28, ఫిబ్రవరి 2024, బుధవారం

మన ఇల్లు - మన భూమి

మన ఇల్లు భద్రమైతే, మన కుటుంబం సురక్షితం.
మన భూమి భద్రమైతే, సర్వ జీవులు సురక్షితం.
ఆశించక ప్రేమ పంచేది తల్లి.
ఆశించక మనుగడ నిచ్చేది నేల తల్లి.
స్వార్ధమెరుగక నేల తల్లి ఇచ్చేది తీసుకునే మనం,
స్వార్ధమెరుగక నేల తల్లిని రక్షించాల్సింది మనం.
ప్రకృతి అందానికి పరవశించే మనం,
ప్రకృతి అందాన్ని కాపాడాల్సింది మనం.
ప్రతి ఇల్లు నందనవనమైతే,
పుడమంతా పచ్చదనమే, మనసంతా ఆనందమే.
మనకు దక్కిన భాగ్యం, మూగ జీవులకు లేదు.
కలుషితం చేయకుంటే అది వాటికి వరమే.
సృష్టిలో ఏ జీవి కలుషితానికి కారణం కాదు,
కరుణలేని కర్కశ మానవుడు తప్ప.

స్వార్ధపరులమైన మనం భూమిని మనదిగా చేసుకున్నాం.
పచ్చని అడవులు నరుకుతున్నాం,
పారె నదులను కాలుష్య విషంతో ప్రవహింపచేస్తున్నాం.
ఎవరికి తలవంచని కొండలను,
మన స్వార్ధనికి మెడలు వంచి , నడుము విరిచి
కనుమరుగు చేసేస్తున్నాం.
సముద్రాలు కాలుష్య గరళంతో నింపేస్తున్నాం.

మన మార్గాన్ని మార్చుకోవాలి,
వన సంరక్షణ చేయాలి,
వన్య ప్రాణుల సంరక్షించాలి,
వ్యర్ధాలను తగ్గించాలి,
తిరిగి ఉపయోగించాలి,
తిరిగి వాడుకోగలిగేలా మార్చాలి.
మనమిది గ్రహించాలి,
మన తప్పును దిద్దుకోవాలి,
మనమంతా మనవంతు భాద్యతతో మెలగాలి.

మన ఇంటిలా భూమిని చూసుకుంటే,
మనకు చాలా వరాలు ఇస్తుంది.
స్వచ్చమైన గాలి,
స్వచ్చమైన నీరు,
ఆరోగ్యవంతమైన ఆహారం,
ఆహ్లాద పరిచే ప్రకృతిని ప్రసాదిస్తుంది.
పర్యావరణ భాద్యత మనపై ఉంది.
అన్నిజీవులకు బతికే హక్కు ఉంది.
ప్రకృతితో బంధం పెంచుకోవాల్సి ఉంది.

ఇల్లు లేకపోయినా బతకవచ్చు,
భూమి ఆక్రోశిస్తే బతుకులేదు.

-శివ భరద్వాజ్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేం రాజకీయ నాయకులం

కడుపు నిండుగా మాంసాహారం, గొంతు నిండుగా మద్యపానం, జేబు నిండుగా నల్లధనం, ఉచిత హామీలు ఎరగా పెట్టి గేలం వేస్తాం. చిక్కిన చేపల దన్నుగ చిక్కని చేప...