🌹🌹🌹🌹🌹🌹🌹
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌹🌹🌷🙏🌷🌹🌹

10, జులై 2024, బుధవారం

సుభాషితం - జూలై 2024

సుభాషితం - 1:

व्यवस्थितः प्रशांतात्मा कुपितोऽप्यभयंकरः ।
अव्यवस्थितचित्तस्य प्रसादोऽपि भयंकरः ॥

వ్యవస్థితః ప్రశాంతాత్మా కుపితోప్యభయంకరః ।

అవ్యవస్థితచిత్తస్య ప్రసాదోపి భయంకరః ॥

 

భావము: 

ప్రశాంత చిత్తముతో యోజన చేసి కార్యము చేయువారు, కోపముతో ఉన్నప్పటికీ, భయపడనక్కరలేదు. అస్తవ్యస్త మనస్సుతో యోజన చేసి కార్యము చేయువారు, ప్రసన్నముగా కనిపించినప్పటికీ భయపడవలసినదే.

 

సుభాషితం - 2:

धर्मो जयति नाधर्मः, सत्यं जयति नानृतम्

क्षमा जयति न क्रोधो, देवो जयती नासुरः

 

ధర్మో జయతి నాధర్మః , సత్యం జయతి నానృతమ్ ।
క్షమా జయతి న క్రోధో, దేవో జయతి నాసురః॥ 

 

భావము: 

ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది కాని, అధర్మము కాదు. సత్యమే జయిస్తుంది కాని అసత్యము కాదు. సహనమే జయిస్తుంది కాని కోపము కాదు. విష్ణువే జయించును కాని రాక్షసుడు కాదు.
 

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...