రేలా రేలా రాముడో, రాములల్లా రాముడో
జరా జరా సూడరో, ముద్దు బాల రాముడో
కళ్లారా సూడరో, కౌసల్య పుత్రుడో,
మళ్ళా మళ్ళా సూడరో, ముద్దు బాల రాముడో "రేలా రేలా"
దశరధుని బిడ్డడో, ముద్దు బాల రాముడో
రఘువంశ తిలకుడో, రాజ రాజు రాముడో "రేలా రేలా"
కారుణ్య మూర్తిరో, కరుణా స్వరూపుడో,
కమలాన నిలిచిన, కందర్ప రూపుడో "రేలా రేలా"
చూడు చూడు పిల్లడో, రాములల్లా రాముడో
చందమామ రూపురో, ముద్దు బాల రాముడో "రేలా రేలా"
సంపంగి పూవురో, అందాల రాముడో,
రాజీవ నేత్రుడో, రతనాల రాముడో "రేలా రేలా"
భలే భలే రాముడో, బాలక్ రాముడో
బాధలన్నీ తీర్చగ, బయలెల్లినాడు సూడరో "రేలా రేలా"
-శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
24, జనవరి 2024, బుధవారం
బాలరామునికి అక్షర సుమాంజలి
16, జనవరి 2024, మంగళవారం
మత్తు అదో గమ్మత్తు
మత్తు అదో గమ్మత్తు,
నాయకుల పరమ పద సోపానానికి అదే తొలి నిచ్చెనైనట్టు,
అది లేకపోతె ప్రభుత్వం నడవడానికి ఇంధనమే లేనట్టు,
గాంధీకి గౌరవమిచ్చి ఆగిన ఆయన పుట్టిన రాష్ట్రంలో కూడా
తిరిగి మొదలైనట్టి ఘన చరిత్ర దాని సొంతం.
పంచ మహాపాతకాలలో ఒకటైనా,
అదేమి చేయనట్టు,
దానివలన పోయే ప్రాణాలు ఎన్నివున్నా,
అదేమి ముద్దాయి కానట్టు,
దానిని ముట్టుకోక పోతే మహా పాపమన్నట్టు,
ముట్టుకోనట్టి వాడు మహా పాపి అన్నట్టు,
ఉంటుంది మన వ్యవహారం.
సినిమాలకు అదే మూలాధారమైనట్టు,
అదేమి పెద్ద వ్యసనం కానట్టు
అదో పెద్ద ఫ్యాషన్ అయినట్టు,
నాగరిక సమాజానికి అదే తార్కాణమన్నట్టు
ఉంటుంది మన వ్యవహారం.
బాధలోనూ దాని అవసరం ఉంది,
సంతోషంలోను దాని అవసరముంది,
ప్రేమ సఫలమైనా దానితో పార్టి,
ప్రేమ విఫలమైనా దానితో దోస్తీ,
మత్తు నిజంగానే అదో గమ్మత్తు.
దాని చేతిలో అందరూ చిత్తు చిత్తు.
మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?
శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి? తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
కరోనా సంతోషం కలిగించింది జనాలను నిలువు దోపిడి చేస్తున్న వైద్యాలయాలకు టీకాల తో వ్యాపారం చేస్తున్న మందుల కంపెనీ లకు మందులను బ్లాక్ మార్కెట్ చ...