విప్లవ శంఖం పూరించిరదిగో త్రిమూర్తులు
రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవులు.
లాలాజీ రక్తాన్ని రుచి చూసిన శాండర్సు,
గుంటనక్క వేటాడగా సింహాలై గర్జించిరదిగో
బెబ్బులులై ముందుకురికి, మట్టుబెట్టి,
పంజాబు కేసరికి ఘన నివాళి ఘటియించే
శాండర్సు రక్తము తోడ తర్పణాలు వదిలి,
జనులందరు ముదముతోడ హర్షించే.
ఉరికైనా వెరువక ముందుకు సాగిరి,
స్వాతంత్ర్య సమరాన అమరపురికేగిరి.
వారు పూరించిన విప్లవ శంఖపు ధ్వని
ప్రతిధ్వనిస్తూనే ఉన్నది, నేటికీ ఈనాటికి.
ధన్యురాలివమ్మ నవభారత జనని,
నీ బిడ్డల తెగువ స్ఫూర్తినింపే భరత భూమికి.
అమరవీరుల దినోత్సవ సందర్భముగా
-శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
23, మార్చి 2024, శనివారం
అమరవీరుల దినోత్సవం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తేటగీతి: అప్పు చేయకు ఆడంబరాల కొఱకు
అప్పు చేయకు, ఆడంబరాల కొఱకు, తప్పు చేయకు, సంబరాల కొఱకు, మరి వినక చేసిన ముప్పువాటిల్లు, పట్టు నీకు జీవితకాలంబు తేరుకొనగ! -శివ భరద్వాజ్ Mean...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
ఎదురు చూస్తున్నా, ప్రతి నిముషం నిన్ను తిరిగి పొందాలని, ఎదురు చూస్తున్నా, కాలంతో కనుమరుగైన నిన్ను రప్పించాలని, మన మధ్య ఆ చిలిపి తగాదాలేవి? మన...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి