24, ఫిబ్రవరి 2024, శనివారం

అమ్మా నీకు వీడ్కోలు

 కొత్త రోజును ప్రారంభించడానికి,  ప్రతి ఉదయం మేల్కొంటాను,
కానీ అమ్మ నిన్ను కోల్పోయిన బాధ ఎన్నటికీ పోదు.
నేను చేయవలసిన పనులను చేయటానికి ఉద్యోగానికి వెళ్తాను,
కానీ సమయం గడిచేకొద్దీ, అమ్మ నీ గురించి మళ్లీ ఆలోచిస్తున్నాను.
నాకు తెలియకుండానే నీకు కాల్ చేసి నీతో మాట్లాడాలనుకుంటున్నాను.
కానీ ఈ జన్మకు ఆ అవకాశం రాదని గుర్తుకువచ్చి గొంతు ఆగిపోతుంది,
అమ్మ నువ్వు ఊరిలో లేవు అన్న విషయం జ్ఞప్తికి వచ్చి నా హృదయం ఏడుస్తుంది
నిన్ను మళ్ళీ చూడాలని, వీడ్కోలు చెప్పాలని అది ఆశ పడుతుంది
"అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు ప్రేమిస్తూనే ఉంటాను" .

నువ్వు వెళ్లిపోయిన రోజు నాకు తెలియదు
నేను వెళ్ళలేని చోటికి నువ్వు వెళ్తున్నావని.
నీ గురించిన జ్ఞాపకాలన్నీ అమూల్యమైనవి,
నిన్ను చాలా మిస్ అవుతున్నాను అమ్మా,
నువ్వు నాతోనే ఉంటే బావుండేదని కోరుకొని రోజు  లేదమ్మా!
నేను ఏడవాల్సిన అవసరం వచ్చినప్పుడు, నా వెన్నుతట్టి ఓదార్చేవారెవరమ్మ?
నా గుండె లోతులోని భావాలు అర్ధం చేసుకోగలిగేవారెవరమ్మ?

"అమ్మా నీకు వీడ్కోలు" అని చెప్పడం చాలా కష్టం.

ఏదో ఒక రోజు అంతా బాగానే ఉంటుందని నాకు తెలుసు,
మీరు లేకపోయినా, మీరు నేర్పిన విలువలతో,
జీవిత పోటీలో ఎలా నిలిచామో, మేము ఎలా ఎదిగామో,
అన్నీ కథలుగా నీతో పంచుకోవడానికి నిన్ను మళ్లీ కలుస్తాను,
అప్పటి వరకు నీ జ్ఞాపకాలు  నా గుండె అరలలో భద్రమే అమ్మా.
నీ జ్ఞాపకాలన్నిటిని, నీ ప్రేమనంతటిని నా  ప్రియమైన వారికి అందజేస్తాను.

కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను,  అమ్మ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేం రాజకీయ నాయకులం

కడుపు నిండుగా మాంసాహారం, గొంతు నిండుగా మద్యపానం, జేబు నిండుగా నల్లధనం, ఉచిత హామీలు ఎరగా పెట్టి గేలం వేస్తాం. చిక్కిన చేపల దన్నుగ చిక్కని చేప...