16, జనవరి 2024, మంగళవారం

మత్తు అదో గమ్మత్తు

 మత్తు అదో గమ్మత్తు,
నాయకుల పరమ పద సోపానానికి అదే తొలి నిచ్చెనైనట్టు,
అది లేకపోతె ప్రభుత్వం నడవడానికి ఇంధనమే లేనట్టు,
గాంధీకి గౌరవమిచ్చి ఆగిన ఆయన పుట్టిన రాష్ట్రంలో కూడా
తిరిగి మొదలైనట్టి ఘన చరిత్ర దాని సొంతం.

పంచ మహాపాతకాలలో ఒకటైనా,
అదేమి చేయనట్టు,
దానివలన పోయే ప్రాణాలు ఎన్నివున్నా,
అదేమి ముద్దాయి కానట్టు,
దానిని ముట్టుకోక పోతే మహా పాపమన్నట్టు,
ముట్టుకోనట్టి వాడు మహా పాపి అన్నట్టు,
ఉంటుంది మన వ్యవహారం.

సినిమాలకు అదే మూలాధారమైనట్టు,
అదేమి పెద్ద వ్యసనం కానట్టు
అదో పెద్ద ఫ్యాషన్ అయినట్టు,
నాగరిక సమాజానికి అదే తార్కాణమన్నట్టు
ఉంటుంది మన వ్యవహారం.

బాధలోనూ దాని అవసరం ఉంది,
సంతోషంలోను దాని అవసరముంది,
ప్రేమ సఫలమైనా దానితో పార్టి,
ప్రేమ విఫలమైనా దానితో దోస్తీ,
మత్తు నిజంగానే అదో గమ్మత్తు.
దాని చేతిలో అందరూ చిత్తు చిత్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...