24, జనవరి 2024, బుధవారం

బాలరామునికి అక్షర సుమాంజలి

రేలా రేలా రాముడో, రాములల్లా రాముడో
జరా జరా సూడరో, ముద్దు బాల రాముడో
కళ్లారా సూడరో, కౌసల్య పుత్రుడో,
మళ్ళా మళ్ళా సూడరో, ముద్దు బాల రాముడో  "రేలా రేలా"
దశరధుని బిడ్డడో, ముద్దు బాల రాముడో
రఘువంశ తిలకుడో, రాజ రాజు రాముడో  "రేలా రేలా"
కారుణ్య మూర్తిరో, కరుణా స్వరూపుడో,
కమలాన నిలిచిన, కందర్ప రూపుడో "రేలా రేలా"
చూడు చూడు పిల్లడో,  రాములల్లా రాముడో
చందమామ రూపురో, ముద్దు బాల రాముడో "రేలా రేలా"
సంపంగి పూవురో, అందాల రాముడో,
రాజీవ నేత్రుడో, రతనాల రాముడో "రేలా రేలా"
భలే భలే రాముడో, బాలక్ రాముడో
బాధలన్నీ తీర్చగ, బయలెల్లినాడు సూడరో "రేలా రేలా"

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రథ సప్తమి ప్రాముఖ్యత - ఏడు సంఖ్య రహస్యం - భీష్ముడి 7 అవయవాలు - ఆరోగ్యం & ధర్మం

🌞 రథ సప్తమి ప్రాముఖ్యత మన భారతీయ సంప్రదాయంలో పండుగలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు — అవి మన జీవన విధానాన్ని శుద్ధి చేసే మార్గదర్శకాలు. అట...